Dasara: రికార్డుల జాతర సృష్టిస్తున్న దసరా సినిమా

న్యాచురల్ స్టార్ నాని నటించిన దసరా మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు కంటిన్యూ చేస్తుంది. మార్చి 30 న విడుదలైన ఈ సినిమా తొలిరోజే ప్రపంచ వ్యాప్తంగా 38 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ఇతర సినిమాలు పోటీగా రిలీజ్ అయినా, ఐపీల్ ఎఫెక్ట్ పడినా ఈ మూవీ వసూళ్లకు బ్రేక్ పాడడం లేదు. 51 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా మొదటి వీకెండ్ లోనే 80 శాతానికి పైగా రికవరీ చేసింది. ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ అయిన ఈ సినిమా కొన్ని ఏరియాల్లో మాత్రం నెమ్మదిగా పరుగులు తీస్తుంది.

తాజాగా ఈ సినిమా 6 రోజుల కలెక్షన్ల వివరాలు వచ్చాయి. 6వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 1.52 కోట్లు, వరల్డ్ వైడ్ గా 3.4 కోట్లు షేర్ వసూలు చేసింది. ఇతర భాషల్లో మామూలుగానే ఆడుతున్నాఈ సినిమా , తెలుగులో మాత్రం దుమ్ము లేపుతుంది. విడుదలైన 6 రోజుల్లోనే దసరా మూవీ తెలుగు రాష్ట్రాల్లో 36 కోట్ల 96 లక్షలు వసూలు చేయగా, 62 కోట్ల 55 లక్షల గ్రాస్ వసూలు చేసింది. ఇక వరల్డ్ వైడ్ గా ఈ సినిమా 53.52 కోట్ల షేర్ సాధించగా 96 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ఇక 7 వ రోజు తో వరల్డ్ వైడ్ గా 100 కోట్లు వసూలు చేసే అవకాశం ఉంది.

అయితే నాని దసరా సినిమా తో మరో అరుదైన రికార్డు ని తన ఖాతా లో వేసుకున్నాడు. ఈ సినిమా నైజాం లోనే 20 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. టైర్ 2 హీరోల్లో ఇప్పటి వరకు ఎవరికీ ఈ రికార్డు లేదు. ఇంకా స్టడీ వసూళ్లు రాబడుతున్న ఈ సినిమా నైజం లో ఓవరాల్ గా 25 కోట్ల వసూలు చేసే అవకాశం ఉంది. ఇక దసరా చిత్ర యూనిట్ సక్సెస్ సెలెబ్రేషన్స్ ను కరీం నగర్ లోని జగిత్యాల లో “SRR గవర్నమెంట్ ఆర్ట్స్ &సైన్స్ కాలేజీ” లో ఈ రోజు సాయంత్రం 6 గంటలకు నిర్వహిస్తున్నారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updatesWeb Stories and all the Entertainment News

 

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు