Tillu Square : 9 రోజు ఈ రేంజ్ ఫ్యామిలీ స్టార్ ని మించి.. మామూలు బీభత్సం కాదు..

Tillu Square : టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సిద్దూ జొన్నలగడ్డ నటించిన టిల్లు స్క్వేర్ థియేటర్లలో ప్రేక్షకుల్ని అలరిస్తూ అదిరిపోయే కలెక్షన్లతో అదరగొడుతున్నాడు. డీజే టిల్లు కి సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ సినిమా తెరకెక్కిందన్న విషయం తెలిసిందే. రిలీజ్ కి ముందే ఓ రేంజ్ హైప్ తో రచ్చ చేసిన టిల్లు గాడు రిలీజ్ అయ్యాక థియేటర్లలో దానికి మించి భీభత్సం చేస్తున్నాడు. తన డీజే సౌండ్ తో థియేటర్లను హోరెత్తిస్తున్నాడు. ఇక సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా నటించిన ఈ సినిమాకు సిద్ధుయే కథని అందించగా ఈ సీక్వెల్ ని దర్శకుడు మల్లిక్ రామ్ అద్భుతంగా తీసాడు. ఫస్ట్ పార్ట్ కి ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా తీయగా, కొంతమంది అంటున్నట్టు లాజిక్ ల గురించి పక్కన పెడితే టిల్లు గాడు ప్రేక్షకులని ఎంటర్టైన్ చేయడం లో మాత్రం సూపర్ సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. ఇక టిల్లు స్క్వేర్( Tillu Square) ప్రీమియర్స్ నుండే పాజిటివ్ టాక్ తో ఓ రేంజ్ కలెక్షన్లు కొల్లగొట్టగా, వీకెండ్ లోనే బ్రేక్ ఈవెన్ అయిపోవడం విశేషం. ఇప్పటివరకు 52 కోట్ల షేర్ సాధించగా, రెండో వీకెండ్ లోకి అడుగుపెట్టగా, విడుదలైన తొమ్మిదో రోజు కూడా ఏకంగా ఫ్యామిలీ స్టార్ కలెక్షన్స్ ని మించి రాబట్టడం విశేషం.

ఫ్యామిలీ స్టార్ ని మించిన.. టిల్లు స్క్వేర్ తొమ్మిదో కలెక్షన్లు..

బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపుతూ మొదటి వారాన్ని కంప్లీట్ చేసుకుని రెండో వారంలో అడుగు పెట్టిన సిద్హూ జొన్నలగడ్డ టిల్లు స్క్వేర్ రెండో వారంలో కొత్త సినిమా ఫ్యామిలీ స్టార్ నుండి పోటి ఎదురు అయినా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆ సినిమా కన్నా బెటర్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ ఇప్పుడు 9వ రోజు అంచనాలను మించి పోయి మరీ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది సినిమా. ఓవరాల్ గా 9వ రోజు 1.5 కోట్ల రేంజ్ కి పైగా షేర్ ని అందుకోవచ్చు అనుకున్నా కూడా సినిమా అంచనాలను మించి పోయి ఏకంగా 1.89 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 2.74 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. ఇక ఫ్యామిలీ స్టార్ రెండో రోజు 1.55 కోట్ల షేర్ మాత్రమే సాధించగా, టిల్లు స్క్వేర్ మరో 30 లక్షలు అదనంగా రాబట్టింది.

100 కోట్ల లాంఛనం…

ఓవరాల్ గా 9 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే తొమ్మిది రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 37.45 కోట్ల షేర్ సాధించగా, వరల్డ్ వైడ్ గా 53.25 కోట్ల షేర్ 92 కోట్ల గ్రాస్ ని రాబట్టింది. మొత్తం మీద సినిమా 28 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా మొత్తం మీద 9 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో 25.25 కోట్ల రేంజ్ లో మమ్మోత్ ప్రాఫిట్ ను సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపింది. ఇక వంద కోట్ల లాంఛనాన్ని మరో రెండు రోజుల్లో పూర్తి చేసుకుంటుండగా, ఓవరాల్ గా 110 కోట్ల నుండి 120 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేయొచ్చని అంచనా.

- Advertisement -

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు