Pawan Kalyan: ఓజీ అసలు విలన్ ఎవరో తెలుసా..?

Pawan Kalyan.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు హీరోగా చేస్తూనే.. మరొకవైపు ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో తన పార్టీని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోని జనసేన పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో పొత్తులో చేయి గలిపిన విషయం తెలిసిందే.. ఇక అలా ఒకవైపు రాజకీయంగా బిజీగా ఉన్నా.. తన సినిమాలను కూడా కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు పవన్ కళ్యాణ్.. ఇది ఇలా ఉండగా ఈయన హీరోగా సుజీత్ దర్శకత్వంలో ఓజీ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా పైన అభిమానులలో కూడా అంచనాలు పెరిగిపోయాయి.. ఎందుకంటే మిగతా సినిమాల కంటే కూడా సుజీత్ ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ను చాలా భిన్నంగా కొత్తగా చూపించబోతున్నారని వార్తలు రావడంతో అభిమానుల సైతం అంచనాలు పెట్టుకున్నారు..

Pawan Kalyan:Do you know who the real villain of OG..?
Pawan Kalyan:Do you know who the real villain of OG..?

విలన్ పై భారీ క్రేజ్..
అయితే ఈ సినిమాలో బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హస్మీ విలన్ గా నటిస్తున్నట్లు తెలిసిందే. ఇప్పటివరకు ఈయన పేరు చెబితేనే లిప్ లాక్ లు మాత్రమే అందరికీ గుర్తుకు వచ్చేవి.. కానీ ఈ సినిమాలో ఆయన పండించే విలనిజం కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతున్నట్టుగా సమాచారం.. అయితే ఇక్కడ బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హస్మితో పాటు మరో విలన్ ని కూడా తీసుకుంటున్నట్లు సమాచారం. హాలీవుడ్కు చెందిన ప్రముఖ విలన్ ను ఇందులో భాగం చేయబోతున్నారట. అంతేకాదు ఈయన క్యారెక్టర్ ను సస్పెన్స్ లోనే పెట్టి డైరెక్ట్ గా థియేటర్ లోనే ఆ క్యారెక్టర్ ను రివీల్ చేయాలనే ఉద్దేశంతో దర్శక నిర్మాతలు ఉన్నట్టు సమాచారం.. మొత్తానికి అయితే ఈ సినిమాతో సుజీత్ స్టార్ డైరెక్టర్ల లిస్టులో చేరే ప్రయత్నం అయితే చేస్తున్నట్లు సమాచారం.అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఈ సినిమాతో మరోసారి తనను తాను స్టార్ గా ప్రూవ్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నట్లు తెలుస్తోంది..

ఓజీ రిలీజ్ డేట్..
ఇకపోతే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిసిన తర్వాత ఈ సినిమా మిగిలిన షెడ్యూల్ ని పూర్తి చేసి.. సెప్టెంబర్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలిపారు. మరి ఈ సినిమా ప్రేక్షకుల్లో ఎలాంటి ఇంపాక్ట్ ను క్రియేట్ చేస్తుందో చూడాలి.. ఇక అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్న ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ సినిమా భవిష్యత్తు కూడా తెలుస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు. రాజకీయాల నుంచి మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చి ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు
ఈ సినిమా విడుదల అయ్యి సక్సెస్ అందుకుంటే తప్ప పవన్ కళ్యాణ్ సినిమా కెరియర్ స్పాయిల్ కాదు అని చెప్పవచ్చు. పవన్ కళ్యాణ్ తదుపరి సినిమాల విషయానికి వస్తే హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలను లైన్లో పెట్టిన విషయం తెలిసిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు