Chiranjeevi: చిరుతో స్నేహం.. అవి వుండాల్సిందే.!

Chiranjeevi.. మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి ఎటువంటి సపోర్టు లేకుండా అడుగుపెట్టి.. మొదట విలన్ పాత్రలు చేసి ఆ తర్వాత హీరోగా అవకాశం దక్కించుకొని.. తనను తాను నిరూపించుకున్నారు. వరుస సినిమాలతో.. అద్భుతమైన నటనతో.. డాన్స్ పెర్ఫార్మెన్స్ తో యువతలో ఒక సెపరేట్ ట్రెండు క్రియేట్ చేసిన చిరంజీవి ఆ తర్వాత కాలంలో సుప్రీం హీరోగా పేరు దక్కించుకున్నారు. ఇక అలాగే వరుసగా విజయాలను సొంతం చేసుకుంటూ మెగాస్టార్ గా పేరు సొంతం చేసుకున్నారు చిరంజీవి . నేడు సినిమాలలో మెగాస్టార్ అనిపించుకోవడమే కాదు రియల్ హీరోగా కూడా ఎంతో మందికి సహాయ సహకారాలు కూడా అందించారు.

Chiranjeevi:Friendship with Chiru.. They have to be.!
Chiranjeevi:Friendship with Chiru.. They have to be.!

చిరంజీవితో స్నేహం చేయాలంటే అది ఉండాల్సిందే..
ఇదిలా ఉండగా తాజాగా చిరంజీవికి సంబంధించిన ఒక వార్త నెట్టింట వైరల్ గా మారింది.. అదేమిటంటే చిరంజీవితో సన్నిహిత్యంగా ఉండాలి అంటే ఏం చేయాలి? అనే చర్చ తెరపైకి వచ్చింది. చిరంజీవికి నచ్చాలి అంటే అవతలి వ్యక్తి దగ్గర కొన్ని క్వాలిటీస్ అయితే తప్పనిసరిగా ఉండాలట. ముఖ్యంగా చిరంజీవి ఎవరైతే కష్టపడి పనిచేస్తారో వాళ్ళని ఎక్కువగా ఎంకరేజ్ చేస్తూ.. వారి కోసమే చాలా వరకు తన సమయాన్ని కేటాయిస్తారు.. వాళ్ళకి సలహాలు ఇవ్వడానికి కూడా ముందుంటారు.. కానీ ఎవరైతే పని చేస్తున్నట్టు నటిస్తారో అలాంటి వాళ్ళను చిరంజీవి తన దరిదాపుల్లోకి కూడా రానివ్వరట. ఇండస్ట్రీలో కష్టపడుతున్న ప్రతి నటుడిని కూడా చిరంజీవి ఎంకరేజ్ చేస్తూ తన సినిమాలను ప్రమోట్ చేస్తూ ఎంతోమందికి అండగా నిలిచారు.. అందుకే చిరంజీవి అంటే అందరికీ అమితమైన ఇష్టం.. ఒక సినిమా గురించి వివరిస్తూ ఒక సినిమా సక్సెస్ ఎందుకయింది అనేది కూడా చిరంజీవి వివరిస్తూ ఉంటారు.. కొత్త డైరెక్టర్లను, హీరోలను, కొత్త టాలెంట్లను ఎంకరేజ్ చేయడంలో ఈయన ముందు ఉంటారనటంలో సందేహం లేదు.. అందుకే కొత్త వాళ్లలో నూతన ఉత్సాహాన్ని నింపుతూ ఇండస్ట్రీకి రావాలనుకునే వారిలో కొత్త ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేస్తూ ఉంటారు.. అందుకే చిరంజీవి అంటే ఇప్పటికీ కూడా ఒక లెజెండ్రీ హీరోగా గుర్తింపు సంపాదించుకున్నారు.. చిరంజీవితో స్నేహం చేయాలి అంటే కష్టపడే తత్వం మీలో ఉండాల్సిందే..

చిరంజీవి ఫ్యామిలీ..
చిరంజీవి ప్రస్తుతం పుత్రోత్సాహంతో పొంగిపోతున్నారు. ఎందుకంటే ఆయన వారసుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు గ్లోబల్ స్టార్ గా పేరు దక్కించుకోవడమే కాదు గౌరవ డాక్టరేట్ ను కూడా అందుకున్నారు. చెన్నైలో వేల్స్ యూనివర్సిటీలో 14వ స్నాతకోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.. ఈ వేడుకల్లో భాగంగా సినిమా ఇండస్ట్రీకి ఆయన చేసిన సేవకు గానూ గౌరవ డాక్టరేట్ తో సత్కరించారు.. ఇక కొడుకుకు ఇంత గొప్ప గౌరవం లభించడంతో చిరంజీవి పుత్రోత్సాహంతో పొంగిపోతున్నారు. అటు రామ్ చరణ్ కి సినీ సెలబ్రిటీలు, అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇటీవలే తన మనవరాలు క్లీంకారా రాకతో వారి కుటుంబంలో అన్ని ఆనందాలే వెళ్లివిరుస్తున్నాయి. ఇటీవలే చిరంజీవికి కూడా పద్మ విభీషణ్ అవార్డు లభించిన విషయం తెలిసిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు