Shilpa Shetty: శిల్పాశెట్టికి ఈడీ షాక్.. రాజ్ కుంద్రా కేసులో..!

Shilpa Shetty.. ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ శిల్పాశెట్టికి తాజాగా గట్టి షాక్ తగిలింది.. ఈమె భర్త రాజ్ కుంద్రా కేసు ప్రభావం ఇప్పుడు ఈమెపై పడినట్లు తెలుస్తోంది.. బాలీవుడ్ లో ఈ విషయం కాస్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.. ప్రస్తుతం రాజ్ కుంద్రా పై ఉన్న కేసుల ప్రభావం నటి శిల్పా శెట్టిపై పడినట్లు తెలుస్తోంది తాజాగా శిల్పా శెట్టి కి ఈడీ అధికారులు షాక్ ఇచ్చారు.. ఈమె పేరు పై ఉన్న ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది.. ఇప్పటికే పలు కేసులలో ఇబ్బంది పడుతున్న ఈ బాలీవుడ్ జంటకి మళ్ళీ ఈ విధంగా షాక్ ఇవ్వడంతో ఈ స్టార్ కపుల్స్ ఇప్పుడు చాలా సతమతమవుతున్నారు.

Shilpa Shetty:ED shock for Shilpa Shetty.. Raj Kundra case..!
Shilpa Shetty:ED shock for Shilpa Shetty.. Raj Kundra case..!

భర్త కారణంగా ఇబ్బంది పడుతున్న శిల్పా శెట్టి..

అనుకున్నట్టుగానే హీరోయిన్ గా స్టార్ పొజిషన్ కి ఎరిగింది.. ఈ పొజిషన్ కి చేరుకునే సమయంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది.. రూ.కోట్లు సంపాదించింది.. కోరుకున్న లగ్జరీ లైఫ్ ను సొంతం చేసుకుంది.. ముంబైలో కాస్ట్లీ ఏరియాలో బీచ్ వ్యూలో రూ.100 కోట్లతో తనకు నచ్చిన ఇంటిని కూడా కట్టుకుంది.. కుటుంబంతో చాలా సంతోషంగా ఉన్న నేపథ్యంలో ఇలాంటి కేసులు ఈమె మెడకు చుట్టుకున్నాయి. తన భర్త రాజ్ కుంద్రా పై వున్న కేసుతో తన హ్యాపీనెస్ మొత్తం పోయిందనే చెప్పాలి. రాజ్ కుంద్రా పై నమోదైన బిట్ కాయిన్ పోంజీ స్కామ్ కేసు దర్యాప్తులో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.. ఇక ఈడీ అధికారులు అటాచ్ చేసిన ఆస్తులలో జుహూ లోని రెసిడెన్షియల్ ప్లాట్ తో పాటు పూణేలోని శిల్పా శెట్టి పేరు మీద ఉన్న ఒక బంగ్లా, రాజ్ కుంద్రా పేరిట ఈక్విటీ షేర్లు కూడా ఉన్నాయి.. ప్రివిన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ ఆక్టివ్ 2002 కింద అధికారులు ఈ అటాచ్ నోటీసులను జారీ చేసినట్టు సమాచారం..
ఇకపోతే ఆర్థిక నేరాలతో పాటు బాలీవుడ్ లో సంచలనంగా మారిన పోర్న్ గ్రఫీ కేసులో కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ దంపతులు..

కొత్తగా వచ్చే అమ్మాయిలే టార్గెట్..

మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలోకి రావాలనుకున్న అమ్మాయిలతో ఇలా పోర్న్ వీడియోలలో నటింప చేశాడని రాజ్ కుంద్రా పై పోలీసులు గతంలో కేస్ పెట్టారు.. హీరోయిన్ కావాలని ఎంతోమంది ఎన్నో కలలతో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెడితే.. బలవంతంగా వీరిని ఆ రొంపిలోకి దింపారంటూ కేసుతోపాటు ఈ కేసులో మనీ లాండరింగ్ కోణం కూడా ఉందని ఈడీ అధికారులు చేస్తున్నారు. ఈ నేపద్యంలోనే తన పేరు మీద ఉన్న విలువైన ఆస్తులను భార్య శిల్పా శెట్టి మీద ట్రాన్స్ఫర్ చేయడంతో.. ఇప్పుడు ఈ అటాచ్ చేయవలసి వచ్చిందని సమాచారం.. మొత్తానికైతే ఎంతో సంతోషంగా ఫ్యామిలీని లీడ్ చేస్తున్న శిల్పా శెట్టికి ఇప్పుడు ఈడి షాక్ ఇవ్వడంతో ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఏది ఏమైనా తన భర్త రాజ్ కుంద్రా కారణంగా శిల్పా శెట్టి ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు