Kamal Haasan Maternal Uncle Passes Away : కమల్ ఇంట విషాదం… కన్నుమూసిన మామ

Kamal Haasan Maternal Uncle Passes Away : యూనివర్సల్ హీరో కమల్ హాసన్ మామ మామ శ్రీనివాసన్ కొడైకెనాల్‌లో కన్నుమూశారు. ఆయన వయసు 92 సంవత్సరాలు. వయసు సంబంధింత సమస్యలతో ఆయన కన్నుమూసినట్టు సమాచారం. పరమకుడికి చెందిన ఆయన వైమానిక దళంలో పని చేశారు. ఆ తర్వాత కొడైకెనాల్‌ లో చాలా కాలం నివసించారు. ఆయన భౌతికకాయాన్ని చెన్నైకి తీసుకొచ్చి ఆళ్వార్‌పేటలోని ప్రజా న్యాయ కేంద్రం ప్రధాన కార్యాలయంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈరోజు ఆయన భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కమల్ తెలిపారు. తన మామ మరణం గురించి కమల్ హాసన్ ట్విట్టర్ లో స్పెషల్ పోస్ట్ ద్వారా వెల్లడించారు. శ్రీనివాసన్‌ను కుటుంబ సభ్యులు వాసు మామ అని పిలుచుకునేవారు.

కమల్ హాసన్ స్పెషల్ పోస్ట్..

తన మామ శ్రీనివాసరెడ్డి గురించి కమల్ హాసన్ స్పందిస్తూ ట్విట్టర్లో చేసిన స్పెషల్ పోస్టులో నా వ్యక్తిత్వ వికాసానికి అంకుల్ ఆరుయిర్ శ్రీనివాసన్ మామ ప్రధాన పాత్ర పోషించారు. ఆయన ఈరోజు కొడైకెనాల్‌లో 92 ఏళ్ల వయసులో కన్నుమూశారు. మామ వాసు తన విప్లవాత్మక ఆలోచనలు, ధైర్య సాహసాల విషయంలో వీరోచిత వ్యక్తి. అంత్యక్రియల కోసం ఆయన భౌతికకాయాన్ని సోమవారం రాత్రి ప్రజానీతి కేంద్రం కార్యాలయానికి తీసుకు వచ్చారు. రేపు అంటే ఏప్రిల్ 24న ఉదయం 10:30 గంటలకు బీసెంట్ నగర్ మిన్ మయన్‌లో దహన సంస్కారాలు జరుగుతాయని నేను మీకు తెలియజేస్తున్నాను అంటూ రాసుకొచ్చారు. ఇక ఎలక్షన్స్ నేపథ్యంలో శ్రీనివాసన్ కన్నుమూయగా, కమల్ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ కు పలువురు సినీ ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా స్పందిస్తున్నారు. అలాగే కమల్ అభిమానులు కూడా సోషల్ మీడియా వేదికగా ఆయన మృతికి సంతపాన్ని తెలియజేస్తున్నారు.

శృతి హాసన్ నివాళి

శృతి హాసన్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో మామ వాసుతో ఉన్న ఫోటోను పంచుకుంటూ అతనికి నివాళులర్పించారు. “శాంతి, శక్తితో విశ్రాంతి తీసుకోండి వాసు మామా – మీరు చాలా మిస్ అవుతారు. నా చిన్ననాటి జ్ఞాపకాలన్నింటికీ థాంక్స్, కోడిలో అడవుల్లో గంటల తరబడి నాకు జీవితం గురించి చెబుతూ, ప్రకృతి గురించి బోధిస్తూ, మీ అందమైన కథలతో నన్ను తీర్చిదిద్దినందుకు ధన్యవాదాలు. మీరు ఒక రకమైన, నిజమైన తిరుగుబాటుదారుడు. స్వచ్ఛమైన బంగారు హృదయం – నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తున్నాను వాసు మామా (sic).” అంటూ పోస్ట్ చేసింది శృతి హాసన్.

- Advertisement -

ఉదయనిధి స్టాలిన్ సంతాపం

కమల్ హాసన్ మామ మృతి పట్ల మంత్రి ఉదయనిధి స్టాలిన్ కూడా సంతాపం తెలిపారు. మహాలక్ నీతి మయ్యం పార్టీ మామ శ్రీనివాసన్ మరణ వార్త విని మేము చాలా బాధపడ్డాము. కమల్ సర్‌కు సినీ ప్రపంచంలో, రాజకీయ రంగాల్లో అత్యంత సన్నిహితంగా మెలిగిన శ్రీ శ్రీనివాసన్ మరణం ఆయన కుటుంబానికి తీరని లోటు. కమల్ సర్‌కు, ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అంటూ శ్రీనివాసన్ మృతి పట్ల స్పందించారు ఉదయనిధి స్టాలిన్.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు