Ravi Teja – Anudeep KV : మోస్ట్ అవైటెడ్ కాంబో సెట్… కామెడీ బ్లాస్ట్ కు రెడీగా ఉండండ్రా జాతిరత్నాలు

మాస్ మహారాజా రవితేజ జోరు చూస్తుంటే యంగ్ హీరోలకు సైతం దడ పుట్టేలా కనిపిస్తోంది. తన సినిమాలు హిట్ అయినా, ప్లాప్ అయినా పెద్దగా పట్టించుకోకుండా తర్వాత చేయబోయే సినిమాలపైనే కాన్సెంట్రేట్ చేస్తున్నాడు రవితేజ. అందులో భాగంగానే ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్న డైరెక్టర్స్ అందరిని లైన్ లో పెడుతున్నాడు. టాలెంటెడ్ డైరెక్టర్స్ తో కాంబో సెట్ చేసుకుంటూ రెండు రోజులకోసారి టాలీవుడ్ లో హాట్ టాపిక్ అవుతున్నాడు.

ధమకా, వాల్తేరు వీరయ్య వంటి హిట్ సినిమాల తర్వాత రవితేజ నటించిన మరో రెండు సినిమాలు తెరపైకి వచ్చాయి. ‘రావణాసుర’, ‘టైగర్ నాగేశ్వరరావు’ అంటూ రెండు డిఫరెంట్ సినిమాలతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేశాడు. కానీ ఆ రెండు సినిమాలు కూడా డిజాస్టర్లుగా మిగిలాయి. ప్రస్తుతం ‘ఈగల్’ అనే యాక్షన్ ఎంటర్టైనర్ మూవీలో చేస్తున్నాడు రవితేజ. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇదిలా షూటింగ్ దశలో ఉండగానే మరోవైపు ఇద్దరు క్రేజీ డైరెక్టర్స్ ని లైన్ లో పెట్టేసాడు మన మాస్ మహారాజా.

రీమేక్స్ తో టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హరీష్ శంకర్ తో తన నెక్స్ట్ మూవీ చేయబోతున్నాడు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా రానేలేదు, మరో యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ని పట్టేశాడు రవితేజ. ‘జాతి రత్నాలు’ సినిమాతో టాలీవుడ్ ను గిలిగింతలు పెట్టేసిన డైరెక్టర్ అనుదీప్ కేవితో రవితేజ ఆ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఉండబోతోంది అని సమాచారం. హరీష్ శంకర్ ప్రాజెక్ట్ ను వీలైనంత తొందరగా పూర్తి చేసి, అనుదీప్ ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించనున్నాడు ఈ సీనియర్ హీరో. ఇక రవితేజ ఎనర్జి, కామెడీ టైమింగ్, పంచులతోనే కడుపుబ్బా నవ్వించే అనుదీప్ ఒక్కచోట చేరితే ప్రేక్షకులు థియేటర్లలో కామెడీ రోలర్ కోస్టర్ రైడ్ ని ఎక్స్పీరియన్స్ చేయడం ఖాయం. దీంతో ఇప్పటి నుంచే ఈ సినిమాపై బజ్ పెరిగిపోతోంది.

- Advertisement -

నిజానికి ‘రావణాసుర’ మూవీ తర్వాత అనుదీప్ కేవితో రవితేజ ప్రాజెక్ట్ రావాల్సి ఉంది. అయితే ఏమైందో ఏమో కానీ రవితేజ మాత్రం మనసు మార్చుకుని ‘టైగర్ నాగేశ్వరరావు’తో థియేటర్స్ లోకి వచ్చాడు. ఆ సినిమా కూడా డిజాస్టర్ గా నిలిచింది. అందుకే ఇప్పుడు తన స్టైల్ లో అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ లో నటించాలని రవితేజ నిర్ణయించుకున్నాడట. ఇక రవితేజ కోసం వెయిట్ చేస్తున్న డైరెక్టర్స్ లో గోపీచంద్ మలినేని కూడా ఒకరు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ షూటింగ్ స్టార్ట్ కావాల్సి ఉంది. కానీ బడ్జెట్ సమస్యల కారణాలతో ఈ సినిమా వాయిదా పడింది. మరి మళ్లీ ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలెక్కుతుందో వేచి చూడాలి. మొత్తానికి రవితేజ ఈ ఏజ్ లోనూ ఏమాత్రం ఎనర్జీ తగ్గకుండా వరుస సినిమాలను చేస్తూ ఈ తరం హీరోలకు ఛాలెంజ్ విసురుతున్నారు.

Filmify gives an interesting update on celebrities in Tollywood & Bollywood and other industries. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other Movies news, etc. 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు