Gunturu karam: గురూజీ కి ఇది పరువు తక్కువ కాదా..?

టాలీవుడ్ లో ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాల్లో “గుంటూరు కారం” ఒకటి. పండక్కి ఎన్నో భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా మిక్సడ్ రెస్పాన్స్ ని దక్కించుకోవడమే గాక, త్రివిక్రమ్ సినిమాల్లో మరో రొట్ట సినిమా అనేంతగా దారుణమైన టాక్ మూటగట్టుకుంది. ఇక సినిమాలో మహేష్ బాబు వన్ మ్యాన్ షో పెర్ఫార్మన్స్ వల్ల సాలిడ్ ఓపెనింగ్స్ దక్కించుకుంది గాని, త్రివిక్రమ్ మార్క్ మాత్రం మిస్ అయిందని ఫ్యాన్స్ తో సహా అందరూ వేలెత్తి చూపారు. అన్నిటికి మించి ఈ సినిమా కథే కాదు, కొన్ని ఫైట్ సీన్లను కూడా త్రివిక్రమ్ కాపీ కొట్టేశాడని సోషల్ మీడియా లో కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి.

గుంటూరు కారం లో ఇంటర్వెల్ కి ముందు హీరో విలన్ ఇంట్లో ఒక చిన్న వార్నింగ్ తో కూడిన ఫైట్ సీన్ ఉంటుంది. అక్కడ హీరో ప్రకాష్ రాజ్ ఇంటికి వెళ్లి ఫర్నిచర్స్ అన్ని ధ్వంసం చేస్తాడు. అయితే ఆ సీన్ కి ముందే హీరోపై పోలీస్ స్టేషన్ కి కంప్లైంట్ వెళ్తుంది. అది తెలుసుకుని హీరో పోలీస్ ని చితక్కొట్టి, ఆ కంప్లైంట్ లో ఇచ్చింది కూడా ప్రకాష్ రాజ్ ఇంటికి వెళ్లి నిజం చేస్తాడు.. మీక్కూడా ఇది ఎక్కడో చూస్తోసినట్టుంది కదూ.. అవును.. ఇలాంటి వార్నింగ్ సీన్ ఇంతకు ముందు అల్లు అర్జున్ సరైనోడు లో కూడా ఉంటుంది. హీరో తన బ్రాండ్ వ్యాల్యూ చూపిస్తూ అక్కడ కూడా విలన్ ఫర్నిచర్స్ పగలగొడతాడు.

అయితే ఇదే గాక గుంటూరు కారం లో సీన్ ని ఓ సినిమా నుండి మక్కికి మక్కీ దించేసాడని అనిపిస్తుంది. రవితేజ నటించిన దరువు సినిమాలో కూడా ఓ కామెడీ తో కూడిన సన్నివేశం లో రవితేజ ఓ నగల వ్యాపారి ఇంటికి వెళ్లి వాళ్ళ సామాన్లు విరగ్గొడతాడు. అక్కడ కూడా హీరోపై ముందు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ వెళితే, దానికి రివెంజ్ గా హీరో ఆ వ్యక్తి ఇంటికి వచ్చి సామాన్లు పగలగొడతాడు. అయితే ఈ సినిమాలో ఆ సీన్ ని కామెడీ గా మలిస్తే, గుంటూరు కారం లో గురూజీ డ్రామాని జోడించి రక్తి కట్టించే ప్రయత్నం చేసాడు. కానీ అది అంతగా వర్కౌట్ అవ్వలేదు.

- Advertisement -

ఏది ఏమైనా ఈ మీమర్స్ వల్ల సినిమాల్లో ఏ సీన్ కాపీ చేసినా బడా డైరెక్టర్లు సైతం వెంటనే దొరికిపోతున్నారు. ఇక నైనా గురూజీ తేరుకుని తన మార్క్ డైరెక్షన్ పై దృష్టి పెట్టాలని, ముఖ్యంగా కాంబో హైప్ కోసం చేసిన హీరోలతోనే కాకుండా ఇతర హీరోలతో కూడా సినిమాలు చేస్తే మంచిదని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు