Pushpa 2 teaser records: ఆ విషయంలో రికార్డులు క్రియేట్ చేస్తున్న పుష్ప 2 టీజర్

Pushpa 2 teaser records: స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన “పుష్ప ది రైజ్” మూవీ వరల్డ్ వైడ్ గా సూపర్ క్రేజ్ ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్న చిత్రం పుష్ప 2 ది రూల్. ఈ చిత్రం భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

ఈ చిత్రంలో బన్నీ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం థియేటర్లలో విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఏప్రిల్ 8న బన్నీ బర్త్ డే సందర్భంగా పుష్ప ది రూల్ మూవీ టీజర్ రిలీజ్ చేయగా.. సెన్సేషన్ రెస్పాన్స్ తో దూసుకుపోతోంది. ఈ టీజర్ అతి తక్కువ సమయంలో మిలియన్ల వ్యూస్ సాధించిన టీజర్ గా మరో మైలురాయిని చేరుకుంది. 138 గంటలపాటు యూట్యూబ్ లో నెంబర్ వన్ స్థానంలో కొనసాగిన టీజర్ గా పుష్ప 2 టీజర్ నిలిచింది.

ఈ టీజర్ కి ఇప్పటివరకు 110 మిలియన్లకు పైగా వ్యూస్, 1.55 మిలియన్ల లైక్స్ తో దూసుకుపోతోంది. ఈ విషయాన్ని పుష్ప టీం సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులతో పంచుకుంది. ఈ టీజర్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గంగమ్మ జాతర గెటప్ లో మాస్ అవతారంలో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ టీజర్ లో చీర కట్టుకొని.. కాలు వెనక్కి మడిచి పైట కొంగుని అందుకున్న తీరు ప్రేక్షకులను విపరీతంగా అలరించింది. ఇక దేవిశ్రీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ప్రేక్షకులని ఉర్రూతలూగించిందనడంలో సందేహం లేదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు