The India Box office March 2024 : మార్చిలో 971 కోట్ల కలెక్షన్స్… టాప్ 10 సినిమాల్లో ఆ బాలీవుడ్ మూవీదే అగ్రస్థానం

The India Box office March 2024 : 2024 మార్చిలో 971 కోట్ల కలెక్షన్స్ ను కొల్లగొట్టింది ఇండియన్ బాక్స్ ఆఫీస్. ఈ మూడు నెలల్లో మార్చి నెలలోనే ఎక్కువ కలెక్షన్లు రావడం విశేషం. మరి మార్చ్ నెలలో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 సినిమాలు ఏంటి? మార్చి బాక్స్ ఆఫీస్ లెక్కలు ఎలా ఉన్నాయి? అనే ఇంట్రెస్టింగ్ విషయంపై ఓ లుక్కేద్దాం పదండి.

మార్చ్ లోనే ఎక్కువ కలెక్షన్స్

సైతాన్, గాడ్జిల్లా x కాంగ్: ది న్యూ ఎంపైర్, ఆడు జీవితం సినిమాలు అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాలుగా చరిత్రను క్రియేట్ చేశాయి. ఈ సినిమాల్లో ఒక్కోటి దాదాపు 100 కోట్లకు పైగా కలెక్షన్లను కొల్లగొట్టాయి. అయితే ఆడుజీవితం ఈ ఏడాది మలయాళ సినిమాలకు నడుస్తున్న గోల్డెన్ టైంను కంటిన్యూ చేసింది. ఇప్పటిదాకా మంచి కలెక్షన్స్ రాబట్టిన మలయాళ సినిమాలు ఆడుజీవితంతో కలిపి ఈ ఏడాది ఏకంగా మలయాళ బాక్స్ ఆఫీస్ 405 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టింది. 2023లో మొత్తం చూసుకున్నా మలయాళ బాక్స్ ఆఫీస్ ఈ రేంజ్ వసూళ్లను చూడకపోవడం గమనార్హం. 2023తో పోలిస్తే 2024 మొదటి మూడు నెలల్లోనే బాక్స్ మలయాళ బాక్స్ ఆఫీస్ 71% కలెక్షన్లను చూసింది. జనవరిలో బాక్స్ ఆఫీస్ 934 కోట్ల కలెక్షన్లను, ఫిబ్రవరిలో 685 కోట్లు, మార్చ్ లో 971 కోట్లను సాధించింది.

మార్చ్ లో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 సినిమాల లిస్ట్

ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద మార్చ్ లో రిలీజ్ అయిన సినిమాలలో భారీ కలెక్షన్లు కొల్లగొట్టి టాప్ 10 సినిమాల జాబితాలో స్థానం దక్కించుకున్న సినిమాలు ఏంటంటే… 173 కోట్ల కలెక్షన్లతో సైతాన్ మూవీ ఈ జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది. 129 కోట్లతో గాడ్జిల్లా 2వ స్థానంలో, 102 కోట్లతో ఆడు జీవితం 3వ స్థానంలో, 93 కోట్లతో టిల్లు స్క్వేర్ 4వ స్థానంలో, 92 కోట్లతో క్రూ మూవీ 5వ స్థానంలో, 46 కోట్ల కలెక్షన్లతో కుంగ్ ఫు పాండా 4 మూవీ 6వ స్థానంలో, 39 కోట్లతో యోధ మూవీ 7వ స్థానంలో, 36 కోట్లతో మడగాన్ ఎక్స్ప్రెస్ మూవీ 8వ స్థానం, 34 కోట్లతో డ్యూన్ పార్ట్ 2 మూవీ 9వ స్థానంలో, 31 కోట్ల కలెక్షన్లతో స్వతంత్ర వీర్ సావర్కర్ మూవీ 10వ స్థానంలో నిలిచాయి.

- Advertisement -

మూడు హాలీవుడ్ సినిమాలే

ఇక మార్చ్ నెలలోనే టాప్ 10 అత్యధిక సాధించిన సినిమాలలో మూడు హాలీవుడ్ సినిమాలే ఉండడం విశేషం. గాడ్జిల్లా x కాంగ్: ది న్యూ ఎంపైర్, కుంగ్ ఫూ పాండా 4, డ్యూన్: పార్ట్ 2 మార్చ్ లో మంచి కలెక్షన్స్ రాబట్టాయి.

బాలీవుడ్ దే హవా

జనవరి నుంచి మార్చి వరకు బాక్స్ ఆఫీస్ సాధించిన కలెక్షన్లలో ఎక్కువ భాగం బాలీవుడ్ ఉండడం విశేషం. హిందీ పరిశ్రమ 36%, తెలుగు పరిశ్రమ 23%, మలయాళ ఇండస్ట్రీ 16%, హాలీవుడ్ 95, తమిళ్ 9%, కన్నడ 2%, ఇతర భాషలు 5 శాతం కలెక్షన్లను రాబట్టాయి.

మూడు నెలల్లో టాప్ 5 సినిమాలు

జనవరి నుంచి మార్చ్ వరకు రిలీజ్ అయిన సినిమాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 5 సినిమాలలో ఫైటర్, హనుమాన్, మంజుమ్మెల్ బాయ్స్, సైతాన్, గుంటూరు కారం వరుసగా ఐదు స్థానాల్లో నిలిచాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు