Chiranjeevi : చిరు ఇంట రష్యన్ కల్చర్ మినిస్టరి బృందం.. చిత్ర పరిశ్రమ కోసం!

Chiranjeevi : టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఎప్పటికప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమ కోసం సేవలు చేస్తూనే ఉంటారు. తన బ్లడ్ బ్యాంకు ఐ బ్యాంకు ల ద్వారానే కాకుండా, చిత్ర పరిశ్రమలో ఆ మధ్య కోవిడ్ టైం లో అందరికి వాక్సిన్ ఉచితంగా వేయించారు. ఇక అప్పుడప్పుడు పలువురు నటులకు ఆర్ధిక సాయం అందిస్తూనే ఉంటారు. ఇక ఆ మధ్య మూవీ టిక్కెట్ల రేట్ల గురించి చిత్ర నిర్మాతలు, దర్శకులతో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలని కలిసిన విషయం తెలిసిందే. ఇలా ఎప్పటికప్పుడు ఇండస్ట్రీ అభివృద్ధి కోసం పాటుపడుతూనే ఉంటారు. ఇదిలా ఉండగా నేడు తెలుగు సినిమా మార్కెట్ ఏ రేంజ్ లో ఉందో చెప్పాల్సిన ప‌నిలేదు. పాన్ ఇండియాని దాటి పాన్ వ‌ర‌ల్డ్ దాకా తెలుగు సినిమా కి ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ద‌క్కింది. ఇండియన్ సినిమాలో టాలీవుడ్ ఎంతో స్పెష‌ల్ అంటూ జేమ్స్ కామోరూన్ లాంటి దిగ్గ‌జాలే ప్ర‌శంసిస్తున్నారు. తాజాగా పలువురు హాలీవుడ్ సంస్థలు కూడా టాలీవుడ్ లో సినిమాలతో పని చేయడానికి ముందుకువస్తున్నాయి.

చిరు ఇంట రష్యా బృందం..

ఇదిలా ఉండగా తాజాగా ర‌ష్యా రాజ‌ధాని మాస్కో లో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం ఈరోజు మెగాస్టార్ చిరంజీవిని ఆయన నివాసంలో మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిసింది. మాస్కో ప్ర‌భుత్వ సినిమా స‌ల‌హాదారు జూలియా గోలుబెవా, క్రియేటివ్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ సెంటర్ హెడ్, ఫెడరల్ ఏజెన్సీ ఫర్ స్ట్రాటజిక్ ఇనిషియేటివ్స్ ప్ర‌తినిధి ఎకటెరినా చెర్కేజ్ జాడే, సిట్కోవ్స్కాయ డైరెక్టర్- సార్వత్రిక విశ్వవిద్యాలయం మరియు సిట్కోవ్స్కాయ త‌దిత‌ర బృందం మెగాస్టార్ ఇంట్లో స‌మావేశ‌మ‌య్యారు. ఈ సమావేశంలో అభివృద్ధి చెందుతున్న భారతీయ తెలుగు చలనచిత్ర పరిశ్రమ మరియు రష్యన్ క్రియేటివ్ మూవి ఇండస్ట్రీ మ‌ధ్య ప‌రిశ్ర‌మ అభివృద్దికి సంబంధించి కీల‌క అంశాలు చ‌ర్చ‌కొచ్చిన‌ట్లు సమాచారం. రష్యాలో తెలుగు చిత్రాల షూటింగ్‌ను ప్రోత్సహించడానికి అన్ని ర‌కాల సౌక‌ర్యాలు అక్క‌డ‌ ప్ర‌భుత్వం క‌ల్పిస్తుంద‌ని, విరివిగా తెలుగు చిత్రాల షూటింగ్ లు అక్క‌డ నిర్వ‌హించాలని ర‌ష్యా బృందం కోరిన‌ట్లు సమాచారం. అందుకు చిరంజీని సానుకూలంగా స్పందించిన‌ట్లు స‌మాచారం.

చిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం..

ఇక ఈ సమావేశంలో ఒక‌రికొక‌రు స‌హ‌క‌రించుకుంటే రెండు ప‌రిశ్ర‌మ‌ల అభివృద్దికి దోహ‌ద ప‌డుతుంద‌ని చిరంజీవి(Chiranjeevi) సైతం ఆశాభావం వ్య‌క్తం చేసిన‌ట్లు తెలుస్తోంది. ఆ భేటీకి సంబంధించిన ఫోటోలు కొన్ని నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. ఇక తెలుగు సినీ ప‌రిశ్ర‌మ పెద్ద‌గా భావించి ర‌ష్యా బృందం చిరుని క‌లిసిన‌ట్లు తెలుస్తోంది. ఇక ఇప్పుడిప్పుడే ర‌ష్యాలో తెలుగు సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. ఇక చిరంజీవి తన వంతు సహాయం మాత్రం ఇండస్ట్రీలో ఎప్పుడూ చేస్తూనే ఉంటారు. ఇండస్ట్రీ పెద్దగా కంటే, ఇండస్ట్రీ బిడ్డగా తాను సేవలు ఎప్పటికి అందిస్తుంటానని చిరంజీవి చెప్తూనే ఉంటారు. ఇక ప్రస్తుతం విశ్వంభర షూటింగ్ చేస్తున్న చిరు త్వరలో నెక్స్ట్ షెడ్యూల్ లో పాల్గొంటారు. ప్రస్తుతం షూటింగ్ కి కాస్త విరామం ఇచ్చిన చిరంజీవి తదుపరి సినిమాల కథా చర్చలు చేస్తున్నట్టు తెలుస్తుంది.

- Advertisement -

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు