Vijay deverakonda: బాడీ గార్డ్ కి సడన్ సర్ప్రైజ్.. ఏంటో తెలిస్తే షాక్..!

Vijay deverakonda: తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి.. ఎన్నో కష్టాలను అనుభవించి.. రౌడీ హీరోగా భారీ క్రేజ్ ను సంపాదించుకున్నారు హీరో విజయ్ దేవరకొండ.. మొదట పలు సినిమాలలో చిన్నచిన్న పాత్రలలో నటించిన విజయ్ దేవరకొండ.. అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ కి స్టార్ హీరోగా పేరు సంపాదించారు. ఆ తర్వాత గీత గోవిందం తదితర చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ అందుకున్నారు. ఇదిలా ఉండగా లైగర్ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు.. పైగా భారీ డిజాస్టర్ ను మూటగట్టుకుంది.. కానీ ఆ తర్వాత వచ్చిన ఖుషి సినిమా మాత్రం పరవాలేదనిపించుకుంది. ఇటీవలే విడుదలైన ఫ్యామిలీ స్టార్ సినిమాతో ఫ్లాప్ ని మూట కట్టుకున్నారు విజయ్ దేవరకొండ.

Vijay deverakonda:Sudden surprise for the body guard.. Shock to know what it is..!
Vijay deverakonda:Sudden surprise for the body guard.. Shock to know what it is..!

విజయ్ సర్ప్రైజ్ లకు ఫ్యాన్స్ ఫిదా..

విజయ్ దేవరకొండ ఎప్పుడు కూడా అభిమానులను సడన్ సర్ప్రైజులు చేయడం వంటివి చేస్తూ ఉంటారు.. హెల్పింగ్ నేచర్ కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది. గతంలో కూడా ఖుషి సినిమా సక్సెస్ లో ఒక్కొక్కరికి లక్ష రూపాయలు చొప్పున అభిమానులకు అందించారు.. విజయ్ అభిమానుల కోసం చేసే పనులు పనులు ఊహకందనివిగా ఉంటాయి.. కరోనా సమయంలో మిడిల్ క్లాస్ వారికి ఫండ్ వంటివి కూడా ఇచ్చారు. ప్రతి ఏటా కూడా తన దగ్గర పని చేసే వారి పుట్టినరోజు నాడు వారి కోసం పలు రకాల గిఫ్టులను కూడా పంపిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇప్పుడు తాజాగా తన పర్సనల్ బాడీగార్డ్ కు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చారు రౌడీ హీరో..

బాడీగార్డ్ కి సడన్ సర్ప్రైజ్ ఇచ్చిన విజయ్ దేవరకొండ..

అసలు విషయం లోకి వెళ్తే.. విజయ్ దేవరకొండ దగ్గర పనిచేస్తున్నటువంటి బాడీగార్డ్ రవి తాజాగా వివాహ బంధంలోకి అడుగు పెట్టారు.. తన పెళ్లికి విజయ్ దేవరకొండ తో పాటు ఆయన కుటుంబ సభ్యులను మొత్తం ఆహ్వానించారు రవి.అయితే ఈ విషయాన్ని విజయ్ దేవరకొండ లైట్ తీసుకోకుండా.. తన కుటుంబం మొత్తాన్ని తీసుకువచ్చి తన బాడీగార్డ్ అయిన రవికి సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు విజయ్ దేవరకొండ. అందుకు సంబంధించిన ఫోటోలు , వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఈ విషయం విన్న అభిమానులు సైతం విజయ్ దేవరకొండ ని మరొకసారి ప్రశంసలతో ముంచేస్తున్నారు.

- Advertisement -

విజయ్ దేవరకొండ సినిమాలు..

విజయ్ దేవరకొండ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం డైరెక్టర్ గౌతం తిన్ననూరి డైరెక్షన్ లో ఒక సినిమాలో నటించబోతున్నారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పైన నిర్మిస్తున్నట్లు సమాచారం. విజయ్ దేవరకొండ సరైన బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకోక చాలా కాలం అవుతోంది. మరి ఈసారైనా అభిమానుల కోరిక మేరకు విజయ్ దేవరకొండ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంటారేమో చూడాలి.. ఇకపోతే మరొకవైపు ఈయన మల్టీస్టారర్ సినిమాలలో కూడా నటిస్తున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి కానీ అటువంటి ప్రాజెక్ట్స్ ఏవి ఇంకా తెరపైకి రాలేదు. ఒకవేళ మంచి కథ లభిస్తే మాత్రం కచ్చితంగా మల్టీ స్టారర్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు రౌడీ హీరో.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు