Naa Saami Ranga: వారంలో బ్రేక్ ఈవెన్.. ఇక లాభాలే?

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో కింగ్ నాగార్జున హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా “నా సామి రంగ”. నాగార్జున తో పాటు అల్లరి నరేష్, రాజ్ తరుణ్ ప్రత్యేక పాత్రల్లో నటించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. విజయ్ బిన్నీ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ లో శ్రీనివాస్ చిట్టూరి నిర్మించడం జరిగింది. అయితే నా సామి రంగ ప్రేక్షకుల నుండి ఎలాంటి అంచనాలు లేకుండా రావడం జరిగింది.

ఎందుకంటే నా సామిరంగ ఓ మలయాళం సినిమా రీమేక్ గా తెరకెక్కగా, పండగ అడ్వాంటేజ్ తో మాత్రమే రిలీజ్ అయిన ఒక మాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. అయితే అనూహ్యంగా సంక్రాంతికి రిలీజ్ అయిన హనుమాన్ మినహా మరే సినిమా కూడా ఆకట్టుకోకపోవడంతో నా సామి రంగ పుంజుకుంది. దీనికి తోడు మిక్సడ్ రెస్పాన్స్ తెచ్చుకున్నా, పండక్కి కావాల్సిన అన్ని రుచులు ఈ సినిమాలో ఉండడంతో పండగ ఊపులో మంచి ఓపెనింగ్స్ తెచ్చుకుంది నా సామిరంగ.

ఇక “నా సామిరంగ” రిలీజ్ అయ్యి తాజాగా ఫస్ట్ వీక్ పూర్తవగా విడుదలైన వారం రోజుల్లో బ్రేక్ ఈవెన్ సాధిచింది. వరల్డ్ వైడ్ గా నా సామిరంగ 18.20 కోట్ల బిజినెస్ చేయగా, 19 కోట్ల టార్గెట్ తో రిలీజ్ అయింది. అయితే రిలీజ్ అయిన ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో నా సామి రంగ 17.50 కోట్లు వరల్డ్ వైడ్ గా కలిపి 18.67 కోట్ల షేర్ వసూలు చేసి బ్రేక్ ఈవెన్ అయింది. ఇక నా సామిరంగ కి ఈ ఆదివారం నుండి వచ్చే వసూళ్లన్నీ లాభాలే అని చెప్పవచ్చు. అయితే మరి బ్లాక్ బస్టర్ వసూళ్లు అయితే నా సామిరంగ కి రాకపోవచ్చు గాని, బిజినెస్ కి ఒక ఐదు, ఆరు కోట్ల వరకు బయ్యర్లు వెనకేసుకునే ఛాన్స్ ఉంది. మరి ఓవరాల్ గా నా సామిరంగ ఎంత వరకు కలెక్ట్ చేస్తుందో చూడాలి.

- Advertisement -

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు