HanumanJayanthiSpecial : హనుమాన్ కథ ఆధారంగా వచ్చిన బెస్ట్ అనిమేషన్ మూవీస్ ఇవే !

HanumanJayanthiSpecial : హిందువులు జరుపుకునే విశేషమైన పండుగల్లో ఒకటి హనుమాన్ జన్మదినోత్సవం. పురాణాల ప్రకారం, ఛైత్ర మాసంలో శుద్ధ పౌర్ణమి రోజున హనుమంతుడు జన్మించాడని చెబుతారు. అయితే ఈసారి హనుమాన్ జయంతి మంగళవారం నాడు రావడంతో మరింత ప్రత్యేకత సంతరించుకుంది. ఇక నేడు ఏప్రిల్ 23వ తేదీన మంగళవారం నాడు హనుమాన్ జన్మదినోత్సవం కావున దేశవ్యాప్తంగా “హనుమాన్ జయంతి” వేడుకలను భక్తులు జరుపుకోనున్నారు. ఈ పర్వదినాన దేశవ్యాప్తంగా “హనుమాన్” విగ్రహాలతో భారీగా ఊరేగింపు కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఇక చిన్న పిల్లలకు ఎంతో ఇష్టమైన దేవుడు హనుమాన్ అని అంటారు. హనుమాన్ చరిత్ర సాహసాలు అలాంటివి మరి. ఇక హనుమాన్ నేపథ్యంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు రావడం జరిగింది. ఇక హనుమాన్ జన్మదినోత్సవం సందర్బంగా ఇండియా లో వచ్చిన బెస్ట్ హనుమాన్ (HanumanJayanthiSpecial) ఆనిమేషన్ మూవీస్ ని ఒకసారి చూద్దాం..

హనుమాన్ 2005 :

2005 లో వచ్చిన ఈ చిత్రం “హనుమాన్” చరిత్ర ఆధారంగా వచ్చిన అనిమేషన్ చిత్రాల్లో అన్నిటికంటే ముఖ్యమైనది. ఈ చిత్రమంటే ఇప్పటికీ పిల్లలతో సహా పెద్దలు కూడా ఇష్టపడతారు. క్షితిజ్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆ రోజుల్లో ప్రేక్షకుల్ని ఎంతో ఆకట్టుకుంది. ఇక ఈ చిత్రం హిందీ వెర్షన్ కి ముఖేష్ ఖన్నా వాయిస్ ఓవర్ ఇవ్వగా, తెలుగు వెర్షన్‌కి మెగాస్టార్ చిరంజీవి వాయిస్‌ని అందించారు. అంతే కాదు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఈ చిత్రం కోసం పాడిన మహాబలి వీర హనుమాన్ పాట ఎంతో ఫేమస్ అయింది.

- Advertisement -

ది రిటర్న్ అఫ్ హనుమాన్ 2007 :

హనుమాన్ అనిమేషన్ చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఫిక్షనల్ డ్రామాగా తెరకెక్కగా 2007 లో వచ్చి ప్రేక్షకుల్ని అలరించింది.

హనుమాన్ ది దందార్ 2017 :

R.A.T ఫిల్మ్స్ బ్యానర్ లో వచ్చిన ఈ చిత్రం ఈ కథ హనుమాన్‌ను అనుసరించి సాగుతుంది. సల్మాన్ ఖాన్, రవీనా టాండన్, జావేద్ అక్తర్ వంటి ప్రముఖ నటులు ఈ చిత్రానికి వాయిస్ ఓవర్ ఇవ్వడం విశేషం.

బాల్ హనుమాన్ 1, 2 : 2010

హనుమాన్ జీవిత చరిత్ర పై వచ్చిన ఈ అనిమేషన్ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కగా, మొదటి భాగంలో హనుమాన్ జీవిత చరిత్రపై ఇతిహాస చరిత్రను తెలుపుతుంది. ఇక రెండో భాగం ఫిక్షనల్ డ్రామాగా తెరకెక్కింది.

హనుమాన్ VS మహిరావణ్ 2018

హనుమాన్ వర్సెస్ మహిరావణ్ సినిమా 2018లో విడుదల కాగా, కథ ను నారాయణన్ వైద్యనాథన్ రాయగా, డాక్టర్ ఎజిల్ వేందన్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం లో హనుమంతుడు మహిరావణుడి బారి నుండి శ్రీరామ లక్ష్మణులను విడిపించడం పై కథ సాగుతుంది.

ది లెజెండ్ అఫ్ హనుమాన్ 1,2,3 వెబ్ సిరీస్ (2021)

లాక్ డౌన్ తర్వాత ఓటిటి ల ట్రెండ్ నడుస్తున్న నేపథ్యంలో ది లెజెండ్ అఫ్ హనుమాన్ చిత్రాన్ని వెబ్ సిరీస్ లాగా మలచి హాట్ స్టార్ లో రిలీజ్ చేసారు. మూడేళ్ళ కింద వచ్చిన ఫస్ట్ సీజన్ ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకోగా, రెండో సీజన్ కూడా మెప్పించింది. రీసెంట్ గా మూడో సీజన్ కూడా రాగా, యావరేజ్ రెస్పాన్స్ అందుకుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు