Ayodhya: “హనుమాన్” అయోధ్య విరాళానికి ఎన్ని కోట్లు జమ అయ్యిందో తెలుసా?

టాలీవుడ్ లో ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాల్లో భారీ అంచనాలతో వచ్చిన “హనుమాన్” సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పండగ సినిమాల్లో చిన్న సినిమా గా నిర్మాణ విలువల పరంగా ఓ మీడియం రేంజ్ సినిమాగా రిలీజ్ అయిన మౌత్ టాక్ తో సెన్సేషనల్ వసూళ్లు సాధిస్తూ దూసుకుపోతుంది. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా లో తేజ సజ్జ హీరోగా నటించాడన్న సంగతి తెలిసిందే. అయితే పండక్కి గుంటూరు కారం సహా సీనియర్ స్టార్ హీరోల సినెమాలున్నా ప్రేక్షకులు మాత్రం హనుమాన్ సినిమాకే ఓటు వేయడం విశేషం.

ఇక “హనుమాన్” సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ డే నుండే వరల్డ్ వైడ్ గా భారీ కలెక్షన్లు వసూలు చేయగా ఇప్పటి వరకు విడుదలైన 9 రోజుల్లో 175 కోట్లకి పైగా గ్రాస్ వసూలు చేయగా, 95 కోట్ల వరకు షేర్ వసూలు చేసింది. ఇదిలా ఉండగా హనుమాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి చేత మేకర్స్ అయోధ్య రామ మందిరానికి హనుమాన్ సినిమా నుండి వచ్చిన వసూళ్ళలో ప్రతి టికెట్ పై 5 రూపాయలను విరాళంగా ఇస్తున్నట్టు అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.

ఇక హనుమాన్ రిలీజ్ అయిన ఫస్ట్ డే వచ్చిన వసూళ్ళలో దాదాపు 20 లక్షల రూపాయలను అయోధ్య కి విరాళంగా అందచేయగా, తాజాగా హనుమాన్ కి వచ్చిన తొమ్మిది రోజుల వసూళ్ల నుండి హనుమాన్ మేకర్స్ మళ్ళీ విరాళంగా ప్రకటిస్తున్నట్టు డిటైల్స్ తో సహా ప్రకటించారు. ఈ తొమ్మిది రోజుల్లో హనుమాన్ మూవీకి 53 లక్షలకి పైగా టికెట్లు అమ్ముడు పోగా (53,28,211) ఆ టికెట్ల నుండి దాదాపు రెండు కోట్ల అరవై ఆరు లక్షల రూపాయలను (2,66,41,055) అయోధ్య రామ మందిరానికి పంపిస్తున్నట్టు ప్రకటించారు. ఈ వార్త తో ప్రేక్షకులు ఇచ్చిన మాటను హనుమాన్ నిలబెట్టుకున్నాడని హర్షం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు