Chiranjeevi : చిరు బ్లడ్ బ్యాంకు లో ఏకంగా 100సార్లు రక్త దానం చేసిన నటుడు!

Chiranjeevi : టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సినీ ఇండస్ట్రీ కి అలాగే సొసైటీ లో చేసిన సేవలు, చేస్తున్న మంచి సేవల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన ఇండస్ట్రీ కి వచ్చిన నాలుగు దశాబ్దాల నుండి కూడా తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎదో ఒక విధంగా సాయపడుతున్నారు. ఇదిలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి ఏర్పాటు చేసిన చిరంజీవి బ్ల‌డ్ బ్యాంక్ ఎంతో మంది అవ‌స‌రాలు తీరుస్తోన్న సంగ‌తి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో అత్య‌వ‌స‌ర స‌మ‌యంలో ర‌క్తం కావాలంటే? గుర్తొచ్చేది మెగాబ్ల‌డ్ బ్యాంక్. నిత్యం అక్క‌డ ర‌క్త‌దాత‌లతో క్యాంప్ క‌ళ‌క‌ళ‌లాడుతుంది. ఇక మెగా హీరోల పుట్టిన‌రోజులు వ‌స్తే! అభిమానులు భారీ ఎత్తున వేల సంఖ్య లో ర‌క్త‌దాన శిబిరాలు ఏర్పాటు చేసి సేక‌రిస్తుంటారు. కొన్నేళ్ల‌గా ఎంతో గొప్ప మ‌హాత్త‌ర కార్య‌క్ర‌మంగా ఈ రక్త దానం జ‌రుగుతుంది. ఇదిలా ఉండగా తాజాగా ఓ అభిమాని, కం నటుడు చిరంజీవి బ్లడ్ బ్యాంకు కి ఏకంగా 100వ సారి బ్లోడ్ డొనేట్ చేసి రికార్డు సృష్టించాడు.

100 వ సారి రక్తదానం చేసిన మహర్షి..

టాలీవుడ్ లో మహర్షి సినిమా ద్వారా పాపులరైన ఆనాటి నటుడు మహర్షి రాఘవ గురించి పరిచయం అక్కర్లేదు. మహర్షి సినిమాతో గుర్తింపు పొందిన ఈయన ఎన్నో చిత్రాల్లో మంచి పాత్రల్లో నటించాడు. అలాగే కొన్నాళ్ల పాటు తెలుగు సీరియల్స్ లోనూ నటించిన మహర్షి కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్నారు. తాజాగా చిరంజీవి బ్లడ్ బ్యాంకు లో ఏకంగా 100వ సారి ర‌క్తదానం చేసి బ్లడ్ బ్యాంకు చ‌రిత్ర‌లో న‌లిచిపోయారు న‌టుడు మ‌హ‌ర్షి రాఘ‌వ‌. ఇప్ప‌టి వ‌ర‌కూ ఆయ‌న 99 సార్లు ర‌క్తం దానం చేయ‌గా, ఈ నేప‌థ్యంలో తాజాగా చిరంజీవి మ‌హ‌ర్షి రాఘ‌వ‌ని ఇంటికి పిలిపించి స‌న్మానించారు. ఆయ‌న‌తో పాటు న‌టుడు ముర‌ళీ మోహ‌న్ కూడా చిరంజీవి ఇంటికొచ్చి రాఘ‌వ‌ని అభినందించారు. వందసార్లు రక్త దానం చేయడం చాలా గొప్ప విషయమని రాఘవను మెచ్చుకున్నారు. ఇక ప్రతీ మూడు నెలలకు ఒకసారి రక్త దానం చేస్తూ రావడం మామూలు విషయం కాదంటూ రాఘవ సేవాగుణాన్నిచిరంజీవి, మురళి మోహన్ కొనియాడారు. ఇక మహర్షి రాఘవతో పాటు ఆయన భార్య శిల్ప కూడా పాల్గొన్నారు.

పాతికేళ్లుగా నిర్విరామంగా చిరు రక్తదాన సేవ..

ఇక మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) 1998 అక్టోబర్ 2వ తేదిన హైదరాబాద్ లో చిరంజీవి బ్ల‌డ్ బ్యాంక్ ప్రారంభించారు. అప్ప‌టి నుంచి అక్క‌డ నిత్యం రక్త దాన సేవ సేక‌ర‌ణ కార్య్ర‌మాలు నిర్విరామంగా జ‌రుగుతున్నాయి. చిరంజీవి, అలాగే మెగా హీరోల పుట్టిన రోజు నాడు అయితే దేశ వ్యాప్తంగా శిబిరాలు ఏర్పాటు చేస్తారు. అందులో పెద్ద ఎత్తున అభిమాననులు పాల్గొని రక్తం దానం చేస్తుంటారు. ప్ర‌తీ సంవ‌త్స‌రం ఈ కార్య‌క్ర‌మం జ‌రుగుతుంటుంది. ఈ కార్య‌క్ర‌మం ప‌ట్ల అవ‌గాహ‌న కూడా క‌ల్పిస్తున్నారు. ఇక మహర్షి ని సన్మానించే సమయంలో పక్కన ఉన్న మురళి మోహన్ రక్తదానం అనేది చాలా మంచి పని అని, రక్తదానం ఏడాదికి రెండు సార్లు చేయడం వల్ల పాత చెడు రక్తం పోయి, కొత్త రక్తం వస్తుందని అన్నారు.

- Advertisement -

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు