Toxic Movie Update : కేజీఎఫ్ స్ట్రాటజీ ఫాలో అవుతున్న యష్.. కథ సిద్ధమేనా..?

Toxic Movie Update : డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కేజీఎఫ్ సీరీస్‌తో భారీ స్టార్ డమ్ అందుకున్న కన్నడ హీరో యష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేజిఎఫ్-1,2 సిరీస్ లతో మంచి విజయాలను అందుకున్న యష్ దాదాపుగా మళ్లీ కొన్నేళ్ల తర్వాత తన తదుపరి చిత్రాన్ని టాక్సిక్ అంటూ అనౌన్స్మెంట్ చేశారు. ఈ చిత్రాన్ని మలయాళం డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తున్నారు. పాన్ ఇండియా ప్రాజెక్ట్ కావడం చేత ఇందులో స్టార్ కాస్ట్యూమ్ కూడా నటిస్తోంది. ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.

రెండు భాగాలుగా టాక్సిక్ విడుదల..

ఇప్పుడు తాజాగా టాక్సిక్ సినిమా నుంచి ఒక న్యూస్ వైరల్ గా మారుతోంది. అదేమిటంటే ఈ సినిమా షూటింగ్ ఇటీవలే మొదలైందని.. కర్ణాటకలో ఈ చిత్రానికి సంబంధించి కొన్ని కీలకమైన సన్నివేశాలు కూడా చిత్రీకరించినట్లుగా తెలుస్తోంది. టాక్సిక్ చిత్రం కూడా కేజిఎఫ్ తరహాలోనే రెండు భాగాలుగా తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. ఈ విషయం పైన ఇంకా చిత్ర బృందం అధికారికంగా ప్రకటించలేదు. త్వరలోనే ప్రకటించే అవకాశం ఉన్నది. అలాగే చిత్రంలోని నటీనటుల గురించి కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ పలు రకాల రూమర్స్ అయితే వినిపిస్తూ ఉన్నాయి.

టాక్సిక్‌లో బాలీవుడ్ భామ..

ముఖ్యంగా బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ నటించబోతున్నట్లు మాత్రం రూమర్స్ వినిపిస్తున్నాయి. టాక్సిక్ సినిమాని భారీ బడ్జెట్ తో కేవీఎన్ ప్రొడక్షన్ బ్యానర్ పైన నిర్మిస్తూ ఉన్నారు. యాక్షన్ ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కిస్తున్న ఈ సినిమాని 2025 ఏప్రిల్ 10వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం. ఇదివరకే అధికారికంగా ప్రకటించారు. యష్ అభిమానులు ఈ సినిమా కోసం చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇటీవల బాలీవుడ్లో డైరెక్టర్ నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న రామాయణంలో కూడా యష్ రావణాసుర పాత్రలో నటించబోతున్నట్లు సమాచారం.

- Advertisement -

కే జి ఎఫ్ -3 కూడా..

కే జి ఎఫ్ సినిమా తర్వాత ఒక్కో చిత్రానికి భారీగానే రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు యష్.. రాబోయే రోజుల్లో కచ్చితంగా కేజిఎఫ్-3 కూడా ఉంటుందని ఇదివరకే ఒక హింట్ కూడా ఇవ్వడం జరిగింది. మరోవైపు తాజాగా నటిస్తున్న టాక్సిక్ కూడా రెండు భాగాలుగా తెరకెక్కించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఏ మేరకు ఇది నిజమో చూడాలి మరి.

కే జి ఎఫ్ హీరో యష్ కెరియర్..

సీరియల్ యాక్టర్ గా కెరియర్ మొదలుపెట్టిన హీరో యష్ అప్పటివరకు ఎవరికీ పెద్దగా తెలియదని చెప్పాలి. ఆ తర్వాత కన్నడలో కొన్ని చిన్న చిన్న చిత్రాలలో నటించిన ఈయన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కేజిఎఫ్ సినిమా చేసి పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు.. అంతేకాదు కన్నడ సినీ పరిశ్రమ ను పాన్ ఇండియా రేంజ్ లో పేరు దక్కించేలా చేశారు.. మొత్తానికైతే ఈ సినిమాలతో యష్ పేరు భారీగా మారూమ్రోగడం తో ఇప్పుడు ఈయనకు వరుసగా అవకాశాలు క్యూ కడుతున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు