Anudeep: ‘రవన్న’ ఫ్యాన్స్ కి అసలైన మీల్స్ ఇచ్చే ‘జాతిరత్న’మీడు..!

మాస్ మహారాజ్ రవితేజ వరుస సినిమాలు చేస్తున్నా ప్రస్తుతం ఫామ్ లో లేడు. లాస్ట్ ఇయర్ వరుసగా రెండు ప్లాప్ లు అందుకోగా, ఈ ఇయర్ “ఈగల్” సినిమాతో సంక్రాంతి బ్లాక్ బస్టర్ కొడదామని అనుకున్నా, ఫిబ్రవరి కి వాయిదా వేశారు. అయినా ఆ సినిమా కూడా అంతంత మాత్రంగానే ఉంటుందని ట్రైలర్ చూస్తుంటే తెలిసిపోతుంది. అయితే రవితేజ మార్క్ సినిమాలు మాత్రం ఇప్పట్లో రావడం లేదు. అయితే ఆ లోటు ని భర్తీ చేయడానికి ఓ సూపర్ కాంబో సెట్ అయింది.

టాలెంటెడ్ డైరెక్టర్ అనుదీప్ దర్శకత్వంలో రవితేజ సినిమా చేస్తున్నాడు. గత కొన్నాళ్లుగా ఇది రూమర్ అనే అనుకున్నా, ఇది నిజమేనని తెలిసింది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఈ సినిమా నిర్మిస్తుండగా, రవితేజ ఈగల్ సినిమా రిలీజ్ అయిన తర్వాత మొదలవుతుందని అనుకున్నారు. తాజాగా అనుదీప్ రవితేజ మూవీ గురించి ఒక లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. రవితేజ హీరోగా అనుదీప్ దర్శకత్వం వహించే ఈ సినిమా ఒక కామెడీ తో కూడా లవ్ స్టోరీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోందని సమాచారం. పక్కా అనుదీప్ మార్క్ తో మాస్ మహారాజ్ రవితేజ ని కొత్త స్టైల్ లో డైరెక్టర్ చూపిస్తున్నాడని తెలుస్తుంది.

అయితే ఈ సినిమా సెట్స్ పైకి మాత్రం ఈగల్ రిలీజ్ తరువాతే. అది కూడా ముందు సినిమా షూట్ ఓపెనింగ్ జరుపుకున్నాక, సెట్స్ పైకి మాత్రం మే మొదటివారం లో లేదా జూన్ లో షూటింగ్ మొదలవుతుందని సమాచారం. ఈ లోపు రవితేజ హరీష్ కాంబో లో వస్తున్న మిస్టర్ బచ్చన్ షూటింగ్ పూర్తి చేస్తాడు.

- Advertisement -

Filmify gives an interesting update on celebrities in Tollywood & Bollywood and other industries. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other Movies news, etc. 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు