HanumanJayanthiSpecial : హనుమాన్ బయోపిక్స్ లో ఫస్ట్ అనిమేషన్.. ఏకంగా చిరంజీవి వాయిస్ ఇచ్చాడు..

HanumanJayanthiSpecial : హిందువులు జరుపుకునే విశేషమైన పండుగల్లో ఒకటైన హనుమాన్ జన్మదినోత్సవమంటే చిన్న పిల్లలకు కూడా ఇష్టమైన పండుగ. హనుమాన్ అంటే ఒక సూపర్ హీరోగా చిన్న పిల్లల దృష్టిలో నిలిచిపోతారు. ఇక నేడు ఏప్రిల్ 23వ తేదీన మంగళవారం నాడు హనుమాన్ జన్మదినోత్సవం కావున దేశవ్యాప్తంగా “హనుమాన్ జయంతి” (HanumanJayanthiSpecial) వేడుకలను భక్తులు జరుపుకోనున్నారు. ఇక చిన్న పిల్లలకు ఎంతో ఇష్టమైన దేవుడు హనుమాన్ అని అంటారు. హనుమంతుల వారి చరిత్ర, సాహసాలు పిల్లల్ని ఎంతో ఆకట్టుకుంటాయి. అయితే హనుమాన్ పాత్ర తో హనుమాన్ పైన ఎన్నో అనిమేషన్ చిత్రాలు రావడం జరిగింది. అయితే ఆ అనిమేషన్ లో ఇప్పటికీ బెస్ట్ అనిపించే చిత్రం “హనుమాన్”2005. 19 ఏళ్ళ కి కింద వచ్చిన ఈ చిత్రం ఇప్పటికీ టీవీల్లో గనక వస్తే చిన్న పిల్లలతో సహా పెద్దలు కూడా చూస్తారు.

హనుమాన్ కి చిరంజీవి వాయిస్ ఓవర్..

ఇక హనుమాన్ చిత్రం 2005 లో తెరకెక్కిన అనిమేషన్ మూవీ ని శైలేంద్ర సింగ్ తెరకెక్కించగా, v.g సమంథ్ దర్శకత్వం వహించాడు. ఇక ఈ చిత్రం 2005 లో థియేటర్లలో విడుదలై ఘన విజయం సాధించింది. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు ఈ చిత్రాన్ని బాగా ఆదరించారు. ఎందుకంటే హనుమాన్ అనిమేషన్ చిత్రంలో హనుమాన్ పాత్రకి స్వయంగా మెగాస్టార్ చిరంజీవి డబ్బింగ్ చెప్పారు. ఇక స్వతహాగా చిరంజీవి ఆంజనేయస్వామి భక్తుడన్న విషయం తెలిసిందే. ఇక చిరంజీవి వాయిస్ తో పాటు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఈ చిత్రంకోసం పాడిన “మహా బలి హనుమాన్” పాట హనుమాన్ భక్తులని ఎంతో ఆకట్టుకుంది. ఇక అప్పట్లో ఈ హనుమాన్ చిత్రం కోసం చిరంజీవి బాగా ప్రమోషన్ చేయడం జరిగింది.

ప్రేక్షకులకు బెస్ట్ హనుమాన్ అనిమేషన్..

ఇక హనుమాన్ చిత్రాన్ని పెర్సెప్ట్ పిక్చర్స్ మరియు సిల్వర్‌టూన్స్  బ్యానర్స్ కలిసి నిర్మించాయి. ఇక ఈ సినిమా యానిమేషన్‌ను ‘కాకరకాయ పులుసు’ కంపెనీ వారు రూపొందించారు. ఈ చిత్రంలో 2డి యానిమేషన్‌ను ఉపయోగించారు. ఇక 2005 లో వచ్చిన ఈ చిత్రం 3 కోట్ల బడ్జెట్ పెట్టగా, ఆరోజుల్లోనే థియేటర్లలో ఏకంగా 8.36 కోట్లు వసూలు చేసింది. ఒక అనిమేషన్ చిత్రానికి ఇంత వసూళ్లు రావడం అప్పట్లో రికార్డ్ అనే చెప్పాలి. ఇక ఈ చిత్రం ప్రేక్షకులకి హనుమాన్ కథ నేపథ్యంలో బెస్ట్ మూవీ గా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ చిత్రంలో ఎక్కువ సాగదీయకుండా, చిన్న పిల్లలకు అర్ధమయ్యే భాషలో, ముఖ్యంగా తక్కువ సమయంలో ఉన్నది ఉన్నట్టుగా చూపించారు మేకర్స్. ఎందుకంటే ఇప్పుడు హనుమాన్ కథ నేపథ్యంలో వస్తున్న చిత్రాల్లో పెద్దగా కథని చెప్పడం లేదు. అన్ని అనిమేషన్ లు కూడా ఫాంటసి కథలతో ఫిక్షనల్ డ్రామాలు ఎక్కువగా జోడించి తీస్తున్నారు. రీసెంట్ గా వచ్చిన ది లెజెండ్ అఫ్ హనుమాన్ కూడా అలా వచ్చిందే. ఇక హనుమాన్ కి సీక్వెల్ చిత్రం గా 2007 లో ది రిటర్న్ అఫ్ హనుమాన్ అనే మూవీ కూడా వచ్చింది. అయితే ఆ చిత్రం ఫస్ట్ పార్ట్ అంతగా ఆడలేదు.

- Advertisement -

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు