Allu Arjun : స్టంట్స్ విషయంలో ఆయనకు ఉన్న జ్ఞానం… బన్నీపై కేజిఎఫ్ నటుడి కామెంట్స్

Allu Arjun : మోస్ట్ అవైటింగ్ మూవీ పుష్ప గురించి ప్రేక్షకులు ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందులో భాగంగానే ఆ మూవీ గురించి గానీ, అందులో నటిస్తున్న నటీనటుల గురించి గానీ ఎలాంటి వార్త వచ్చినా ఇట్టే వైరల్ అయిపోతుంది. తాజాగా అల్లు అర్జున్ పై కేజిఎఫ్ నటుడు చేసిన కీలక వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. స్టంట్స్, డ్యాన్స్ విషయంలో అల్లు అర్జున్ పై కన్నడ నటుడు తారక్ పొన్నప్ప ఎలాంటి కామెంట్స్ చేశాడు? అంటే…

బన్నీకి ఉన్న జ్ఞానం గురించి…

కేజిఎఫ్ సినిమాలో కన్నడ నటుడు తారక్ పొన్నప్ప కీలక పాత్రలో మెరిసి అందరి దృష్టిని ఆకర్షించారు. ప్రస్తుతం ఆయన పుష్ప 2 మూవీలో కూడా నటిస్తున్నారు. అందులో భాగంగానే ఇటీవల కాలంలో షూటింగ్లో పాల్గొన్న పొన్నప్ప తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ తో వర్క్ ఎక్స్పీరియన్స్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించారు.

తాజా ఇంటర్వ్యూలో పాల్గొన్న పొన్నప్ప తనకు పుష్ప : ది రూల్ మూవీలో అల్లు అర్జున్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం దొరికిందని, బన్నీతో ఏకంగా యాక్షన్ సీక్వెన్స్ ఉందని పొన్నప్ప చెప్పుకొచ్చాడు. కానీ తనకు యాక్షన్ స్టంట్స్ చేయడంలో పెద్దగా ఎక్స్పీరియన్స్ లేదని, ఈ విషయాన్ని తెలుసుకున్న అల్లు అర్జున్ పలు టెక్నిక్స్ నేర్పించారనే ఇంట్రెస్టింగ్ విషయాన్నీ బయట పెట్టారు ఈ యాక్టర్. డాన్స్ తో పాటు స్టంట్స్ విషయంలో ఆయనకి ఉన్న జ్ఞానం చూసి తను ఆశ్చర్యపోయానని బన్నీకి ఉన్న హెల్పింగ్ నేచర్ ను బయట పెట్టారు.

- Advertisement -

తనకు స్టంట్స్ విషయంలో ఎక్స్పీరియన్స్ లేదన్న విషయం తెలుసుకున్న అల్లు అర్జున్ బాడీ పొజిషనింగ్ తో పాటు ఆన్ స్క్రీన్ మీద ఎలా కనిపిస్తాం అనే విషయాలకు సంబంధించి పలు ముఖ్యమైన మెలకువలు నేర్పించాలని ఈ సందర్భంగా పొన్నప్ప వెల్లడించారు. ప్రస్తుతం అల్లు అర్జున్ గురించి తారక్ పొన్నప్ప చేసిన ఈ కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

హైప్ పెంచేసిన గంగమ్మ జాతర టీజర్

ఇక మరోవైపు పుష్ప టీం మొత్తం వీలైనంత త్వరగా షూటింగ్ ను పూర్తి చేసే పనిలో పడింది. సుకుమార్ దర్శకత్వంలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ ఇంకా సెట్స్ పైనే ఉంది. హైదరాబాదులో ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగా పుష్ప ది రూల్ మూవీని ఆగస్టు 15న థియేటర్లోకి తీసుకురాబోతున్నారు మేకర్స్. ఈసారి తెలుగు, హిందీ, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లోనే కాకుండా బెంగాలీ, జపాన్ భాషల్లో కూడా మూవీని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు చిత్ర బృందం.

ఇటీవలే అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన టీజర్ లో మాతంగిగా అల్లు అర్జున్ అవతారం, గంగమ్మ తల్లి జాతరలో ఉండబోయే యాక్షన్ సీక్వెన్స్ పై అంచనాలను అమాంతంగా పెంచేసింది. ఈ నేపథ్యంలో కన్నడ యాక్టర్ తారక్ పొన్నప్ప అల్లు అర్జున్ గురించి చేసిన పాజిటివ్ కామెంట్స్ సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచేస్తున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు