Animal: గుర్తుపెట్టుకో… సందీప్ రెడ్డి వంగా

స్టార్ హీరోలతో సినిమాలు, భారీ బడ్జెట్ మూవీస్ అంటే డైరెక్టర్స్ లో ఎక్కడో ఒకచోట చిన్న భయమైనా ఉంటుంది. సినిమాని ఎంత పర్ఫెక్ట్ గా తెరకెక్కించినప్పటికీ ఏదో ఒక మూల ప్రేక్షకులు అసంతృప్తికి గురవుతూ ఉంటారు. ఇక వారి సంగతి ఎలా ఉన్నా భారీ అంచనాలతో తమ సినిమా థియేటర్స్ లోకి రాబోతోంది అంటే మేకర్స్ కు నిద్ర కరువవ్వడం ఖాయం. అయితే మన టాలీవుడ్ డైరెక్టర్స్ మాత్రం ఇప్పుడు ఓ కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు. సినిమా ఫలితం ఎలా ఉన్నా కానీ వాళ్ళ కాన్ఫిడెన్స్ అందరిని అబ్బుర పరుస్తోంది. కాన్ఫిడెన్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అంటే అన్ని భాషల సినీ ప్రియులు టాలీవుడ్ వైపు చూపించేలా మారుతుంది పరిస్థితి.

ఎందుకంటే మన డైరెక్టర్స్ అంత కాన్ఫిడెంట్ గా ఉంటున్నారు. ఆ కాన్ఫిడెన్స్ కు మనిషి రూపం గనక వస్తే యంగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాలాగే ఉంటుందేమో. తన సినిమాల విషయంలో ఈ స్టార్ డైరెక్టర్ నమ్మకం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. అంతేకాదు ఇచ్చే స్టేట్మెంట్స్ కూడా అదే రేంజ్ లో ఉంటాయి. ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో టాలీవుడ్ లో సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేసిన సందీప్ ఆ తర్వాత అదే మూవీని హిందీలో ‘కబీర్ సింగ్’గా రీమేక్ చేసి హిట్ కొట్టాడు. ఆ మూవీ ప్రమోషన్స్ లో సినిమాలో ఇంత వైలెన్స్ ఎందుకు? అని ప్రశ్న ఎదురైనప్పుడు, “ఇది కాదు వైలెన్స్ అంటే ఏంటో నా నెక్స్ట్ మూవీలో చూపిస్తాను” అంటూ సవాల్ చేశాడు. అన్నట్టుగానే ఇప్పుడు ‘యానిమల్’ అంటూ సినిమా చరిత్రలోనే కనీవిని ఎరగని వైలెన్స్ ను సిల్వర్ స్క్రీన్ పై చూపించడానికి రెడీ అవుతున్నాడు.

డిసెంబర్ 1న రిలీజ్ కానున్న ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ స్టార్ట్ అయ్యాయి. ఈ నేపథ్యంలో గతంలో సందీప్ రెడ్డి వంగా చెప్పిన డైలాగ్ కి సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతుంది. ‘అర్జున్ రెడ్డి’ మూవీ ప్రమోషన్స్ టైంలో “గుర్తుపెట్టుకో సందీప్ రెడ్డి వంగా” అంటూ ఈ డైనమిక్ డైరెక్టర్ చెప్పిన డైలాగ్ ను ఇప్పుడు ట్రెండ్ చేస్తున్నారు. ‘అర్జున్ రెడ్డి’తో అప్పుడు టాలీవుడ్ మాత్రమే గుర్తు పెట్టుకుంది. కానీ డిసెంబర్ 1 తర్వాత దేశం మొత్తం సందీప్ రెడ్డిని గుర్తు కోవడం ఖాయం. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ట్రైలర్, అలాగే సినిమాపై నడుస్తున్న బజ్ చూస్తుంటే డిసెంబర్ 1న సందీప్ రెడ్డి పేరు సినిమా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించడం ఖాయం అనిపిస్తుంది. మరి ఇతగాడి మ్యాడ్ వయోలెన్స్ కు థియేటర్లు తగలబడిపోతాయేమో జాగ్రత్త.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bo llywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు