Tillu Square : ఓవర్సీస్ లో టిల్లు గాని రచ్చ.. మీడియం రేంజ్ హీరోలకి కొత్త టార్గెట్..

Tillu Square : టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సిద్దూ జొన్నలగడ్డ నటించిన టిల్లు స్క్వేర్ థియేటర్లలో ప్రేక్షకుల్ని అలరిస్తూ అదిరిపోయే కలెక్షన్లతో అదరగొడుతున్నాడు. డీజే టిల్లు కి సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ సినిమా తెరకెక్కిందన్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా సీక్వెల్ వస్తుందన్నప్పుడే మినిమం ఇంపాక్ట్ ఉంటుందని అప్పట్లోనే ఆడియన్స్ అంచనా వేశారు. అనుకున్నట్టుగానే రిలీజ్ కి ముందే ఓ రేంజ్ హైప్ తో రచ్చ చేసిన టిల్లు గాడు రిలీజ్ అయ్యాక థియేటర్లలో దానికి మించి భీభత్సం చేస్తున్నాడు. తన డీజే సౌండ్ తో థియేటర్లను హోరెత్తిస్తున్నాడు. ఇక సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా నటించిన ఈ సినిమాకు సిద్ధుయే కథని అందించగా ఈ సీక్వెల్ ని దర్శకుడు మల్లిక్ రామ్ అద్భుతంగా తీసాడు. ఫస్ట్ పార్ట్ కి ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా తీయగా, కొంతమంది అంటున్నట్టు లాజిక్ ల గురించి పక్కన పెడితే టిల్లు గాడు ప్రేక్షకులని ఎంటర్టైన్ చేయడం లో మాత్రం సూపర్ సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. ఇక టిల్లు స్క్వేర్( Tillu Square) ప్రీమియర్స్ నుండే పాజిటివ్ టాక్ తో ఓ రేంజ్ కలెక్షన్లు కొల్లగొట్టగా, వీకెండ్ లోనే బ్రేక్ ఈవెన్ అయిపోవడం విశేషం.

వంద కోట్ల దిశగా టిల్లుగాడు..

ఇక టిల్లు స్క్వేర్ ఫస్ట్ వీకెండ్ లోనే బ్రేక్ ఈవెన్ సాధించగా, రిలీజ్ అయిన మొదటి వారంలోనే వరల్డ్ వైడ్ గా 48.71కోట్ల షేర్ 84.95 కోట్ల గ్రాస్ ని వసూలు చేసింది. ఇక తాజాగా ఈ సినిమా 52 కోట్లకి పైగా షేర్ వసూలు చేయగా, 90 కోట్ల గ్రాస్ వసూళ్ళని దాటేయగా 100 కోట్ల దిశగా దూసుకుపోతుంది. అయితే రిలీజ్ కి ముందే నిర్మాత నాగవంశి తమ సినిమా వంద కోట్లు కొల్ల గొడుతుంది అన్నారు. దానికి తగ్గట్టుగానే టిల్లు స్క్వేర్ సినిమా వంద కోట్ల కలెక్షన్స్ దిశగా పరుగులు పెడుతుంది. రెండో వారంలో కూడా స్ట్రాంగ్ గా థియేటర్లను హోల్డ్ చేసిన టిల్లు స్క్వేర్ థియేటర్లలో రెండో వీకెండ్ ముగిసే లోగా వంద కోట్ల లాంఛనాన్ని కూడా పూర్తిచేస్తుందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. పైగా రెండో వారం లో ఫ్యామిలీ స్టార్ నెగిటివ్ టాక్ తెచ్చుకోవడం టిల్లు గానికి ప్లస్ అయిందని చెప్పొచ్చు.

ఓవర్సీస్ లో భారీ రికార్డ్..

అయితే తాజాగా టిల్లు స్క్వేర్ తో సిద్ధూ జొన్నలగడ్డ ఓవర్సీస్ లో అరుదైన రికార్డు క్రియేట్ చేసాడు. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా అక్కడ ప్రీమియర్స్ నుండే రచ్చ లేపగా లేటెస్ట్ గా ఏకంగా 3 మిలియన్ల మార్క్ ని అందుకుంది సమాచారం. మీడియం రేంజ్ హీరోల్లో ఎవరికి అందని రికార్డ్ ఇది. ఇప్పటివరకు నాని, విజయ్ దేవరకొండ, వరుణ్ తేజ్ లాంటి హీరోలు ఓవర్సీస్ లో రెండు మిలియన్ల మార్క్ సినిమాలు అందుకున్నారు. కానీ టిల్లు స్క్వేర్ తో ఓవర్సీస్ లో మూడు మిలియన్ డాలర్లు వసూలు చేసి మీడియం రేంజ్ హీరోలకు కొత్త సవాల్ విసిరాడు టిల్లుగాడు. అయితే హనుమాన్ 5 మిలియన్ డాలర్లు రాబట్టినా, అది పాన్ ఇండియా సినిమాగా ఇతర భాషల కలెక్షన్లు కలిపి వచ్చింది కాబట్టి అది లెక్కలోకి రాదు. ఏది ఏమైనా టిల్లుగాడు సెట్ చేసిన ఈ 3 మిలియన్ల రికార్డుని బ్రేక్ చేసే హీరో ఎవరో చూడాలి. అయితే త్వరలో రాబోతున్న నాని సరిపోదా శనివారం, నాగ చైతన్య తండేల్ సినిమాలకు దీన్ని బ్రేక్ చేసే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు