Megastar: స్పీడ్ తగ్గించిన చిరు – ఆ సినిమాల ఎఫెక్టేనా..?

రాజకీయాల నుండి తిరిగొచ్చిన మెగాస్టార్ చిరంజీవి, ఖైదీ నంబర్ 150తో రీఎంట్రీ ఇచ్చిన నాటి నుండి కేవలం సినిమాల మీదనే కాన్సంట్రేట్ చేస్తూ యువ హీరోలకు ఏ మాత్రం తగ్గకుండా ఆరు పదుల వయసులో యంగ్ లుక్ మెయింటైన్ చేస్తూ వరుస సినిమాలు చేస్తూ అందరినీ ఆశ్చర్య పరుస్తున్నారు. సైరా నరసింహారెడ్డి తర్వాత ఆచార్య వరకు కొంత గ్యాప్ వచ్చినప్పటికీ ఆ తర్వాత ఏ మాత్రం గ్యాప్ లేకుండా గాడ్ ఫాదర్ రిలీజ్ చేసి అందరిని షాక్ కి గురి చేశారు. అయితే ఆ రెండు సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడకపోవడం వల్ల వాల్తేరు వీరయ్య సినిమాకు తగిన కేర్ తీసుకొని రిలీజ్ చేసి హిట్ కొట్టారు.

ఆచార్య, గాడ్ ఫాదర్ సినిమాలు సైమల్టేనియస్ గా చేసి అంచనాలు అందుకోలేకపోవటం మెగాస్టార్ ఆలోచనలో మార్పు తెచ్చినట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం మెహర్ రమేష్ డైరెక్షన్లో భోళాశంకర్ భోళాశంకర్ సినిమాలో నటిస్తున్న చిరు, ఈ సినిమాను ఆగస్టులో రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు చిరు నుండి తన నెక్స్ట్ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ లేదు, కనీసం కథ ఫైనల్ చేసినట్టు కూడా ఏ న్యూస్ లేదు.

మెగాస్టార్ కొద్దిగా స్పీడ్ తగ్గించిన మాట నిజమే అయినప్పటికీ షూటింగ్ లేని సమయాల్లో సీనియర్, జూనియర్ అన్న తేడా లేకుండా అందరు డైరెక్టర్ల కథలు వింటున్నారని సమాచారం. దీన్ని బట్టి చుస్తే, భోళా శంకర్ రిలీజ్ అయ్యి ఆ సినిమా రిజల్ట్ వచ్చాక గానీ, చిరు ఓ నిర్ణయానికి వచ్చేట్టు కనపడట్లేదు.  చిరు స్పీడ్ తగ్గించటానికి కారణం ఆచార్య, గాడ్ ఫాదర్ సినిమాల తాలూకు ఎఫెక్ట్ కారణం అయితే, తన నెక్స్ట్ సినిమాల గురించి ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోవటం కూడా గతంలో చిరు లీక్స్ వల్ల జరిగిన నష్టమే అన్న టాక్ వినిపిస్తోంది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు