Ustaad Bhagat Singh: ఎన్నాళ్లో వేచిన ఉదయం.. ఈ రోజే

హరీష్ శంకర్.. టాలీవుడ్ లో ఉన్న అతి తక్కువ మంది టాలెంటెడ్ డైరెక్టర్స్ లలో ఈయన ఒకరు. రీమేక్ సినిమాలను తనదైన స్టైల్ లో తెరకెక్కించి, ఫ్లాప్ ల్లో ఉన్న హీరోకు బ్లాక్ బస్టర్స్ ఇస్తాడు. హరీష్ శంకర్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ ఎంతటి విజయం సాధించిందో అందరికీ తెలుసు. ఈ సినిమా తర్వాత పవన్ , హరీష్ కాంబో సెట్ అవుతే చూడాలని ఉందని పవర్ స్టార్ ఫ్యాన్స్ చాలా రోజులుగా ఎదురుచూశారు. దాన్ని నిజం చేస్తూ హరీష్ శంకర్ ఓ పవర్ ఫుల్ స్టోరీని పవన్ కోసం రెడీ చేశాడు.

అలా పవన్ తో సినిమా చేయడానికి దాదాపు మూడేళ్ల నుంచి ఎదురుచూస్తున్నాడు. గద్దలకొండ గణేష్ సినిమా తర్వాత హరీష్ నుంచి ఒక్క సినిమా కూడా రాలేదు. అప్పటి నుంచి పవన్ సినిమాపైనే ఫోకస్ చేశాడు. ముందుగా భవదీయుడు భగత్ సింగ్ అంటూ ఓ టైటిల్ ని రిలీజ్ చేశారు. కానీ, దానికి కొన్ని మార్పులు చేసి, ఉస్తాద్ భగత్ సింగ్ అంటూ మరో టైటిల్ ను ఇటీవల విడుదల చేశారు. కానీ ఈ సినిమా కన్నా లేట్ గా ఎనౌన్స్ చేసిన PKSDT , OG సినిమాల నిర్మాణ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.

ఇప్పటికే PKSDP మూవీలో తన పార్ట్ షూటింగ్ ని కంప్లీట్ చేసాడు పవన్ కళ్యాణ్. మరో పక్క OG కి సంబంధించి లొకేషన్ హంటింగ్ కూడా అయిపొయింది. కానీ ఉస్తాద్ మూవీ మాత్రం పోస్టర్లకే పరిమితం అయింది అని PK ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నా నేపథ్యంలో హరీష్ శంకర్ ఉస్తాద్ లాంటి అప్డేట్ ఇచ్సి ఫాన్స్ కి జోష్ నింపారు. ఈ రోజు ఉదయం ట్విట్టర్ వేదికగా అయన అండ్ ది డే హాస్ అరైవ్డ్, హ్యాష్ ట్యాగ్ ఉస్తాద్ భగత్ సింగ్ అని ట్వీట్ చేసారు. అలాగే ఎన్నాళ్లో వేచిన హృదయం అనే సాంగ్ ను కూడా పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ తో ఉస్తాద్ భగత్ సింగ్ పై హరీష్ ఎన్ని అంచనాలు పెట్టుకున్నారో తెలుస్తుంది.

- Advertisement -

For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు