Baak Postponed : తమన్నా హార్రర్ మూవీ వాయిదా

Baak Postponed : గ్లామర్ క్వీన్స్ తమన్నా భాటియా, రాశి కన్నా కలిసి నటించిన హారర్ మూవీ బాక్ వాయిదా పడింది. మరి ఇంతకీ ఈ మూవీ ఎందుకు వాయిదా పడింది? మళ్లీ ఎప్పుడు రిలీజ్ కాబోతోంది? అనే వివరాల్లోకి వెళ్తే….

కొత్త రిలీజ్ డేట్ ఇదే

డైరెక్టర్ సుందర్ సి దర్శకత్వంలో తమన్నా, రాశి కన్నా ప్రధాన పాత్రల్లో నటించిన హారర్ మూవీ అరణ్మణై 4. సుందర్ సి భార్య కుష్బూ సుందర్, ఏసిఎస్ అరుణ్ కుమార్ సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీలో కోవై సరళ, యోగి బాబు, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, సునీల్ తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. హిప్ హప్ తమీజా ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు. బాక్ పేరుతో ఈ తమిళ మూవీని తెలుగులో కూడా రిలీజ్ చేయడానికి మేకర్స్ రెడీ అవుతున్నారు.

అయితే ఇప్పటిదాకా బాక్ మూవీని ఏప్రిల్ 26న విడుదల చేయనున్నట్టు మేకర్స్ చెప్పుకుంటూ వచ్చారు. కానీ తాజా సమాచారం ప్రకారం బాక్ మూవీ ముందుగా అనుకున్న దానికంటే వారం ఆలస్యంగా రాబోతోందని సమాచారం. తమిళంతో పాటు తెలుగులో కూడా బాక్ మూవీ మే 3న ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది. ఇప్పటికే తమిళ వర్షన్ కు సంబంధించి ఈ వాయిదా గురించి అఫీషియల్ గా అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. కానీ తెలుగు వెర్షన్ కు సంబంధించిన ప్రకటన ఈరోజు వచ్చే అవకాశం ఉంది.

- Advertisement -

వాయిదా ఎందుకు?

రీసెంట్ గా ఈ మూవీ నుంచి రిలీజైన పంచుకో అనే పాటకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ఆ పాటలో ఇద్దరు పాలరాతి బొమ్మల్లాంటి హీరోయిన్లు తమన్నా, రాశి అందాల ఆరబోత యూత్ కు బాగా నచ్చింది. దీంతో ఈ మూవీ ఎప్పుడెప్పుడు థియేటర్లలోకి వస్తుందా అని ఈ హీరోయిన్లు ఇద్దరి అభిమానులు ఎదురు చూశారు. కానీ తాజాగా మూవీ వాయిదా పడడంతో నిరాశకు గురవుతున్నారు. కాగా ఈ మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ పనులు పూర్తి కాకపోవడమే వాయిదాకు కారణమని కొందరు అంటుంటే, కాదు కాదు మే 3న అయితే పోటీకి పెద్దగా సినిమాలేవీ లేవు కాబట్టి సమ్మర్ హాలిడేస్ ను క్యాష్ చేసుకోవచ్చనే ఉద్దేశ్యంతోనే పోస్ట్ పోన్ చేశారని ఇంకొందరు అంటున్నారు.

ఈ పార్ట్ అయినా హిట్ అవుతుందా?

తమిళ బ్లాక్ బస్టర్ మూవీ అరణ్మణై సీక్వెల్ గా అరణ్మణై 4 అనే మూవీ తెరపైకి రాబోతోంది. సుందర్ సి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ క్రేజీ ఫ్రాంచైజీలో అరణ్మణై 4 అనేది నాలుగవ భాగం. ఇందులో ఫస్ట్ పార్ట్ తప్ప మిగతా సీక్వెల్స్ హిట్ కాలేదు. ఇప్పుడు ఈ హార్రర్ అండ్ కామెడీ మూవీ నాలుగవ భాగాన్ని తప్పకకుండా హిట్ అవుతుందనే నమ్మకంతో తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. అందులో భాగంగానే బాక్ మూవీకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలలో జోరు పెంచేశారు మేకర్స్. తాజాగా ఈ మూవీ నుంచి రాశి ఖన్నా, తమన్నా భాటియా కలిసి స్టెప్పులు వేసిన స్పెషల్ సాంగ్ ను రిలీజ్ చేసి సినిమాపై ఆసక్తిని పెంచే ప్రయత్నం చేశారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు