Divyanka Tripathi Accident : సీరియల్ నటికి రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలు… ఎముకలు విరిగి దారుణంగా…

Divyanka Tripathi Accident : హిందీ టెలివిజన్ స్టార్ దివ్యాంక త్రిపాఠి దహియా రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైంది. ఈ విషయాన్ని ఆమె టీంతో పాటు దివ్యాంక భర్త వివేక్ దహియా ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అందరికీ తెలిపారు. అందులో ఆమెకు జరిగిన గాయాల గురించిన వివరాలతో పాటే ఎక్స్ రే ఫోటోలను కూడా షేర్ చేశారు. పైగా ఆపరేషన్ చేయాలంటూ వాళ్ళు చేసిన పోస్ట్ దివ్యాంక అభిమానులు తెగ టెన్షన్ పడిపోతున్నారు.

దివ్యాంక భర్త వివేక్ దహియా పీఆర్ టీం చేసిన సోషల్ మీడియా పోస్ట్ లో దివ్యాంక ఆసుపత్రిలో చేరిందని, దాని కారణంగా ఆయన లైవ్ సెషన్‌ను రద్దు చేయాల్సి వచ్చిందని వెల్లడించింది. నటి దివ్యాంక త్రిపాఠి కోలుకున్న వెంటనే లైవ్‌కి వచ్చి మీ అందరితో వివేక్ మాట్లాడతారు అంటూ అందులో చెప్పుకొచ్చారు. ఆ పోస్ట్‌లో ‘రేపు జరగాల్సిన వివేక్ లైవ్ సెషన్ రద్దు చేయబడిందని ప్రకటించడం మాకు బాధాకరంగా ఉంది. కొన్ని గంటల క్రితం దివ్యాంకకు యాక్సిడెంట్ అయింది. ప్రస్తుతం డాక్టర్ల పర్యవేక్షణలో ఉంది. దివ్యాంక త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాము. మీ సపోర్ట్ కావాలి” అంటూ రాసుకొచ్చారు.

దివ్యాంక త్రిపాఠికి శస్త్ర చికిత్స

ఇటీవలే రోహిత్ శెట్టి షో ‘ఖత్రోన్ కే ఖిలాడీ 13’లో సందడి చేసిన దివ్యాంక త్రిపాఠి ఏప్రిల్ 18న ప్రమాదానికి గురైంది. ఆ మరుసటి రోజే అంటే ఏప్రిల్ 19న ఆమెకు ఆపరేషన్ చేస్తున్నారు డాక్టర్లు. ఆమె భర్త వివేక్ తన ఇన్‌స్టాగ్రామ్ ఐజి స్టోరీలో ఎక్స్-రే రిపోర్ట్ ను షేర్ చేశారు. అందులో ‘దివ్యాంక భుజంలోని రెండు ఎముకలు విరిగాయి. డాక్టర్లు ఆపేరేషన్ చేయాలని చెప్పారు అని తెలిపారు. దీంతో ఉన్నట్టుండి తమ అభిమాన నటికి యాక్సిడెంట్ కావడం, ఎముకలు విరిగి ఆపరేషన్ చేయాల్సి రావడం దివ్యాంక ఫ్యాన్స్ ను టెన్షన్ పెడుతోంది. ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. ప్రస్తుతం ఆమెకు ముంబైలోని పాపులర్ సెలెబ్రిటీ హాస్పిటల్ కోకిలా బెన్ లో డాక్టర్లు చికిత్స అందిస్తున్నట్టు సమాచారం.

- Advertisement -

దివ్యాంక త్రిపాఠి-వివేక్ దహియా మ్యారేజ్ ఇలా…

దివ్యాంక త్రిపాఠి ప్రముఖ టీవీ నటి. బుల్లితెరపై ఆమెకున్న పాపులారిటీ ముందు స్టార్ హీరోయిన్ల ఫాలోయింగ్ కూడా దిగదుడుపే. ఆమె 2006లో ‘బానూ మైన్ తేరీ దుల్హన్’ అనే సీరియల్ లో ‘విద్య’ పాత్రతో తన కెరీర్‌ను ప్రారంభించింది. అయితే ‘యే హై మొహబ్బతే’ షోలో ‘డాక్టర్ ఇషితా భల్లా’ పాత్రతో ఆమెకు విపరీతమైన పాపులారిటీ వచ్చింది. బుల్లితెర ప్రేక్షకులు ఈ సీరియల్ లో చూశాక దివ్యాంకపై విపరీతమైన అభిమానాన్ని పెంచుకున్నారు. ఆ అభిమానం ఏ లెవెల్ లో ఉంటుంది అంటే ఏకంగా ఆమెను తమ కుటుంబ సభ్యురాలిగా భావిస్తారు. కాగా దివ్యాంక అదే షో సెట్స్‌లో నటుడు వివేక్ దహియాతో ప్రేమలో పడ్డారు. ఆ సీరియల్ సెట్స్ లో వీరిద్దరికి జరిగిన పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో 2016 జూలై 8న ఈ జంట పెళ్లి చేసుకున్నారు. ఇరు కుటుంబాల అంగీకారంతో ఘనంగా పెళ్లి చేసుకున్న ఈ జంట చూడ ముచ్చటగా ఉంటుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు