MAD Square Movie Update : త్రివిక్రమ్ చెప్పిన స్వ్కేర్… మొన్న టిల్లు – ఇప్పుడు మ్యాడ్

MAD Square Movie Update : సినిమా ఇండస్ట్రీలో సీక్వెల్స్ రావడం చాలా కామన్ విషయం. ఈ సీక్వెల్స్ కు పార్ట్ 1, పార్ట్ 2 అంటూ నామ కరణం చేసే వాళ్లు. కానీ, ఇప్పుడు వస్తున్న కుర్ర హీరోలు, కుర్ర డైరెక్టర్లు కాస్త రూట్ మారుస్తున్నారు. సినిమాలకు సీక్వెల్ వస్తే 2, 3 అని యాడ్ చేయడం లేదు. స్వ్కేర్, క్యూబ్ అంటూ మాథ్స్ లెక్కలను సినిమాలకు తగిలిస్తున్నారు.

ఇటీవల టిల్లు స్క్వేర్ అనే మూవీ వచ్చిన సంగతి తెలిసిందే. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా వచ్చిన డిజే టిల్లు మూవీకి ఇది సీక్వెల్. ఈ టిలు స్క్వేర్ మూవీ కూడా సీక్వెల్ వస్తుంది. దానికి టిల్లు క్యూబ్ అని టైటిల్ పెట్టేశారు. ఇలా స్వ్కేర్ అని టైటిల్ పెట్టడానికి కారణం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అని సిద్ధు జొన్నలగడ్డ ఓ టైంలో చెప్పారు.

ఇప్పుడు ఇదే స్క్వేర్ పేరుతో మరో సీక్వెల్ రాబోతుంది. కొన్ని రోజుల క్రితం మ్యాడ్ అనే ఓ కామెడీ జానర్ మూవీ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సీక్వెల్ వస్తుందని ఇటీవల అనౌన్స్ మెంట్ వచ్చింది. తాజాగా ఈ సినిమాకు మ్యాడ్ స్క్వేర్ అని టైటిల్ పెట్టారు. దీనిలో ఫస్ట్ పార్ట్ లో ఉన్న హీరోలే ఉంటారు. కానీ, హీరోయిన్స్ మారే అవకాశం ఉంది. కాగా, ఈ స్క్వేర్ అంటూ వచ్చిన టిల్లు స్క్వేర్, రాబోతున్న మ్యాడ్ స్క్వేర్ సినిమాలకు నిర్మాతలు సితార ఎంటర్టైన్మెంట్స్ వాళ్లే కావడం విశేషం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు