Manjummel Boys : తెలుగులోనూ రికార్డ్ ఓపెనింగ్స్ సాధించిన మలయాళ బొమ్మ..

Manjummel Boys : మలయాళంలో ఈ మధ్య ఏ సినిమా వచ్చినా అది బ్లాక్ బస్టర్ అయి కూర్చుంటుంది. జోనర్, హీరో అలాంటిది ఏమి పట్టించుకోకుండా ఆడియన్స్ ఎలాంటి సినిమానైనా హిట్ చేసే పడేస్తున్నారు. ఆ మధ్య ప్రేమలు, భ్రమయుగం, లేటెస్ట్ గా ఆడు జీవితం ఈ సినిమాలన్నీ వంద కోట్ల బ్లాక్ బస్టర్లు గా నిలిచాయి. అయితే వీటితో పాటు మలయాళంలో చిన్న సినిమాగా రిలీజ్ అయి, అనూహ్యంగా బ్లాక్ బస్టర్ అయి, ఉప్పుడు ఏకంగా ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన సినిమా మంజుమ్మేల్ బాయ్స్. అలా మలయాళంలో ఇండస్ట్రీ రికార్డులతో బెండు తీసిన మంజుమ్మేల్ బాయ్స్(Manjummel Boys) అక్కడ రికార్డుల దుమ్ము దుమారం లేపి లాంగ్ రన్ ని కూడా ఎంజాయ్ చేయగా, ఇప్పటికీ అక్కడ లిమిటెడ్ కలెక్షన్స్ తో రన్ అవుతూ ఉండగా సినిమా ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ గా,
222 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపగా, లేటెస్ట్ గా సినిమా తెలుగు లో డబ్ అయ్యి రిలీజ్ అవ్వగా, యునానిమస్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఇక ఫస్ట్ డే ఫ్యామిలీ స్టార్ మూవీ ఎఫెక్ట్ వల్ల పెద్దగా ఓపెనింగ్స్ రావని అందరూ అంచనా వేశారు. కానీ అందరి అంచనాలను అధిగమించి ఈ సినిమా తెలుగులో కూడా రికార్డ్ ఓపెనింగ్స్ సాధించింది.

డే వన్ కోటి లెక్క..

ఇక మంజుమ్మేల్ బాయ్స్ మళయాళంలో ఎలాంటి టాక్ తెచ్చుకుందో తెలుగులో కూడా అదే రేంజ్ రెస్పాన్స్ తెచ్చుకోగా, ఈ సినిమా జోనర్ దృశ్యా చూసుకుంటే షో షోకి కలెక్షన్స్ పరంగా జోరు చూపిస్తూ దుమ్ము దుమారం లేపింది. మొదటి రోజు సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఆల్ మోస్ట్ 1.7 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపింది. ఆల్ మోస్ట్ షేర్ 1 కోటి కి పైగా సొంతం చేసుకున్న సినిమా ఓవరాల్ గా మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే.. నైజాం లో 54 లక్షలు, ఆంధ్ర లో 50 లక్షలు షేర్ వసూలు చేయగా రెండు రాష్ట్రాల్లో కలిపి 1.04 కోట్ల షేర్ 1.75 కోట్ల గ్రాస్ లెక్క ఉంటుందని సమాచారం.

వీకెండ్ లో తెలుగులో లాభాల్లోకి వచ్చే ఛాన్స్?

ఇక తెలుగులో ఫ్యామిలీ స్టార్ సినిమా వల్ల ఒకరోజు లేట్ గా రిలీజ్ అయినా మంజుమ్మేల్ బాయ్స్ తెలుగులో మంచి ఓపెనింగ్స్ సాధించింది. ఇక తెలుగులో ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ వారు రిలీజ్ చేయడం విశేషం. ఇక తెలుగు లో ఈ సినిమా వాల్యూ బిజినెస్ రేంజ్ 2 కోట్ల రేంజ్ లో ఉండగా 2.3 కోట్ల దాకా షేర్ ని అందుకుంటే తెలుగు లో సినిమా సక్సెస్ ఫుల్ మూవీ అనిపించుకుంటుంది. ఇప్పటికే కోతికి పైగా వేయేళ్లు అందుకోగా, ఆది వారం నాడు మరో కోటి రావచ్చు. సినిమా ఊపు చూస్తూ ఉంటే సినిమా వీకెండ్ లోనే బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు లో మంచి కలెక్షన్స్ తో లాభాలను కూడా సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు