Friday OTT Releases : ఈ ఫ్రైడే ఓటిటిలో మూడు తెలుగు థ్రిల్లర్ సినిమాలు… డోంట్ మిస్

Friday OTT Releases : ఎప్పటిలాగే ఈ వీకెండ్ కూడా ఓటిటిలోకి చాలా సినిమాలు రాబోతున్నాయి. కానీ ఈ ఫ్రైడే వాటన్నింటిలోకెల్లా మూడు మాత్రమే థ్రిల్లర్ జానర్ లో రాబోతున్నాయి. అలాగే మరో ఇంట్రెస్టింగ్ కామెడీ మూవీ కూడా సందడి చేయబోతోంది. ఏకంగా 18 సినిమాలు ఈ వారం ఓటీటీలోకి క్యూ కడుతున్నప్పటికీ ఈ నాలుగు మూవీలను మాత్రం అస్సలు మిస్ కావొద్దు. మరి తప్పకుండా చూడాల్సిన ఈ నాలుగు సినిమాలు ఏ ఓటిటిలో, ఎప్పుడు స్ట్రీమింగ్ కాబోతున్నాయి అనే విషయంపై ఓ లుక్కేద్దాం పదండి.

1. మై డియర్ దొంగ

కమెడియన్ అభినవ్ గోమఠం నటించిన కామెడీ ఎంటర్టైనర్ మై డియర్ దొంగ. కామెడీ సినిమాల కోసం చూస్తున్న మూవీ లవర్స్ కు ఈ మూవీ బెస్ట్ ఆప్షన్. మై డియర్ దొంగ మూవీ ఏప్రిల్ 19న అంటే ఈ శుక్రవారం నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కాబోతోంది. ఓ దొంగ ఇంట్లోకి చొరబడి, ఆ తర్వాత లవర్ గా ఎలా మారాడు అన్నదే స్టోరీ.

2. రణం

తమిళ క్రైం థ్రిల్లర్ మూవీ రణం. షరీఫ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నందిత శ్వేత, తాన్య హోప్ హీరోయిన్లుగా నటించారు. వైభవ్ రెడ్డి హీరోగా కనిపించారు. ఓ నర్స్ హత్య చుట్టూ తిరిగే స్టోరీనే ఈ రణం మూవీ. పైగా హీరో పెయింటింగ్స్ వేస్తూ పోలీసులకు కేసులు సాల్వ్ చేయడంలో హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఈ శుక్రవారం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతోంది ఈ మూవీ. ఈ ఏడాదిలో వచ్చిన బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలలో ఒకటిగా విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్న ఈ మూవీని అస్సలు మిస్ కావొద్దు. క్రైమ్ మూవీ లవర్స్ కు ఈ వారం రణం బెస్ట్ ఆప్షన్.

- Advertisement -

3. సైరన్

మలయాళ స్టార్ హీరో జయం రవి, కీర్తి సురేష్, అనుపమ పరమేశ్వరన్ హీరో హీరోయిన్లుగా నటించిన రివేంజ్ డ్రామా సైరన్. పలు వాయిదాల అనంతరం ఏప్రిల్ 19 నుంచి తమిళ, తెలుగు భాషల్లో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. 14 ఏళ్ల జైలు జీవితాన్ని గడిపిన ఓ అంబులెన్స్ డ్రైవర్ స్టోరీనే ఈ మూవీ. ఇందులో కీర్తి సురేష్ పోలీస్ ఆఫీసర్ గా నటించింది.

4. ఆర్టికల్ 370

జమ్మూ కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తిని తొలగించిన సంఘటన చుట్టూ తిరిగే కథే ఆర్టికల్ 370. థియేటర్లలో ఈ మూవీకి మంచి రెస్పాన్సే వచ్చింది. యామి గౌతమ్, ప్రియమణి ఈ మూవీలో ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ శుక్రవారం ఆర్టికల్ 370 మూవీ జియో సినిమాలో రాబోతోంది.

ఇక ఈ నాలుగు సినిమాలతో పాటు సైలెన్స్ 2 అనే మరో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ కూడా అందుబాటులో ఉంది. ఏప్రిల్ 16 నుంచే ఈ మూవీ జి5లో స్ట్రీమింగ్ అవుతుంది. వీటితో పాటే రెబల్ మూన్ 2, డ్యూన్ 2 వంటి హాలీవుడ్ యాక్షన్ డ్రామాలు కూడా ఈ వారం ఓటీటీలోకి రాబోతున్నాయి. మరి ఈ వారం మీ చాయిస్ ఏంటి?

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు