Tollywood: కోలీవుడ్ స్టార్ హీరోతో ప్రేమే ఆమె కొంప ముంచిందా..?

సినిమా ఇండస్ట్రీలో ప్రేమ, పెళ్లి పెటాకులు అవ్వటం సర్వసాధారణం అయిపోయింది ఈ మధ్య. తరచూ ఏదో ఒక జంట విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కటం, లేదా ప్రేమికుల మధ్య విభేదాలు బయటపడటం వింటూనే  ఉన్నాం. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే స్టార్ హీరోయిన్ కథ కూడా ఇంచు మించు ఈ కోవకే చెందుతుంది. టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న ఈ భామ వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న సమయంలో ఉన్నత వర్గానికి చెందిన అబ్బాయితో వివాహం చేసుకొని అందరికీ షాక్ ఇచ్చింది.

ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ హీరోయిన్ కి పెళ్ళికి ముందే ఒక హీరోతో ప్రేమ వ్యవహారం సాగిందని, అది కూడా పెళ్లి వరకు వెళ్లి క్యాన్సిల్ అయ్యిందని అప్పట్లో గాసిప్స్ తెగ వినిపించాయి. ఇదిలా ఉండగా, సదరు హీరోయిన్ కు ఒక హీరోతో మాత్రమే అఫైర్ కాక, ఇంకో కోలీవుడ్ స్టార్ హీరోతో ప్రేమాయణం పెళ్లి తర్వాత కూడా నడిచిందని టాక్ వినిపిస్తోంది. ఇండిపెండెంట్ లైఫ్ కు అలవాటు పడ్డ ఆ హీరోయిన్ పెళ్లి తర్వాత సంప్రదాయాలకు కట్టుబడి ఉండలేక అత్తారింట్లో ఇమడలేకపోయిందని అంటున్నారు.

కొన్నాళ్ల పాటు సహించిన ఆమె అత్తగారికి, ఈమెకు మధ్య తరచూ గొడవలు అవుతూ ఉండేవట. వారిద్దరి మధ్య గొడవలే సదరు హీరోయిన్ విడాకులు తీసుకోవటానికి కారణం అని కూడా తెలుస్తోంది. అంతే కాకుండా ఈమెతో ప్రేమాయణం నడుపుతున్న ఆ స్టార్ హీరో పర్సనల్ లైఫ్ కూడా డిస్టర్బ్ అయ్యి విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కేంతవరకూ వచ్చిందట. ఏదైతేనేం మొత్తానికి పెళ్లయ్యాక గుట్టుగా ప్రేమాయణం నడిపిన వీరిద్దరూ ఆ ప్రేమ కాటుకే ఇబ్బందుల పాలవడం విచిత్రం.

- Advertisement -

అయితే ప్రస్తుతం విడాకులు తీసుకొని ఒంటరిగా ఉంటున్న ఈ హీరోయిన్ వరుసగా సినిమాలు చేస్తూ ఫామ్ లో ఉన్నప్పటికీ తరచూ ఎదో ఒక కాంట్రవర్సియల్ స్టేట్మెంట్ ఇస్తూ వార్తల్లో నిలుస్తూ వస్తుంది. ఇండస్ట్రీలో పెరుగుతున్న ఈ డైవర్స్ కల్చర్ కి పాశ్చాత్య సంస్కృతి, మారుతున్న నాగరికత తీరే కారణమా లేక పడిపోతున్న మానవ సంబంధ విలువలకు ఇది నిదర్శనమా అన్నది ఆలోచించాలి. ఈ డైవర్స్ కల్చర్ సినీ ఇండస్ట్రీకి పరిమితం అయ్యిందని అనుకుంటే పొరపాటే, సామాన్య కుటుంబాల్లో కూడా ఈ మధ్య విడాకుల వ్యవహారాలు ఎక్కువవుతున్నాయి. ఎంతో విశిష్టత గల వివాహ ధర్మం ఉన్న మన దేశంలోనే ఇలా జరుగుతూ ఉండటం శోచనీయం.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు