12TH Fail : 20 కోట్లు కూడా ఖర్చుకాని సినిమాకు 20 వేల థియేటర్లు!

12TH Fail : బాలీవుడ్ లో లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన సినిమాల్లో అనూహ్య విజయం సాధించి ఎవరూ ఊహించని రీతిలో కలెక్షన్లు సాధించడమే కాకుండా, విమర్శల ప్రశంసలు అందుకోవడమే కాక. ఈ మధ్య కొన్ని అవార్డులు కూడా సాధించింది. ఇదిలా ఉండగా టాలీవుడ్ లో గాని, బాలీవుడ్ లో గాని
భారీ బడ్జెట్‌ సినిమాలు డిజాస్టర్ లుగా మిగలడం, చిన్న బడ్జెట్‌ సినిమాలు వందల కోట్ల వసూళ్లు సాధించడం మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. అయితే వందల కోట్ల బడ్జెట్‌ తో రూపొందిన సినిమాలు వందల కోట్ల వసూళ్లు రాబడితే పెద్ద విషయం ఏమీ కాదు. కానీ పది లేదా ఇరవై కోట్ల బడ్జెట్‌ తో రూపొందిన సినిమాలు వందల కోట్లు వసూళ్లు చేస్తే అది అసలైన విజయం. అలాంటి విజయం బాలీవుడ్ మూవీ 12th ఫెయిల్‌ సినిమాకు దక్కింది. కేవలం రూ.20 కోట్ల బడ్జెట్‌ తో రూపొందిన ఈ సినిమా థియేట్రికల్‌, నాన్‌ థియేట్రికల్‌ రైట్స్ ద్వారా వంద కోట్లకు పైగానే నిర్మాతలకు తెచ్చి పెట్టింది. ఇప్పుడు మరో అరుదైన ఘనతను ఈ సినిమా దక్కించుకుంది.

అక్కడ 20 వేల థియేటర్లు?

అయితే తాజాగా 12th ఫెయిల్ సినిమా నుండి మరో అప్డేట్ కూడా వచ్చింది. అయితే ఇండియన్‌ సినిమాలు చైనాలో చాలా అరుదుగా విడుదల అవుతూ ఉంటాయి. భారీ యాక్షన్ సినిమాలు లేదంటే ప్రత్యేకమైన సినిమాలు మాత్రమే చైనాలో విడుదల అవ్వడం మనం చూశాం. అప్పట్లో దంగల్, సీక్రెట్ సూపర్ స్టార్ వంటి సినిమాలు భారీ విజయాన్ని సాధించాయి. చిన్న సినిమా పెద్ద సినిమా అన్న తేడాలేకుండా కంటెంట్ బాగుంటే అక్కడ మన సినిమాలు వందల కోట్ల వసూళ్లు సాధిస్తాయి. అయితే ఈసారి 12th ఫెయిల్‌ సినిమా చైనా బాక్సాఫీస్‌ వద్ద సందడికి సిద్ధం అయ్యింది. చైనాలో ఏ సినిమా విడుదల అయినా వేల సంఖ్యల థియేటర్లలో విడుదల అవ్వడం మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు 12th ఫెయిల్‌ మూవీ కూడా ఏకంగా 20 వేల థియేటర్లలో విడుదల కాబోతుందట. అప్పట్లో బాహుబలి2 లాంటి చిత్రాలు కూడా ఇదే రేంజ్ లో రీలాస్ అయ్యాయి.

చిన్న సినిమాకి భారీ ఛాన్స్?

అయితే బాలీవుడ్ లో చిన్న సినిమాగా ఆల్మోస్ట్ చిన్న నటీనటులతోనే తెరకెక్కిన ఈ సినిమా భారీ విజయం సాధించింది. ఇప్పుడు చైనా లో కూడా అలాంటి విజయం కోసం మేకర్స్ ట్రై చేస్తున్నారు. ఇక 12 th ఫెయిల్ చిత్ర యూనిట్‌ సభ్యులు వారం రోజుల పాటు చైనాలో పర్యటించి ఈ సినిమా ప్రమోషన్‌ లో పాల్గొనబోతున్నారట. ఇక ఈ సినిమాకు చైనాలో హిట్ టాక్ వస్తే ఖచ్చితంగా ఇక్కడ విడుదల అయిన వసూళ్లకు మూడు నాలుగు రెట్లు అధికంగా వసూళ్లు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయి. విజువల్స్ పరంగా గ్రాండ్‌ గా ఉండకున్నా కూడా ఎమోషన్‌ మరియు పాయింట్‌ పరంగా చైనా వారిని మెప్పించే విధంగా 12th ఫెయిల్‌ మూవీ ఉంటుందని ఖచ్చితంగా చెప్పవచ్చు. అక్కడ భారీ వసూళ్లు నమోదు అయ్యే అవకాశం ఉందని బాలీవుడ్ బాక్సాఫీస్‌ వర్గాల వారి అభిప్రాయం.

- Advertisement -

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు