Kalki 2898 AD Digital Rights : రిలీజ్‌కు ముందే నిర్మాతలకు 150 కోట్ల లాభం… ప్రభాస్ రేంజ్ మామూలుగా లేదుగా…

Kalki 2898 AD Digital Rights : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న కల్కి 2898 ఏడి మూవీ డిజిటల్ రైట్స్ భారీ ధరకు అమ్ముడై సినీ విశ్లేషకులను విస్తు పోయేలా చేస్తున్నాయి. తాజాగా ఈ మూవీ డిజిటల్ రైట్స్ భారీ ధరకు అమ్ముడుపోగా, నిర్మాతలకు మూవీ రిలీజ్ కు ముందే 150 కోట్ల లాభం చేకూరినట్టు సమాచారం. మరి ఇంతకీ కల్కి మూవీ రైట్స్ ఎంతకు అమ్ముడయ్యాయి? అనే విషయంలోకి వెళ్తే…

రికార్డు బ్రేకింగ్ ధరకు కల్కి డిజిటల్ రైట్స్

నాగ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898 ఏడి. ఈ మూవీలో ప్రభాస్ తో పాటు బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు దీపిక పదుకొనే, దిశా పటాని, లోకనాయకుడు కమల్ హాసన్, బిగ్ బి అమితాబ్ బచ్చన్ ప్రధాన పత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకోగా, రిలీజ్ డేట్ పై కసరత్తులు మొదలు పెట్టారు. అయితే అంతకంటే ముందే మూవీ థియేట్రికల్ రైట్స్, డిజిటల్ రైట్స్ డీల్స్ మొదలు పెట్టారు. అందులో భాగంగానే కల్కి మూవీ డిజిటల్ రైట్స్ 375 కోట్లకు అమ్ముడైనట్టు సమాచారం. అందులో సౌత్ వెర్షన్ కు సంబంధించి 200 కోట్ల డీల్ కుదిరిందని టాక్. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తో కలిపి ఈ రేంజ్ లో డిజిటల్ డీల్ కుదరడం అంటే మామూలు విషయం కాదు. ఇక ఒక్క హిందీ వర్షన్ డిజిటల్ రైట్స్ 175 కోట్లకు అమ్ముడయ్యాయని తెలుస్తోంది.

రైట్స్ కోసం దిగ్గజ ఓటిటి ప్లాట్ ఫామ్స్ పోటీ

కల్కి మూవీ రైట్స్ ను రెండు ఓటిటి ప్లాట్ ఫామ్ లు కొనుగోలు చేసినట్టుగా ప్రచారం జరుగుతుంది. సౌత్ వెర్షన్ రైట్స్ ను అమెజాన్ సొంతం చేసుకుందని, హిందీ వర్షన్ ఓటిటి రైట్స్ కోసం నెట్ ఫ్లిక్స్, జియో సినిమా మధ్య గట్టి పోటీ నెలకొందని తెలుస్తోంది.

- Advertisement -

రిలీజ్ కు ముందే లాభాలు

కల్కి మూవీ బడ్జెట్ 600 కోట్లు కాగా రిలీజ్ కు ముందే డిజిటల్ డీల్ తో 750 కోట్లు రాబట్టుకుంది కల్కి టీం. దీంతో రిలీజ్ కంటే ముందే నిర్మాతలు ఈ మూవీ ద్వారా 150 కోట్ల లాభం పొందినట్టు సమాచారం. ఈ విషయం తెలిసిన ప్రభాస్ అభిమానులు రెబల్ స్టార్ రేంజ్ ఇలా ఉంటుంది అంటూ కాలర్ ఎగరేస్తున్నారు.

ఇదే బిగ్గెస్ట్ డీల్

పాన్ ఇండియా సినిమాలలో కెల్లా కల్కి దే బిగ్గెస్ట్ డిజిటల్ డీల్ కావడం విశేషం. గతంలో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్ డిజిటల్ రైట్స్ 350 కోట్లకు అమ్ముడయ్యాయి. మరో బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ కేజిఎఫ్ 2 రైట్స్ 320 కోట్లకు అమ్ముడయ్యాయి. ఇక మోస్ట్ అవైటింగ్ పాన్ ఇండియా మూవీ పుష్ప 2 రైట్స్ 275 కోట్లకు నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుందని టాక్ నడుస్తోంది. కాగా ప్రభాస్ గత చిత్రం సలార్ ఓటీటీ రైట్స్ కోసం 160 కోట్లు చెల్లించింది నెట్ ఫ్లిక్స్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు