Tollywood: టాలీవుడ్ సెలబ్రిటీలు ఎక్కడి నుంచి వచ్చారు..వారి జన్మస్థలం ఏదంటే..?

ఏ సినీ ఇండస్ట్రీలో అయినా సరే సెలబ్రిటీలకు తప్పకుండా అభిమానులు ఉంటారు. అయితే ఆ అభిమానులు తమ ఫేవరెట్ హీరో హీరోయిన్ల గురించి అన్ని విషయాలు తెలుసుకోవాలని తెగ ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే మరీ ముఖ్యంగా తెలుగు సెలబ్రిటీలకు సంబంధించి వ్యక్తిగత విషయాలు కూడా ఎప్పటికప్పుడు వైరల్ అవుతూ ఉంటాయి. అందులో భాగంగానే మన టాలీవుడ్ సెలబ్రిటీలు ఎక్కడి నుంచి వచ్చారు? వారి జన్మస్థలం ఏమిటి? అన్న విషయాల కోసం తెగ ఆరా తీస్తూ ఉంటారు. మరి ఈ టాలీవుడ్ సెలబ్రిటీలు ఎక్కడ పుట్టారు? వారి జన్మస్థలం ఏమిటి? అనేది ఇప్పుడు చూద్దాం.
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్వయంకృషితో ఎదిగి ప్రస్తుతం మెగాస్టార్ గా చలామణి అవుతున్న సీనియర్ స్టార్ హీరో చిరంజీవి మొగల్తూరులో జన్మించారు..
ఫ్యామిలీ హీరో శ్రీకాంత్ కర్ణాటకలోని గంగావతి అనే గ్రామంలో జన్మించారు. అయితే ఆ తర్వాత ఆయన కృష్ణా జిల్లాకు వచ్చి సెటిల్ అవ్వడం జరిగింది.
మాస్ మహారాజా రవితేజ ఉమ్మడి ఈస్ట్ గోదావరి జిల్లా ఆయన జగ్గంపేటలో జన్మించారు.
టాలీవుడ్ పాన్ ఇండియా హీరో జూనియర్ ఎన్టీఆర్ 1983లో హైదరాబాదులోని జన్మించారు. కానీ ఆయన తల్లి కర్ణాటకలో జన్మించారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బాపట్లలో జన్మించారు. అయితే ఆయన తండ్రి పోలీస్ ఆఫీసర్ కావడంతో వివిధ ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ అయ్యేవారు.
విక్టరీ వెంకటేష్ కారంచేడులో జన్మించారు. ఇక తర్వాత రామానాయుడు తన ఫ్యామిలీని చెన్నైకి షిఫ్ట్ చేయడం జరిగింది. అయితే రామానాయుడు మరణించిన తర్వాత ప్రస్తుతం దగ్గుబాటి ఫ్యామిలీ అంతా హైదరాబాద్ లోనే ఉంటున్నారు.
ప్రముఖ హీరోయిన్, మంత్రి ఆర్కే రోజా తిరుపతిలో జన్మించారు.
విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ బెంగళూరులో జన్మించారు.
ఒకప్పుడు స్టార్ హీరోగా ఒక వెలుగు వెలిగి ఇప్పుడు అడపా దడపా క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్న సుమన్ కర్ణాటకలోని మంగళూరులో జన్మించారు.
హాస్యబ్రహ్మ, టాలీవుడ్ స్టార్ కమెడియన్ బ్రహ్మానందం సత్తెనపల్లి దగ్గర్లో ఉన్న చాగంటి వారి పాలెం లో జన్మించారు.
పుష్ప సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ గా చలామణి అవుతున్న సుకుమార్ ఈస్ట్ గోదావరి జిల్లా మట్టపర్రు అనే గ్రామంలో జన్మించారు.
Filmify gives an interesting update on celebrities in Tollywood & Bollywood and other industries. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other Movies news, etc. 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు