Amitab – Sanjay Dutt: టాలీవుడ్ స్టార్ట్స్ కి తాత లుగా మారిన బాలీవుడ్ స్టార్స్..!

Amitab – Sanjay Dutt : బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు అమితాబ్ బచ్చన్, సంజయ్ దత్ ఇద్దరూ కూడా స్టార్ హీరోలుగా ఒక వెలుగు వెలిగారు. వీరిద్దరి సినిమాలు బాక్సాఫీస్ వద్ద కోట్ల రూపాయలు వసూలు చేసి రికార్డు సృష్టించాయి.. ఇద్దరికీ కూడా కోట్ల మంది అభిమానులే కాదు అంతటి హోదా కూడా ఉంది.. అయితే వయసులో ఉన్నప్పుడు వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులను అలరించిన వీరు ఇప్పుడు వయసు పైబడిన తర్వాత తమలోని మరో యాంగిల్ ని ప్రేక్షకులకు పరిచయం చేస్తూ అబ్బురపరుస్తున్నారు. ఒకప్పుడు స్టార్ హీరోగా ఒక వెలుగు వెలిగిన వీరిద్దరూ ఇప్పుడు విలన్ గా, తండ్రిగా, సోదరుడిగా, గురువుగా, ఇలా పలు పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు.. అయితే ఇప్పుడు ఊహించని విధంగా తాతయ్యలుగా అలరించడానికి సిద్ధం అవుతుండడం గమనార్హం..

రామ్ చరణ్ కు తాతయ్యగా అమితాబ్ బచ్చన్…

ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్థాయిలో ఇమేజ్ సొంతం చేసుకున్న రామ్ చరణ్.. ఇప్పుడు కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే సినిమాని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.. ఈ సినిమా ఒకవైపు షూటింగ్ జరుపుకుంటుండగా.. మరొకవైపు బుచ్చిబాబు సనా తో ఒక సినిమాని తెరకెక్కించబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా పూర్తి అయి.. రాంచరణ్ పుట్టిన రోజున షూటింగ్ కూడా ప్రారంభించారు.. అయితే ఈ సినిమా ఎలా ఉంటుంది అనే విషయాన్ని పక్కన పెడితే.. ఈ సినిమా కోసం బుచ్చిబాబు సెట్ చేస్తున్న కాంబినేషన్ మాత్రం ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తోంది.

ఈ మూవీకి ఆస్కార్ గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారని ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చిన బుచ్చిబాబు.. ఇందులో శివరాజు కుమార్, జాన్వీ కపూర్, విజయ్ సేతుపతి వంటి వారిని కూడా భాగం చేసి ఆశ్చర్యపరుస్తున్నారు. అంతేకాదు ఈ ప్రాజెక్టులోకి అమితాబ్ కూడా ఇప్పుడు అడుగు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఒక కీలక పాత్ర కోసం అమితాబ్ ను ఒప్పించే పనిలో పడ్డారట బుచ్చిబాబు.. అయితే ఆ పాత్ర ఏదో కాదు రామ్ చరణ్ కి తాత పాత్ర… ఈ సినిమాలో ఆ పాత్ర చాలా కీలకమని.. అందులో అమితాబ్ బచ్చన్ అయితేనే బాగా సెట్ అవుతారని ఆయన భావిస్తున్నారట.. ఇక నిర్మాతలు కూడా బడ్జెట్ విషయంలో ఫ్రీడం ఇవ్వడంతో భారీ క్యాస్టింగ్ తోనే సినిమాలు తెరకెక్కించడానికి ప్రయత్నం చేస్తున్నారు బుచ్చిబాబు..

- Advertisement -

ప్రభాస్ తాతయ్యగా సంజయ్ దత్…

ప్రభాస్ మారుతి దర్శకత్వంలో రాజా సాబ్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. హార్రర్ , కామెడీ జానర్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇందులో సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నాడని మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఇందులో సంజయ్ ప్రభాస్ కి తాతగా నటించబోతున్నారట. అకాల మరణం చెందిన సంజయ్ దెయ్యం గా తిరిగి వస్తాడట.. ఆత్మగా మారిన తాత ప్రభాస్ జీవితాన్ని ఎలా ప్రభావితం చేశాడనే నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఇక ఈ చిత్రానికి ఎస్ ఎస్ తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.

ఇలా బాలీవుడ్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, సంజయ్ దత్ టాలీవుడ్ హీరోలకు తాతలుగా మారుతున్నారు. ( Amitab – Sanjay Dutt )

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు