Dasara : డే 1 రికార్డ్ నాని చేతిలోనే.. ఇక ఆ సినిమాలకే అవకాశం?

Dasara : టాలీవుడ్ లో బాక్స్ ఆఫీస్ రికార్డులు ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటాయి. ఆయా హీరోల స్టార్ డమ్ ని బట్టి కొన్ని రికార్డులు మాత్రం చాలా కాలం పదిలంగా ఉంటాయి. కానీ ఏదో ఒకరోజు అవి బ్రేక్ కాక తప్పదు. ఈ రికార్డుల వల్ల పలువురు హీరోల ఫ్యాన్స్ కూడా ఎప్పటికప్పుడు సోషల్ మీడియా లో రచ్చ చేస్తుంటారని తెలిసిందే. ఇక స్టార్ హీరోల అభిమానులు ఇందులో ముందుంటారు. ఇదిలా ఉండగా తాజాగా భారీ అంచనాల నడుమ ఆడియన్స్ ముందుకు వచ్చిన యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ఫ్యామిలీ స్టార్’. ఈ సినిమాపై టాలీవుడ్ లో భారీ అంచనాలుండేవి. పరశురామ్ విజయ్ హిట్ కాంబోతో పాటు, మృణాల్ ఠాకూర్ హీరోయిన్ కావడం వల్ల భారీ అంచనాలు ఏర్పడగా, టీజర్ ట్రైలర్స్ కూడా ఆకట్టుకోవడంతో సినిమా రికార్డ్ వసూళ్లు సాధిస్తుందని అంచనా వేశారు. కానీ మొదటి రోజు కలెక్షన్స్ పరంగా ఏమాత్రం అంచనాలను అందుకోలేక పోయింది. 70 కోట్ల కాంబో, బెస్ట్ రిలీజ్ డేట్ కుదిరినా కూడా ఫ్యాన్స్ ని డిస్సపాయింట్ చేసింది.

నాని దసరా రికార్డు పదిలం..

అయితే మీడియం రేంజ్ హీరోల్లో ఇప్పటివరకు ఫస్ట్ డే భారీ ఓపెనింగ్స్ అందుకున్న సినిమాగా న్యాచురల్ స్టార్ నాని దసరా సినిమా నిలిచింది. అయితే ఈ సినిమా రికార్డ్ ఫ్యామిలీ స్టార్ తో బ్రేక్ అవుతుంది అనుకున్నారు. ఆ సినిమా నెగిటివ్ టాక్ మూటగట్టుకుని కేవలం తెలుగు రాష్ట్రాల్లో 3.85 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ తోనే సరిపెట్టుకుంది. ఈ సినిమా నాని లాస్ట్ ఇయర్ దసరా(Dasara) తో సెట్ చేసిన డే 1 కలెక్షన్స్ రికార్డ్ లో సగంలో సగంతోనే సరిపెట్టుకుంది. దాంతో దసరా మొదటి రోజు నెలకొల్పిన 14.22 కోట్ల షేర్ మమ్మోత్ ఓపెనింగ్స్ రికార్డ్ ఇంకా పదిలంగా ఉంది. ఇక ఈ ఇయర్ ఈ రికార్డ్ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా అన్నది ఆసక్తిగా మారింది.

ఈ సినిమాలు డే 1 రికార్డ్ సెట్ చేసే ఛాన్స్..

అయితే ప్రజెంట్ ఉన్న బజ్ అండ్ క్రేజ్ దృశ్యా అప్ కమింగ్ మూవీస్ లో రెండు సినిమాలకు దసరా ఓపెనింగ్స్ ను బ్రేక్ చేసే అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు. నాని హీరోగా నటిస్తున్న కమర్షియల్ మూవీ సరిపోదా శనివారం, అలాగే నాగ చైతన్య హీరోగా నటిస్తున్న తండేల్ సినిమాలకు ఈ అవకాశం ఉందని మినిమం చెప్పొచ్చు. వీటితో పాటు కొంత మేర డబుల్ ఇస్మార్ట్ సినిమాకి కూడా అవకాశం ఉందని చెప్పొచ్చు. మరికొన్ని సినిమాలు రేసులో ఉన్నా ప్రజెంట్ ఉన్న బజ్ దృశ్యా ఈ రెండు సినిమాలకు బెస్ట్ ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. మరి వీటిలో ఏ సినిమా దసరా ఓపెనింగ్ డే 1 కలెక్షన్స్ ని బ్రేక్ చేసి కొత్త రికార్డ్ సెట్ చేయగలుగుతుందో లేదో చూడాలి. లేదా వేరే ఏమైనా సినిమా సడెన్ సర్ప్రైజ్ గా హనుమాన్ సినిమాలా బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపుతుందో అనేది చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు