Kusha Kapila: ఏడాదిలోపే విడాకులు.. కొత్త డేటింగ్.. యవ్వారం మామూలుగా లేదుగా..?

Kusha Kapila.. ప్రస్తుత కాలంలో సెలబ్రిటీలు ఏ విధంగా మారిపోయారంటే.. యేళ్ళ తరబడి ప్రేమించుకోవడం.. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవడం.. అయితే పెళ్లి చేసుకొని జీవితాంతం సంసారం కొనసాగిస్తారా అంటే అదీ లేదు.. పెళ్లయిన ఏడాదిలోపే కొంతమంది విడాకులు తీసుకొని ఒంటరిగా జీవితాన్ని గడిపితే.. మరి కొంతమంది ఇంకొక తోడును కోరుకుంటారు. మరి కొంతమంది ఒక పెళ్లికి మరో పెళ్లికి కాస్త గ్యాప్ తీసుకుంటూ ఉంటారు.. అయితే మరి కొంతమంది ఇంకా ఫాస్ట్ అనే చెప్పాలి.. వివాహం జరిగిన కొంత కాలానికే విడాకులు తీసుకుంటారు.. విడాకులు తీసుకొని సంవత్సరం కూడా పూర్తికాకముందే మరో కొత్త తోడును వెతుక్కుంటారు. ఇప్పుడు అలాంటి జాబితాలోకి ప్రముఖ బాలీవుడ్ నటి కుషా కపిల కూడా చేరిపోయారు.. తాజాగా ఈమెకు సంబంధించిన ఒక వార్త నెట్టింట వైరల్ గా మారుతోంది.. అదేంటో ఇప్పుడు చూద్దాం..

Kusha Kapila:Divorce within a year.. New dating..!
Kusha Kapila:Divorce within a year.. New dating..!

అనుభవ్ సింగ్ బస్సీ తో కుషా కపిల డేటింగ్..

తాజాగా ఈమె గురించి ఇప్పుడు బాలీవుడ్ వర్గాల్లో మరో రూమర్ మొదలైంది.. ఇప్పుడు ప్రముఖ బాలీవుడ్ కమెడియన్ తో డేటింగ్ లో ఉన్నట్లు కొత్త వార్త తెర పైకి వచ్చింది.. ప్రముఖ హాస్య నటుడు అనుభవ్ సింగ్ బస్సీ తో ఈమె డేటింగ్ లో ఉన్నట్లు సమాచారం.

చట్టా పట్టాలేసుకొని మీడియాకంట..

ఇప్పటికీ ఈ జంట ముంబై , ఢిల్లీ వంటి నగరాలలో చాలా సందర్భాలలో కలిసి కనిపించారని నెటిజన్లు కూడా కామెంట్లు చేస్తున్నారు..ఈ విషయం తెలిసి మరి కొంతమంది భర్తకు విడాకులు ఇచ్చి సంవత్సరం కూడా కాలేదు.. అప్పుడే ఇంకొకరితో డేటింగ్… కొంచమైనా సిగ్గుందా? అంటూ చాలా విమర్శలు చేస్తున్నారు.. మరి దీనిపై కుషా ఏదైనా స్పందిస్తుందేమో చూడాలి

- Advertisement -

అనుభవ్ సింగ్ బస్సీ బ్యాక్ గ్రౌండ్:

స్టాండప్ కమెడియన్ గా కెరియర్ మొదలు పెట్టిన ఇతడు ఆ తర్వాత కమెడియన్ గా , యూట్యూబర్ గా ఇప్పుడు నటుడిగా కూడా మంచి స్థాయికి చేరుకున్నాడు. ఇంస్టాగ్రామ్ లో 3 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్న ఈయన ఇప్పుడు యూట్యూబ్లో ఐదు మిలియన్ ఫాలోవర్స్ ను కలిగి ఉన్నారు.. ముఖ్యంగా ఇతడి వీడియోలకి భారీ స్థాయిలో వ్యూస్ కూడా వస్తూ ఉంటాయి. ఇక ఇతని సంపాదన కూడా భారీగానే ఉంటుంది. ఇటీవలే రణబీర్ కపూర్ – శ్రద్ధా కపూర్లతో కలిసి తూ ఝూతీ మైన్ మక్కార్ అనే చిత్రంలో కలిసి నటించారు..

కుషా కపిల మొదటి వివాహం..

సోషల్ మీడియా ద్వారా విపరీతమైన స్టార్ స్టేటస్ సొంతం చేసుకున్న కుషా కపిల కామెడీ కంటెంట్తో చిన్న చిన్న వీడియోలు షేర్ చేస్తూ భారీగానే ఫాలోయింగ్ పెంచుకుంది.. ఆ తర్వాత సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లో కూడా నటించిన ఈమె 2017 లో జోరావర్ సింగ్ అహ్లువాలియా ను వివాహం చేసుకుంది.. ఎంతో అన్యోన్యంగా ఉంటూ ఎంతో మందికి ఆదర్శంగా నిలిచింది ఈ జంట… అయితే అనుకోకుండా
ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో 2023లో విడిపోయారు. ఇక వీరిద్దరు విడిపోవడం అభిమానులకు ఏమాత్రం నచ్చలేదు.. మరొకవైపు ఈమెపై పూర్తిస్థాయిలో విమర్శలు కూడా గుప్పించారు ఆమె క్యారెక్టర్ ని తప్పుపడుతూ అసభ్యకరంగా కామెంట్లు కూడా చేశారు..

మాజీ భార్యపై భర్త కామెంట్స్..

పూర్తిస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో జోరావర్ సింగ్ అహ్లువాలియా కలగజేసుకొని తనను ఎవరు విమర్శించవద్దు అంటూ కామెంట్లు చేశారు.. అంతే కాదు ఇద్దరం కలిసే విడిపోయామని ఇందులో ఆమెది మాత్రమే తప్పు కాదు అని చెప్పడంతో ఆమెపై వస్తున్న విమర్శలకి కాస్త పులిస్టాప్ పడింది..

 

View this post on Instagram

 

A post shared by Kusha Kapila (@kushakapila)

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు