Ravi Teja: నాని బాటలో మాస్ మహారాజా..! 

ధమాకా, వాల్తేరు వీరయ్య వంటి వరుస హిట్స్ తో దూసుకుపోతున్న హీరో రవితేజ ఇటీవల తన సొంత సంస్థ ఆర్ టీ టీమ్ వర్క్స్ పేరిట సినిమా నిర్మాణంలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఇంతవరకు తన సినిమాలు మాత్రమే సొంత బ్యానర్ పై నిమిస్తూ వస్తున్న రవితేజ తాజాగా యంగ్ హీరో విశ్వక్ సేన్ ను హీరోగా పెట్టి ఒక సినిమా నిర్మించబోతున్నట్టు సమాచారం. ఇదే తరహాలో హీరో నాని కూడా తన సొంత నిర్మాణ సంస్థలో ఇతర హీరోలపై సినిమాలు నిర్మించి సక్సెస్ అందుకున్నారు. ఇప్పుడు నాని బాటలోనే రవితేజ కూడా వెళ్లనున్నట్టు అనిపిస్తుంది. ఇంతవరకు తన సినిమాలకు మాత్రమే నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించిన రవితేజ ఇకపై మీడియం బడ్జెట్ తో మినిమమ్ గ్యారెంటీ ఉన్న హీరోలతో సినిమాలు చేసేందుకు సిద్దం అయ్యారట.

వివరాల్లోకి వెళితే, తన దగ్గరకు వచ్చిన ఒక కథ విన్న రవితేజ ఆ కథ తనకంటే విశ్వక్ కు బాగా సూట్ అవుతుందని భావించి తన నిర్మాణంలోనే ఆ కథ తెరకెక్కించేందుకు రెడీ అయ్యారట. ఇటీవలే కన్నడ హీరో విష్ణు విశాల్ హీరోగా వచ్చిన మట్టి కుస్తీ సినిమాకు నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించి సక్సెస్ అయ్యాడు. మట్టి కుస్తీ ఇచ్చిన కాన్ఫిడెన్స్ తో ఇకపై ఇతర హీరోలను పెట్టి సినిమాలు నిర్మించేందుకు రెడీ అయినట్టు కనిపిస్తున్నాడు రవితేజ.

గతంలో కొన్ని ఇంటర్వ్యూల్లో తనకు డైరెక్షన్ అంటే ఇష్టమని చెప్పిన రవితేజ తప్పకుండా ఒక సినిమా డైరెక్ట్ చేసి తీరుతానని ధీమా వ్యక్తం చేశారు. మరి, నిర్మాత అవతారమెత్తిన రవితేజ డైరెక్టర్ గా ఎప్పుడు మారతాడో అని తన ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. బాలకృష్ణ తన వారసుడ్ని పరిచయం చేస్తూ ఆదిత్య 369కు సీక్వెల్ ను డైరెక్ట్ చేయబోతున్నట్టుగా రవితేజ కూడా తన తనయుడు మహాధన్ ను హీరో పరిచయం చేస్తూ డైరెక్టర్ అవతారం ఎత్తుతారేమో వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు