Sharma and Ambani Trailer : ధన్య బాలకృష్ణన్ ఓటిటి ప్రయోగం వర్కౌట్ అవుతుందా?

Sharma and Ambani Trailer : ఈ మధ్యకాలంలో కామెడీ ఎంటర్టైనర్లకు క్రైమ్ జానర్ తోడైతే ఆ సినిమాలు అద్భుతాలు సృష్టిస్తున్నాయి. అదే కోవలో ఇప్పుడు శర్మ అండ్ అంబానీ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయింది. అయితే ఈ మూవీ సిల్వర్ స్క్రీన్ పై కాకుండా ఓటిటిలో అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. ప్రమోషన్లలో భాగంగా తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.

శర్మ అండ్ అంబానీ ట్రైలర్ విశేషాలు..

భరత్ తిప్పిరెడ్డి, ధన్య బాలకృష్ణన్, కేరాఫ్ కంచరపాలెం కేశవ కర్రీ కీలక పాత్రలలో నటించిన కామెడీ అండ్ క్రైమ్ మూవీ శర్మ అండ్ అంబానీ. ఈ మూవీ డైరెక్ట్ గా ఓటిటి ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్ యాప్ లో ఏప్రిల్ 11వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన మనమే రాజా అనే పాట ఆదిత్య మ్యూజిక్ ఛానల్ లో వన్ మిలియన్ వ్యూస్ సాధించి చార్ట్ బస్టర్ గా నిలిచింది. ఇక తాజాగా మేకర్స్ ట్రైలర్ రిలీజ్ చేశారు ట్రైలర్ లోని విశేషాలు ఏమిటంటే… శర్మతో పాటు అంబానీల జీవితాలను ఆవిష్కరించే ప్రయత్నం చేశారు మేకర్స్. శర్మ ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ అయితే అతని స్నేహితుడు అంబానీ మాత్రం షూ క్లీన్ చేస్తూ ఉంటాడు. అనుకోకుండా ఒక గ్యాంగ్ కి సంబంధించిన డైమండ్స్ మిస్ కావడంతో వీరి జీవితాలు తారుమారు అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది.

మరొకపక్క కోర్టులో ధన్య బాలకృష్ణ వాదిస్తున్న తీరు ఆసక్తికరంగా మారింది. ఇక శర్మ, అంబానీ జీవితాల్లో జరిగిన అనుకోని పరిస్థితులు ఎలాంటి పరిస్థితులకు దారి తీసాయి అనేవి ట్రైలర్లు ఆసక్తికరంగా చూపించారు. ఈ సినిమాని కార్తీక్ సాయి డైరెక్ట్ చేస్తుండగా అనిల్ పల్లాతో కలిసి భరత్ తిప్పిరెడ్డి నిర్మిస్తున్నారు. ఈ స్క్రిప్ట్ ని భరత్ తిప్పిరెడ్డితో కలిసి అనిల్ సిద్ధం చేయడం గమనార్హం. ఇక ఈ సినిమాలో మానస్ అద్వైత్, రాజశేఖర్ నర్జాల, విశ్వనాథ్ మండలిక, యష్, రూపక్ మరియు హనుమంతరావు వంటి నటులు ఇతర కీలక పాత్రలలో నటించారు. ఈ చిత్రానికి కె.ఎ.స్వామి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తుండగా, గౌతం రాజ్ నెరుసు ఎడిటర్. శశాంక్ ఆలమూరు – మహా చిత్రానికి సంగీతం అందించారు.

- Advertisement -

ధన్య బాలకృష్ణ ప్రయోగం వర్కౌట్ అవుతుందా ?

ధన్య ఇప్పటిదాకా పలు సినిమాల్లో హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించింది. తెలుగుతో పాటు తమిళ భాషలోనూ యాక్ట్ చేసింది. 2011లో తమిళ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ధన్య చిన్ని చిన్ని ఆశ అనే మూవీతో హీరోయిన్ గా మారింది. ఆ తరువాత కూడా ఒకవైపు హీరోయిన్ గా, మరోవైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తోంది. చాలాకాలం తరువాత శర్మ అండ్ అంబానీ మూవీతో డైరెక్ట్ గా ఓటిటిలోకి రాబోతోంది. మరి సిల్వర్ స్క్రీన్ పై నెమ్మదించిన ధన్య కెరీర్ ఈ ఓటిటి ప్రయత్నంతోనైనా పరుగులు తీస్తుందా? అనేది చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు