Geethanjali Malli Vachindhi : చిన్న టార్గెట్ తో వచ్చినా పనవ్వలేదు!

Geethanjali Malli Vachindhi : టాలీవుడ్ లో టిల్లు స్క్వేర్ సినిమా తర్వాత మరో హిట్ సినిమా రాలేదు. రెండు వారాల కింద రిలీజ్ అయిన ఫ్యామిలీ స్టార్ దారుణంగా పరాజయాన్ని చవిచూసింది. ఇక లాస్ట్ వీక్ అన్ని చిన్న సినిమాలే రిలీజ్ కావడంతో అందులో ఏ ఒక్క సినిమాపై ఆడియన్స్ అంతగా అంచనాలు పెట్టుకోలేదు. ఉన్నంత లో అంజలి నటించిన గీతాంజలి మళ్ళీ వచ్చింది ఓ మోస్తరు అంచనాలతో విడుదలైంది. బాక్స్ ఆఫీస్ దగ్గర సమ్మర్ స్పెషల్ గా కామెడీ హారర్ డ్రామాతో ఆడియన్స్ ముందుకు వచ్చ్సిన మూవీ కాగా అంజలి(Anjali) కెరీర్ లో ప్రతిష్టాత్మక 50వ సినిమాగా తెరకెక్కింది ఈ సినిమా. ఇక పదేళ్ల కింద వచ్చిన గీతాంజలి ఫస్ట్ పార్ట్ కి సీక్వెల్ గా ఈ లేటెస్ట్ మూవీ ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ (Geethanjali Malli Vachindhi ) తెరకెక్కింది. ఇక లాస్ట్ వీక్ రిలీజ్ అయిన ఈ చిత్రానికి ఆడియన్స్ నుండి మాత్రం అనుకున్న రేంజ్ లో రెస్పాన్స్ రాలేదని చెప్పాలి.

కలెక్షన్స్ లో దెబ్బేసిన గీతాంజలి2..

గీతాంజలి 2 సినిమాకు మొత్తం మీద తెలుగు మూవీ క్రిటిక్స్ సహా బీలో యావరేజ్ రివ్యూస్ ఇవ్వగా, ఈ సినిమాకి మాస్ సెంటర్స్ లో ఉన్నంతలో పర్వాలేదు అనిపించే కలెక్షన్స్ సొంతం అయ్యాయి. కానీ వచ్చిన వసూళ్లు పూర్తిగా డిజాస్టర్ అనిపించే ఓపెనింగ్స్ అనే చెప్పాలి. అయితే సినిమాకి అయిన చిన్న బిజినెస్ పరంగా ఇప్పుడు మొదటి వారాన్ని పర్వాలేదు అనిపించే కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకుందని చెప్పాలి. ఒకసారి సినిమా మొదటి వారంలో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… నైజాంలో 40 లక్షలు, ఆంధ్ర లో 45 లక్షలు షేర్ సాధించగా, ఇతర రాష్ట్రాల్లో ఓవర్సీస్ సహా కలుపుకుని మరో 30 లక్షలు రాబట్టింది. టోటల్ గా వరల్డ్ వైడ్ గా మొదటి వారం 1.15 కోట్ల షేర్ వసూలు చేయగా, 2.30 కోట్ల గ్రాస్ రాబట్టింది. అయితే బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా కష్టపడాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందని చెప్పాలి. మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ రేంజ్ 2.5 కోట్ల రేంజ్ లో ఉండగా మొదటి వారంలో సాధించిన కలెక్షన్స్ కాకుండా బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా 1.35 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది.

కోన వెంకట్ ఇప్పుడైనా తెలుసుంటాడా?

అయితే గీతాంజలి మళ్ళీ వచ్చింది సినిమా అనౌన్స్ అయినపుడు కూడా అంతగా బజ్ లేదు. ఏదో ట్రైలర్ కామెడీ గా ఉండడం వల్ల, ఫస్ట్ పార్ట్ సెంటిమెంట్ వల్ల, థియేటర్లకు జనాలు కాస్తయినా వచ్చారు. కానీ
హర్రర్ కామెడీలు ఏమాత్రం వర్కౌట్ అవ్వని ప్రజెంట్ టైంలో రిలీజ్ అవ్వడంతో పెద్దగా అంచనాలను అందుకోలేదు. సమ్మర్ టైంలో అనుకున్న రేంజ్ లో సినిమాలు లేకపోయినా కూడా ఉన్న సినిమాలు కూడా పెద్దగా ఇంపాక్ట్ ను చూపించడం లేదు. ఇక మిగిలిన రన్ లో ఈ సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి. అయితే రచయిత కోన వెంకట్ గీతాంజలి 2 సినిమా కోసం చాలా ప్రమోట్ చేసాడు గాని, ఇలాంటి రొటీన్ కంటెంట్ లు పదేళ్ల కిందటే జనాలు చూడడం మానేశారని తెలుసుకోవాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు