Family Star : కొండన్న కి ఊహకందని దెబ్బ.. రెండో రోజు దారుణం..

Family Star : టాలీవుడ్ లో ఈ వారం భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన క్రేజీ సినిమా ఫ్యామిలీ స్టార్. రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన ఈ సినిమా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన విషయం తెలిసిందే. గీత గోవిందం వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీరి కాంబోలో సినిమా రావడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీనికి తోడు ఈ సినిమాలో టాలెంటెడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా ఎన్నో భారీ అంచనాల నడుమ ఏప్రిల్ 5న రిలీజ్ అయింది. అయితే ప్రీమియర్స్ నుండే ఈ సినిమా అంతగా లేదని నెగిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. అయినా విజయ్ దేవరకొండ సినిమా కాబట్టి టాక్ తో సంబంధం లేకుండా భారీ ఓపెనింగ్స్ వస్తాయి అని అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఈ సినిమా విజయ్ కెరీర్ లో గత ఐదారేళ్లలో వచ్చిన సినిమాల కంటే లోయెస్ట్ ఓపెనింగ్స్ అందుకుంది. రిలీజ్ అయిన ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా కేవలం 6.30 కోట్ల షేర్ మాత్రమే వసూలు చేసింది. ఇక వీకెండ్ కావడంతో రెండోరోజైన ,మంచి హోల్డ్ వస్తుందని అనుకున్నారు అందరూ. కానీ ఊహించిన దానికంటే దారుణమైన కలెక్షన్లను ఫ్యామిలీ స్టార్ కి వచ్చాయి.

రెండో రోజు టిల్లు స్క్వేర్ కన్నా తక్కువ..

బాక్స్ ఆఫీస్ దగ్గర విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్(Family Star ) మూవీ రెండో రోజుకి వచ్చే సరికి బాక్స్ ఆఫీస్ దగ్గర ఏమాత్రం అంచనాలను అందుకోలేక పోయింది. ఆన్ లైన్ టికెట్ సేల్స్ లో డ్రాప్స్ ఉన్నా కూడా ఫ్యామిలీ మూవీ కావడంతో, ఆఫ్ లైన్ లో ఎంతో కొంత హోల్డ్ చూపించి కలెక్షన్స్ ని సాధిస్తుంది అనుకున్నారు. కానీ సినిమా ఏమాత్రం అంచనాలను అయితే అందుకోలేక పోయింది. దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా తీవ్రంగా నిరాశ పరిచే విధంగా కేవలం 1.55 కోట్ల రేంజ్ లోనే షేర్ ని సొంతం చేసుకుని నిరాశ పరిచింది. ఇక వరల్డ్ వైడ్ గా ఓవర్సీస్ లో అప్డేట్ అయిన కలెక్షన్స్ తో 4.15 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంది. దాంతో టోటల్ గా సినిమా 2 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… నైజాం లో 2.72 కోట్లు, ఆంధ్ర 2.68 కోట్లు కలిపి, రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 5.40 కోట్ల షేర్ రాబట్టింది.

ఆదివారమైనా హోల్డ్ చూపిస్తుందా?

ఇక ఫ్యామిలీ స్టార్ కర్ణాటక రెస్ట్ అఫ్ ఇండియా కలిపి 75 లక్షలు రాబట్టగా, ఓవర్సీస్ లో 4.15 కోట్ల షేర్ కలిపి వరల్డ్ వైడ్ గా 10.30 కోట్ల షేర్ రాబట్టగా. 19.05 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.మొత్తం మీద ఫ్యామిలీ స్టార్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 44 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ కాకుండా క్లీన్ హిట్ కోసం ఇంకా 33.70 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే కనీసం ఆదివారం సెలవురోజైనా హోల్డ్ చూపిస్తుందో లేదో చూడాలి. సినిమా ఎలాగూ లాస్ అయ్యేలాగే కనిపిస్తుంది. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు