Trivikram : ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్టుగా గురూజీ పరిస్థితి… “గుంటూరు కారం” రిస్క్ లో పడేసిందా?

Trivikram : మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ “గుంటూరు కారం” సినిమాతో ప్రేక్షకులను నిరాశపరిచిన విషయం తెలిసిందే. అయితే గురూజీ ఈ సినిమా రిజల్ట్ తో రిస్క్ లో పడ్డారా? ఆయన నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? అనే వివరాల్లోకి వెళ్తే…

సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందిన మూడవ మూవీ “గుంటూరు కారం”. ఈ భారీ ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ జనవరి 12న సంక్రాంతి కానుకగా థియేటర్లోకి వచ్చింది. కానీ మొదటి షో నుంచే ఈ సినిమాకు అభిమానుల నుంచి నెగిటివ్ టాక్, రివ్యూవర్ల నుంచి మిక్స్డ్ టాక్ వచ్చింది. సినిమాలో త్రివిక్రమ్ మార్క్ మిస్ అయ్యిందని మహేష్ అభిమానులు మండిపడ్డారు. ముందు నుంచి పక్కా బ్లాక్ బస్టర్ హిట్ బొమ్మ అంటూ మహేష్ అభిమానులలో అంచనాలు పెంచేసి, తీరా విడుదలయ్యాక సరైన కంటెంట్ లేని సినిమాతో వాళ్లను తీవ్ర నిరుత్సాహానికి గురి చేశారు.

కానీ మహేష్ కటౌట్ వల్ల సినిమా ఆడిందని, ఫ్యామిలీ ఆడియన్స్ వల్ల ఈ మాత్రమైనా కలెక్షన్స్ వచ్చాయి అనేది విశ్లేషకుల మాట. అయితే “గుంటూరు కారం” మూవీ అంచనాలను అందుకోకపోవడంతో మొత్తం నింద త్రివిక్రమ్ పైనే పడింది. అజ్ఞాతవాసి తర్వాత త్రివిక్రమ్ కెరీర్లో ఆయనకు షాక్ ఇచ్చిన రెండవ సినిమా గుంటూరు కారం. ఈ సినిమా రిలీజ్ అయ్యాక వచ్చిన విమర్శల వల్ల గురూజీ ఇప్పటిదాకా బయట ఎక్కడా కనిపించలేదు. దీంతో ఆయన నెక్స్ట్ ఏం చేయబోతున్నాడు అన్న విషయంపై ఇప్పుడు ఉత్కంఠత నెలకొంది.

- Advertisement -

నిజానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ నెక్స్ట్ ప్రాజెక్ట్ బన్నీతో చేయాల్సి ఉంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది. కానీ అంతకంటే ముందు బన్నీ అట్లీతో సినిమా చేస్తాడనే వార్తలు షికారు చేస్తున్నాయి. ఒకవేళ అదే గనక జరిగితే బన్నీ పుష్ప 2, అట్లితో సినిమా పూర్తి చేసేలోపు కనీసం రెండేళ్లు పడుతుంది. ఈ రెండేళ్లు త్రివిక్రమ్ ఖాళీగా ఉండడం అంటే చాలా రిస్క్. ఎందుకంటే చాలా కాలం గ్యాప్ వస్తుంది కాబట్టి బన్నీ లెక్కలు మారే అవకాశం ఉంటుంది.

ఇక అంతలోపు ఎవరైనా వేరే స్టార్ హీరోను పట్టుకుందామంటే అందరూ తమ తమ కమిట్మెంట్స్ తో బిజీగా ఉన్నారు. ఇక బన్నీతో సినిమా చేసే ముందు త్రివిక్రమ్ నాని, వెంకీలతో కలిసి ఒక మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నారనే “గుంటూరు కారం” మూవీ రిలీజ్ కు ముందే వార్తలు వచ్చాయి. అయితే ఈ మూవీకి త్రివిక్రమ్ కథను అందిస్తారని, కానీ దర్శకత్వ బాధ్యతలు ఆయన చేపడతారా లేదా అనే విషయంపై క్లారిటీ లేదని తెలుస్తోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై ఈ మూవీని నిర్మిస్తారని టాక్ నడిచింది.

కానీ ఒకవేళ త్రివిక్రమ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తే ఆయన కెరీర్ కు అది మరింత రిస్క్ కావచ్చు. త్రివిక్రమ్ ప్రస్తుతం టైర్-1 డైరెక్టర్, అల్లు అర్జున్, మహేష్ బాబు వంటి ఫుల్ ఫామ్ లో ఉన్న హీరోలకు ఇప్పటిదాకా దర్శకత్వం వహించిన త్రివిక్రమ్ ఇప్పుడు మిడ్ రేంజ్ హీరో నాని, వెంకటేష్ లతో ఒక మిడ్ రేంజ్ బడ్జెట్ సినిమా తీయడం అంటే ఆయన స్థాయి తగ్గినట్టే. దీనంతటికీ కారణం “గుంటూరు కారం” మూవీ రిజల్ట్. ఇప్పుడు గురూజీ పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్టుగా మారింది. ఒకవేళ ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి ఉంటే గురూజీ లెక్కలు వేరేగా ఉండేవి.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు