Bollywood: 12th ఫెయిలా.. మనోళ్లు ఎప్పుడో తీసారుగా..!

టాలీవుడ్ లో ఈ మధ్య బయోపిక్ సినిమాలు చల్ల బడ్డాయి కానీ, బాలీవుడ్ లో మాత్రం ఏళ్ళ తరబడి వస్తూనే ఉంటాయి. వాళ్లకి కొత్తగా క్రియేటివిటీ ఉన్న కథలు దొరకవో, లేక బయోపిక్ సెంటిమెంటో తెలీదు కానీ, ఏడాదికి రెండు మూడు సినిమాలైనా వస్తూ ఉంటాయి. అయితే అందులో హిట్ అయ్యేవి మాత్రం రెండు కంటే తక్కువే. ఇక ఈ 2023 చివర్లో కూడా బాలీవుడ్ లో ఓ బయోపిక్ సినిమా రిలీజ్ అయింది. అయితే ఆ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అవగా, మెల్లిగా క్లిక్ అయిన ఆ సినిమా బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ తెచ్చుకుంది.

ఇక రీసెంట్ గా ఓటిటి లో కూడా వచ్చిన ఈ సినిమా తెలుగులో కూడా అవైలబుల్ గా ఉంది. అయితే ఈ సినిమా చూసిన తెలుగు వాళ్లకి మాత్రం ఇందులో అంతగా ఏముందని కనెక్ట్ అయ్యారో అని డౌట్ వస్తుంది. కంటెంట్ పరంగా బాగున్నా, ఇది రియల్ స్టోరీ అయినా కూడా, అచ్చం ఇలాగే 17 ఏళ్ళ కింద తెలుగులో ఓ సినిమా వచ్చింది. నవదీప్ హీరోగా తెరకెక్కిన “గౌతమ్ ఎస్ ఎస్ సి”, ఇలాంటి కాన్సెప్ట్ తో వచ్చి మంచి హిట్ అయింది.

ఇక 12th ఫెయిల్ లో హీరో ఓ సాధారణ స్టూడెంట్ కాగా, పలుమార్లు 12th ఫెయిల్ అవుతూ మెల్లిగా సబ్జెక్టులు క్లియర్ చేస్తూ ఎలా IPS అయ్యాడు, దానికి హీరోయిన్ ఎలా సహకరించింది అనేది కథ. మధ్య ప్రదేశ్ కి చెందిన మనోజ్ కుమార్ శర్మ అనే IPS వ్యక్తి బయోపిక్ గా ఈ సినిమా తెరకెక్కింది.

- Advertisement -

ఇక తెలుగు లో కూడా గౌతమ్ ఎసెస్సి లో హీరో 12th ఫెయిల్ కాగా, హీరో మాత్రం మంచి ఎడ్యుకేషనల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్నా చదవలేదు. ఆ తర్వాత తన తప్పుల్ని తెలుసుకుని ఎలా ఐఏఎస్ అయ్యాడన్నదే స్టోరీ. మన తెలుగు సినిమాలో కొంచెం కమర్షియలిటీ ఎక్కువగా ఉన్నా హిందీ సినిమాకి ఏమాత్రం తీసిపోదు. ఇక కొన్ని రోజులుగా ఈ సినిమా సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతుండగా, తెలుగు ఆడియన్స్ మాత్రం గౌతమ్ SSC సినిమాకు కంపేర్ చేస్తున్నారు.

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు