14 Years for Darling : 14 ఏళ్లు పూర్తి చేసుకున్న డార్లింగ్… అప్పట్లో వచ్చిన కలెక్షన్లు ఎంతంటే?

14 Years for Darling : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన ఫ్యామిలీ అండ్ లవ్ ఎంటర్టైలర్ డార్లింగ్. ఈ మూవీ రిలీజయ్యి నేటికీ 14 ఏళ్ళు పూర్తవుతోంది. ఇప్పుడంటే ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ కాబట్టి ఆయన నటించే ప్రతి సినిమాకు దాదాపు 500 నుంచి 1000 కోట్ల వసూళ్లు వస్తున్నాయి. మరి ఆ రోజుల్లో డార్లింగ్ సినిమాకు వచ్చిన కలెక్షన్లు ఎంత అంటే?

ప్రభాస్ ఫ్లాఫ్స్ పరంపరకు డార్లింగ్ తో బ్రేక్..

ప్రభాస్, కాజల్ అగర్వాల్ కాంబోలో వచ్చిన డార్లింగ్ మూవీకి తొలిప్రేమ ఫేమ్ కరుణాకరన్ దర్శకత్వం వహించారు. ప్రభాస్ సినిమాలలో ది బెస్ట్ అని చెప్పుకోవడం స్టార్ట్ చేస్తే ముందు వరుసలో ఉంటుంది డార్లింగ్ మూవీ. 2010 ఏప్రిల్ 23న రిలీజ్ అయిన ఈ మూవీతో ప్రభాస్ ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా దగ్గరయ్యారు. నిజానికి చత్రపతి తర్వాత వరుస డిజాస్టర్లు అందుకుంటున్న ప్రభాస్ తో పాటే ఆయన అభిమానులు మరో మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న సమయంలో థియేటర్లలోకి వచ్చింది ఈ మూవీ.  అప్పటిదాకా చత్రపతి, బుజ్జిగాడు, బిల్లా లాంటి సినిమాలతో తెచ్చుకున్న మాస్ ఇమేజ్ ను పక్కన పెట్టి ఈ లవ్ అండ్ రొమాంటిక్ ఫ్యామిలీ మూవీని చేశారు ప్రభాస్.

డార్లింగ్ తో 6 కోట్ల లాభాలు

మొదటి షో తోనే హిట్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ ప్రభాస్ ప్లాఫ్స్ కు బ్రేక్ వేసి ఆయనకు మంచి కం బ్యాక్ ఇచ్చింది. అయితే ఈ మూవీ ఆ రోజుల్లో ఎంతవరకు కలెక్ట్ చేసిందో ఇప్పుడు చూద్దాం. డార్లింగ్ మూవీ అప్పట్లో 16.8 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసి 17 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగింది. ఫుల్ రన్ ముగిసేసరికి డార్లింగ్ మూవీకి 23 కోట్ల షేర్ వచ్చింది. అంటే బయ్యర్లకు 6 కోట్లకు పైగా లాభాలు వచ్చాయి. ప్రభాస్ కు ఇలాంటి విజయం ఐదేళ్ల గ్యాప్ తర్వాత వచ్చిందని చెప్పాలి. అంతకంటే ముందు ఆ రేంజ్ లో ఆయన హిట్ కొట్టింది చత్రపతి మూవీతోనే. 2010లో రిలీజ్ అయిన ఈ మూవీ ఇప్పటికి కూడా ప్రభాస్ అభిమానులకు మాత్రమే కాకుండా టాలీవుడ్ మూవీ లవర్స్ కు ఫేవరెట్ అని చెప్పొచ్చు.

- Advertisement -

డార్లింగ్ మూవీ ఏరియా వైజ్ ఫైనల్ గా కలెక్షన్ చూస్తే…

నైజాం 6.23 కోట్లు, సీడెడ్ 2.21 కోట్లు, ఈస్ట్ 2.14 కోట్లు, వెస్ట్ 2. 65 కోట్లు, ఉత్తరాంధ్ర 3.65 కోట్లు, గుంటూరు 2.6 కోట్లు, కృష్ణ 2.41 కోట్లు, నెల్లూరు 1.02 కోట్లు, ఏపీ ప్లస్ తెలంగాణ టోటల్గా 22.44 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్ 0.47 కోట్లు, వరల్డ్ వైడ్ టోటల్ గా చూసుకుంటే 22.91 కోట్లు కొల్లగొట్టింది డార్లింగ్ మూవీ. నైజాంలో ఈ మూవీని నిర్మాత దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేశారు. ఈ మూవీతో ఆయన మంచి లాభాలను జేబులో వేసుకున్నారు. అలాగే ప్రభాస్ కు కూడా ఈ మూవీ హిట్ అప్పట్లో కాస్త ఊరటనిచ్చింది. అలాగే తెరపై ప్రభాస్, కాజల్ జోడికి ఆడియన్స్ ఫిదా అయ్యారు. లవర్ బాయ్ గా ప్రభాస్, అల్లరి పిల్లగా కాజల్ ఈ మూవీలో అదరగొట్టారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు