Aryan khan: డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ కు క్లీన్ చిట్ ఇచ్చిన అధికారి కీలక నిర్ణయం..!

Aryan Khan.. బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ ఈ మధ్యకాలంలో వరుసగా భారీ విజయాలతో మళ్ళీ దూసుకుపోతున్నారు. ఇదిలా ఉండగా గడిచిన రెండేళ్ల క్రితం ముంబై తీరంలో ఒక విహార నౌకలో సెలబ్రిటీ పిల్లలతో పాటు దేశంలోనే కొంతమంది సంపన్నులు విందు చేసుకున్నటువంటి నౌక మీద ఎన్సీబీ అధికారులు దాడి చేయగా..ఇందులో షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ తోపాటు సుమారుగా 20 మందిని అరెస్టు చేయడం జరిగింది. అయితే ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ సేవిస్తూ ఉండగా.. పట్టుకున్నామని అప్పటి ఎన్సీబీ బృందం తెలియజేసింది కానీ ఆధారాలు లభించలేదు.

Aryan Khan: The decision of the officer who gave a clean chit to Aryan Khan in the drug case..!

Aryan Khan: The decision of the officer who gave a clean chit to Aryan Khan in the drug case..!

ఆధారాలు లేకపోయినా అందుకే ఇరికించారు..

ముఖ్యంగా ఆర్యన్ ఖాన్ మొబైల్ లోని డేటా ఆధారంగానే అతనికి మారకద్రవ్యాలతో సంబంధం ఉన్నాయని వెల్లడించారు.. దీంతో ఎన్సీబీ ముందు కూడా ప్రకటించడం జరిగింది. ఈ విషయంపైన అటు షారుక్ తో పాటు ఆర్యన్ ఖాన్ కూడా చాలా దారుణమైన ట్రోల్స్ కి గురయ్యారు. కానీ ఆ సమయంలో మాత్రం ఆర్యన్ ఖాన్ ఎలాంటి తప్పు చేయలేదంటూ.. కేవలం గుజరాత్ లో రూ .20,000 కోట్లు విలువైనటువంటి డ్రగ్స్ నుంచి దృష్టి మళ్లించడానికి కేవలం షారుక్ ఖాన్ కుమారుడు పేరు తెరపైకి తీసుకొచ్చారనే వాదనలు కూడా వినిపించాయి.

ఆర్యన్ ఖాన్ కు క్లీన్ చిట్..

అయితే అయినప్పటికీ అప్పటికే ఈ కేసును ఎన్సీబీ డైరెక్టర్ సమీర్ వాఖండే దర్యాప్తు చేస్తున్నారట.. కావాలని ఈ కేసును తప్పుదారి పట్టిస్తున్నట్లు వాదనలు రావడంతో ఈ కేసు నుంచి సమీర్ వాంఖడేను తప్పించారు.. ఆ వెంటనే ఈ కేసును సైతం డిప్యూటీ జనరల్ సంజయ్ సింగ్ కు అప్పగించడం జరిగింది. నెలరోజుల పాటు జైల్లో ఉన్న ఆర్యన్ కేసును ఆయన ఒక ఛాలెంజింగ్ తీసుకొని కొనసాగించారు..2022 మే లో సిట్ దాఖలు చేసినటువంటి చార్జిషీట్ లో ఆర్యన్ ఖాన్ తో సహా ఎఫ్ఐఆర్లో ఉన్నటువంటి మరి కొంతమంది పేర్లకు కూడా ఎన్సీబీ క్లీన్ చీట్ ఇచ్చింది.

- Advertisement -

ఆర్యన్ ఖాన్ కి క్లీన్ చిట్ ఇచ్చిన ఎంసీఏ అధికారి స్వచ్ఛంద పదవీ విరామం..

మిగిలిన 14 మందిని ఇందులో నిందితులుగా గుర్తించారు. అయితే ఇప్పుడు తాజాగా ఆర్యన్ ఖాన్ కు క్లీన్ చిట్ ఇచ్చిన ఎన్సీబీ డిడిజీ అధికారి సంజయ్ సింగ్ ఇప్పుడు స్వచ్ఛందంగా పదవీ విరమణ తీసుకోవడంతో దేశవ్యాప్తంగా ఈ విషయం ఒక సంచలనంగా మారుతోంది.దేశంలో ఎన్నో అత్యంత క్లిష్టమైన కేసులలో కూడా ఆయన భాగస్వామ్యమై వాటిని పూర్తి చేశారు. అలాంటి ఆయన స్వచ్ఛంద పదవి విరమణ చేయడం పైన ఇటీవల ఒక మీడియాతో మాట్లాడుతూ.. ఫిబ్రవరి 29న స్వచ్ఛంద రిటైర్మెంట్ తీసుకోవాలని కోరాను ..నా అభ్యర్థనను కూడా ఒడిస్సా రాష్ట్రం కేంద్ర హోంశాఖ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కు తెలియజేశాను.. దాని ప్రకారమే ఈనెల 30న తన కెరీర్ చివరి రోజు అన్నట్టుగా సమాధానం తెలియజేశారు అంటూ తెలిపారు.. దీంతో ఈయన ఎందుకు స్వచ్ఛంద పదవీ విరామం ప్రకటించారు అనే కోణంలో ఇటు నెటిజన్స్ కూడా ఆరాతీస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు