Gaami record on OTT : 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్… గామి సెన్సేషన్

Gaami record on OTT : విశ్వక్సేన్ హీరోగా నటించిన గామి మూవీకి ఓటీటీలో ఊహించని విధంగా రెస్పాన్స్ వస్తోంది. తాజాగా ఈ మూవీ వ్యూస్ పరంగా సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. పాన్ ఇండియా సెన్సేషన్ గా మారిన గామి మూవీ మిలియన్ల వ్యూస్ తో దూసుకెళ్తోంది. గామి మూవీ క్రియేట్ చేసిన కొత్త రికార్డుపై ఓ లుక్కేద్దాం పదండి.

100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్

కొత్త దర్శకుడు విద్యాధర కాగితా దర్శకత్వం వహించిన ప్రయోగాత్మక మూవీ గామి. విశ్వక్సేన్, చాందిని చౌదరి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ రీసెంట్ గా థియేటర్లలో రిలీజయ్యి మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఈ మూవీ రెండు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించింది. ఇక రీసెంట్ గా ఓటీటీలోకి వచ్చిన గామి మూవీకి అక్కడ ఊహించని రెస్పాన్స్ దక్కుతోంది. గామి మూవీ రైట్స్ ను జి5 ఓటిటి ప్లాట్ ఫామ్ దక్కించుకోగా, ప్రస్తుతం ఈ మూవీ దేశవ్యాప్తంగా ట్రెండ్ అవుతోంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ భాషల్లో కూడా స్ట్రీమింగ్ అవుతుండగా, తాజాగా 100 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ ను దాటిందని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు మేకర్స్.

మరో విశేషం ఏమిటంటే దాదాపు 250+ సిటీస్ నుంచి మూవీ లవర్స్ ఈ సినిమాను చూస్తున్నారు అనే విషయాన్ని వెల్లడించింది. మొత్తానికి గామి ఓటిటిలో సంచలనం సృష్టిస్తోంది. అతి తక్కువ బడ్జెట్ తో రూపొందిన గామి మూవీ మార్చి 8న థియేటర్లలోకి వచ్చింది. ఈ మూవీలో అభినయ, హారిక, దయానంద్ కీలకపాత్రలో నటించారు. వి సెల్యులాయిడ్ సమర్పణలో కార్తీక్ శబరీష్ ఈ మూవీని నిర్మించారు.

- Advertisement -

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి బదులుగా గామి

నిజానికి ముందుగా విశ్వక్సేన్ హీరోగా నటిస్తున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ రిలీజ్ కావాల్సి ఉంది. కానీ ఆ మూవీ షూటింగ్ పూర్తి కాకపోవడంతో పాటు పలు అవాంతరాల కారణంగా వాయిదా పడింది. మార్చ్ 8న ఆ మూవీని విడుదల చేస్తామని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు మేకర్స్. కానీ అనుకున్న సమయానికి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిని ప్రేక్షకుల ముందుకు తీసుకు రాలేకపోయారు. అయితే ఆ డేట్ ను వేస్ట్ కానివ్వకూడదు అనే ఉద్దేశంతో గామిని రంగంలోకి దించారు. అనూహ్యంగా ఈ మూవీకి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

విశ్వక్సేన్ నెక్స్ట్ సినిమాల విషయానికి వస్తే…

ప్రస్తుతం కొత్త డైరెక్టర్ రవితేజ ముళ్ళపూడి దర్శకత్వంలో విశ్వక్సేన్ పదవ మూవీ VK 10 తెరకెక్కుతోంది. అందులో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవల ఈ మూవీకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. ఇక ఈ మూవీని ఎస్ఆర్టి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. మరోవైపు చల్ మోహనరంగా ఫేమ్ కృష్ణ చైతన్య దర్శకత్వంలో విశ్వక్సేన్ 11వ మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో నటిస్తున్నారు. ఈ మూవీలో నేహా శెట్టి, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్ ఈ మూవీని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన ఈ మూవీ పలు మార్లు వాయిదా పడింది. కానీ ఇంకా కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చెయ్యలేదు మేకర్స్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు