Dasari Jubilee: డైరెక్టర్స్ డే.. ప్రభాస్ మంచి మనసు.. ఎన్ని కోట్ల విరాళం అంటే..?

Dasari Jubilee.. సాధారణంగా కొన్ని ప్రత్యేకమైన పర్వదినాలలో కొంతమందిని ప్రత్యేకంగా తలుచుకుంటామన్న విషయం తెలిసిందే.. అయితే ఇలాంటిదే దర్శకుల దినోత్సవం కూడా… ఒక్క తెలుగు సినీ ఇండస్ట్రీలో తప్ప ఇతర భాషల్లో ఎక్కడ ఇలాంటి ప్రయత్నమే జరగలేదు.. దీనికి కారణం 150 చిత్రాలకు దర్శకత్వం వహించి.. తెలుగు సినిమా గౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పి గిన్నీస్ బుక్ రికార్డు సాధించిన ఏకైక దర్శకుడు దాసరి నారాయణరావు అని చెప్పవచ్చు.. ముఖ్యంగా భారతీయ సినిమాకి డైరెక్టర్స్ డే అనేది తలమానికం అని చెప్పాలి. సినిమా పరిశ్రమకు చేసిన సేవే కాదు.. సినిమా ఇండస్ట్రీలో పనిచేసే కార్మికులకు కూడా అండగా నిలిచి.. ఇండస్ట్రీ పెద్ద అనిపించకున్న దాసరి నారాయణరావు పై ఉన్న గౌరవంతోనే ఆయన పేరు మీదే డైరెక్టర్స్ డే చేయాలనుకున్నారట. ఇక ఇదే విషయాన్ని ప్రముఖ దర్శకుల సంఘం పూర్వ అధ్యక్షుడు ఎన్.శంకర్, ప్రస్తుత అధ్యక్షుడు వీర శంకర్ కూడా స్పష్టం చేశారు..

Dasari Jubilee..Prabhas's good heart.. How many crores donation means..?
Dasari Jubilee..Prabhas’s good heart.. How many crores donation means..?

హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఘనంగా డైరెక్టర్స్ డే..

అగ్ర దర్శకుడు దాసరి నారాయణరావు పుట్టిన రోజు సందర్భంగా హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ఈ డైరెక్టర్స్ డే వేడుకలను నిర్వహించబోతున్నట్లు సమాచారం..ఈ వేడుకకు సంబంధించిన వివరాలను సోమవారం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ వెల్లడించారు. ఈ ప్రెస్ మీట్ లో పలువురు దర్శకులు పాల్గొనగా.. సీనియర్ రచయిత , దర్శకుడు విజయేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా TFDA.In వెబ్సైటును అధికారికంగా ప్రారంభించారు.. ఇక ఈ విషయంపై దర్శకుల సంఘం అధ్యక్షుడు వీర శంకర్ మాట్లాడుతూ.. అందరి సహకారంతో గత ఐదు సంవత్సరాలుగా ఈ వేడుకను జరుపుతున్నాము.. ముఖ్యంగా పరిశ్రమ అంతా కలుపుకొని ఈ వేడుకలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది అంటూ ఆయన తెలిపారు..

డైరెక్టర్స్ డే కి ప్రభాస్ భారీ విరాళం..

దాసరి నారాయణరావు పుట్టిన రోజు సందర్భంగా జరగబోతున్న ఈ డైరెక్టర్స్ డే రోజున.. సంఘం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాల కోసం రెబల్ స్టార్ ప్రభాస్ ఏకంగా రూ.35 లక్షల విరాళం ప్రకటించినట్లు దర్శకుడు మారుతి స్పష్టం చేశారు.. ఇక ఈ కార్యక్రమానికి రాంప్రసాద్ , హరీష్ శంకర్, రేలంగి నరసింహారావు, వి.ఎన్.ఆదిత్య, రాజావన్నెం రెడ్డి, సముద్ర, దశరథ తో పాటు యంగ్ డైరెక్టర్లు కూడా పాల్గొన్నారు. ఇక ఈ కార్యక్రమానికి ప్రభాస్ ప్రకటించిన విరాళం చూసి అభిమానుల సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.. సినీ సెలెబ్రిటీలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

ప్రభాస్ సినిమాలు..

ఇక ప్రభాస్ కెరియర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు.. మరోవైపు ప్రభాస్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి 2898 ఏడి అనే చిత్రంలో నటిస్తున్నారు. అలాగే స్పిరిట్, సలార్ -2, రాజా సాబ్ వంటి చిత్రాలలో నటిస్తున్నారు. ఒక్కో చిత్రానికి రూ.100 కోట్లకు పైగానే పారితోషకం తీసుకుంటూ ఉండడం గమనార్హం.. ఏది ఏమైనా పారితోషకం తగ్గట్టుగానే ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలకు కూడా విరాళాలు ప్రకటిస్తూ మరోసారి మంచి మనసు చాటుకున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు