Devara: భారీ సవాల్.. కొరటాలకు అంత సీన్ ఉందా..?

Devara..యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న చిత్రం దేవర..RRR సినిమా తర్వాత ఎన్టీఆర్ నటిస్తూ ఉండడంతో ఈ సినిమా పైన భారీ హైప్స్ ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా డైరెక్టర్ కొరటాల శివ ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. చివరిగా కొరటాల శివ ఆచార్య వంటి సినిమాతో ఘోరమైన డిజాస్టర్ ని మూట కట్టుకున్నారు. ఈసారి ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని పట్టుదలతో కొరటాల శివ దేవర సినిమాకి చాలా కష్టపడి పనిచేస్తున్నారు. గతంలో ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో జనతా గ్యారేజ్ సినిమా వచ్చి మంచి విజయాన్ని అందుకుంది.

Devara:A huge challenge.. Is there such a scene for Koratala Shiva..?
Devara:A huge challenge.. Is there such a scene for Koratala Shiva..?

నార్త్ లో కూడా భారీ ధర..

దేవర మొదటి భాగం దసరా కానుకగా అక్టోబర్ 10న విడుదల చేయబోతున్నారు.ఇందులో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తోంది. అలాగే విలన్ గా సైఫ్ అలీ ఖాన్ కూడా నటిస్తున్నారు. దీంతో ఈ సినిమాకి బాలీవుడ్ లో కూడా మంచి హైప్ ఏర్పడుతోంది. రోజురోజుకీ దేవర సినిమా పైన భారీగా అంచనాలను పెంచేస్తోంది చిత్ర బృందం.. ఇటీవలే బాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్ అయిన కరణ్ జోహార్ కూడా 50 కోట్ల రూపాయలు పెట్టి ఈ చిత్రాన్ని కొనుగోలు చేసినట్లు ప్రకటించారు.

భారీ ధరకు దేవరా రైట్స్..

బాలీవుడ్ లోనే అన్ని కోట్లు పలుకగా.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. దాదాపుగా ఈ చిత్రం రైట్స్ రూ.120 కోట్లకు పైగా బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ఈ రైట్స్ కొరటాల శివ కెరియర్ లోనే అత్యధిక బిజినెస్ చేసిన సినిమాగా పేరు సంపాదిస్తోంది. అంతేకాకుండా ఈ సినిమా ఖచ్చితంగా రెండు తెలుగు రాష్ట్రాలలో రూ.200 కోట్లకు పైగా కలెక్షన్ చేయవలసి ఉంటుంది. తమిళ్, మలయాళం, కన్నడ ఇతర భాషలలోని రైట్స్ కూడా రూ.50 కోట్ల వరకు అమ్ముడుపోయినట్లు సమాచారం. ఓవర్సీస్ లో రూ.27 కోట్ల వరకు బిజినెస్ చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. బ్రేక్ ఈవెన్ సాధించాలంటే మరో 60 కోట్లు సాధించాల్సి ఉంటుంది.

- Advertisement -

కొరటాల శివ సాహసం చేయాల్సిందే..

మొత్తానికి దేవర సినిమా ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే సుమారుగా రూ.400 కోట్లు వసూలు చేస్తే సేఫ్ జోన్ లోకి వెళ్తుంది.. ఒకరకంగా ఇది పెద్ద నెంబర్ అనే చెప్పాలి. మరి ఈ నెంబర్ రాబట్టాలి అంటే పెద్ద సాహసమే కొరటాల శివ చేయాల్సి ఉంటుంది.. మరి ఎన్టీఆర్ కి ఉన్న క్రేజ్ ఈ సినిమా పైన ఎంతటి కలెక్షన్స్ ప్రభావం చూపిస్తుందో చూడాలి. అంతేకాకుండా ఈ సినిమా కలెక్షన్స్ బట్టి సీక్వెల్ పైన కూడా బజ్ ఏర్పడుతుందని చెప్పవచ్చు.. ముఖ్యంగా సంగీతాన్ని కూడా అనిరుధ్ అందిస్తూ ఉండడంతో ఈ సినిమాకి మరింత ప్లస్ కానుంది. ఇప్పటివరకు దేవర సినిమాకి సంబంధించి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.

ఎన్టీఆర్ సినిమాలు..

ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న సినిమా పూర్తి అయిన వెంటనే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేయాల్సి ఉంటుంది . ఈ సినిమా పూర్తయిన తర్వాత దేవర పార్ట్ -2 లో కూడా నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు