Nara Rohit New Movie : ఎలక్షన్స్ ఎఫెక్ట్… బ్రేకులు పడ్డ నారా రోహిత్ సుందర కాండ మూవీ

Nara Rohit New Movie : తెలుగు ఇండస్ట్రీలో నారా రోహిత్‌కు ప్రత్యేక స్థానం ఉంది. కానీ, ఈ హీరో ఇండస్ట్రీకి దాదాపు ఆరేళ్ల పాటు దూరంగా ఉన్నారు. నారా రోహిత్ చివరి మూవీ వీర భోగ వసంత రాయలు. 2018లో విడుదలైన ఈ మూవీ నెగిటివ్ రివ్యూలు తెచ్చుకోవడమే కాకుండా, కమర్షియల్ గా కూడా ఫెయిల్ అయింది. దీని తర్వాత నారా రోహిత్ సినిమాలు చేయలేదు. ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు.

జర్నలిస్ట్ మూర్తి దర్శకత్వంలో ప్రతినిధి 2 రాబోతుంది. అలాగే సుందర కాండ అనే మూవీని కూడా నారా రోహిత్ చేస్తున్నాడు. ఇటీవల ఈ మూవీ టైటిల్స్ గ్లింప్స్ ను మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు. అయితే నారా రోహిత్ రాజకీయ పరంగా నందమూరి ఫ్యామిలీకి సపొర్ట్ గా ఉంటాడు అనే విషయం అందరికీ తెలిసిందే. తాజాగా ఆంధ్ర ప్రదేశ్‌లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో టీడీపీకి సపొర్ట్ గా ప్రచారం చేయడానికి రెడీ అయిపోయాడు నారా రోహిత్.

అందు కోసం ఇప్పటి వరకు శరవేగంగా జరుగుతూ వచ్చిన సుందర కాండ షూటింగ్ కు తాత్కాళికంగా బ్రేకులు కూడా వేశాడు. గురువారం వరకు షూటింగ్ లో పాల్గోన్న నారా రోహిత్, ఇప్పుడు ప్రచారం కోసం షూటింగ్ కు బ్రేక్ ఇచ్చాడని తెలుస్తుంది. ఎన్నికలు అయ్యేంత వరకు మళ్లీ ఈ సుందర కాండ మూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ లేదని సమాచారం. కాగా, నారా రోహిత్ కెరీర్ లో 20వ సినిమాగా తెరకెక్కుతున్న సుందర కాండ మూవీని వినయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 6న విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు