Mirai Title Meaning : తేజా సజ్జ కొత్త మూవీ టైటిల్ మిరాయికి మీనింగ్ ఏంటో తెలుసా?

Mirai Title Meaning : యంగ్ హీరో తేజా సజ్జ నటిస్తున్న కొత్త మూవీ టైటిల్ ని ఈరోజు మేకర్స్ అఫిషియల్ గా రివీల్ చేసిన విషయం తెలిసిందే. ఇంట్రెస్టింగ్ టీజర్ లో టైటిల్ తో పాటు తేజ ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేశారు. అయితే ఈ సినిమాకు మిరాయి అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. దీంతో అసలు మిరాయి అంటే మీనింగ్ ఏంటి అనే ఆసక్తి పెరిగిపోయింది అందరిలో. అందుకే ఆ పదానికి అర్థం ఏంటంటూ ఆరా తియ్యడం మొదలు పెట్టారు. మరి ఇంతకీ మిరాయి అంటే ఏంటి? అనే ఇంట్రెస్టింగ్ విషయంలోకి వెళ్తే…

మిరాయి మీనింగ్ ఇదే

గూగుల్ తల్లి ఇచ్చిన సమాచారం ప్రకారం మిరాయి అనేది జపాన్ పదం. వాళ్ల భాషలో దీనికి భవిష్యత్తు అనే అర్థం ఉంది. అయితే ఒక్కో భాషలో ఒక్కో అర్థం ఉంది. కానీ ఈ మూవీ థీమ్ ను బట్టి చూస్తే జపాన్ పదం సరిగ్గా సరిపోతుంది. అద్భుతాన్ని కూడా మిరాయి అనే పిలుస్తారు. కానీ తేజ సజ్జ ఇప్పటికే అద్భుతం అనే టైటిల్ తో ఒక సినిమాను చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు దాదాపుగా అదే అర్థం వచ్చే పదంతో ఆయన పాన్ ఇండియా మూవీ చేస్తుండడం విశేషం. ఇక టైటిల్ కు సంబంధం లేకుండా సూపర్ యోధ అనే ట్యాగ్ లైన్ ను మేకప్ ఫిక్స్ చేయడం చూస్తుంటే ఈ టైటిల్ వెనక ఇంకా ఏదైనా కారణం ఉండే అవకాశం ఉండొచ్చని అనిపిస్తోంది.

టీజర్ విశేషాలు..

కాగా తాజాగా రిలీజ్ చేసిన టైటిల్ టీజర్ లో సామ్రాట్ అశోక కాలం నుంచి ఉన్న తొమ్మిది అతి ముఖ్యమైన తరతరాలుగా కాపాడుతూ వస్తున్నారని, వాటిని దక్కించుకోవడానికి విలన్ వస్తున్నట్టుగా అనిపించే సన్నివేశాలు కనిపించాయి. విలన్ ఎవరు అనే విషయాన్ని రివిల్ చేయనప్పటికీ, ఆ గ్రంథాలను విలన్ చేతికి దక్కకుండా కాపాడే యోధుడిగా తేజ రంగంలోకి దిగిన విధానం ఇంప్రెస్సివ్ గా ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ 9 గ్రంథాలకు రక్షణ కల్పించి, ప్రపంచాన్ని అతిపెద్ద ప్రమాదం నుంచి కాపాడి భవిష్యత్తును అందిస్తాడు కాబట్టి ఈ సినిమాకు భవిష్యత్తు అనే అర్థం ఉన్న జపాన్ పదమైన మిరాయి అనే టైటిల్ ను ఫిక్స్ చేశారని అంటున్నారు. ఏదేమైనా టైటిల్ తోనే సినిమాపై క్యూరియాసిటీని పెంచేశారు మేకర్స్. ఇక టీజర్ లో ఉన్న సీన్స్, బిజిఎం అదిరిపోయాయని చెప్పాలి.

- Advertisement -

మొత్తానికి హనుమాన్ తర్వాత తేజ ఎంచుకున్న ఈ మిరాయి స్క్రిప్ట్ అద్భుతంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఎంతోమంది యంగ్ హీరోలు సరైన స్క్రిప్ట్ ను ఎంచుకోవడంలో తడబడుతుంటే, హనుమాన్ మూవీతో రీసెంట్ గా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న తేజ మాత్రం సరైన కంటెంట్ తో మరోసారి పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ పై దండయాత్ర చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇక ఈ మూవీని 2025 ఏప్రిల్ 18 న ఇండియన్ విదేశీ భాషలో కలిపి ఏకంగా ఏడు భాషల్లో రిలీజ్ చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు