Siddharth: ఫస్ట్ టైమ్ సీక్రెట్ ఎంగేజ్మెంట్ పై.. స్పందించిన హీరో సిద్ధార్థ్..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు లవర్ బాయ్ గా పేరుపొందిన హీరో సిద్ధార్థ్ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇప్పటికీ విభిన్నమైన సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు.. సిద్ధార్థ్ కెరియర్ లో నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు, ఓయ్ వంటి ప్రేమకథా చిత్రాలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు.. అయితే అనూహ్యంగా తెలుగు సినీ పరిశ్రమకు దూరమైన ఈ హీరో చాలా ఏళ్ల తర్వాత మళ్లీ మహాసముద్రం సినిమాతో రీయంట్రీ ఇచ్చారు.. గడిచిన కొన్నేళ్లుగా హీరో సిద్ధార్థ్ పేరు బాగా వినిపిస్తోంది.

అతిధి రామ్ హైదరితో సిద్ధార్థ్ డేటింగ్..
అందుకు కారణం హీరోయిన్ అదితి రావు హైదరితో ప్రేమలో ఉన్నారనే విషయం పై నిరంతరం వార్తలలో నిలుస్తూనే ఉన్నారు.. అయితే తమ ప్రేమ గురించి వస్తున్న రూమర్స్ పైన వీరిద్దరూ ఇప్పటివరకు స్పందించలేదు.. కానీ ఇటీవల వీరిద్దరి వివాహం రహస్యంగా జరిగిందనే వార్తలైతే వినిపించాయి.. తెలంగాణలోని వనపర్తి లో ఉన్న శ్రీరంగ నాయక ఆలయంలో ఇరువురు కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో వీరి పెళ్లి జరిగిందని.. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారనే రూమర్స్ కూడా బయటకు వచ్చాయి..

ఎట్టకేలకు నిశ్చితార్థం..
అంతేకాకుండా ఆ సమయంలో వీరిద్దరూ తమ నిశ్చితార్థం జరిగినట్టుగా పలు రకాల ఫోటోలను కూడా షేర్ చేశారు.. దీంతో రూమర్స్ మరింత బలంగా వినిపించడంతో తాజాగా ఈ విషయం పై సిద్ధార్థ్ మాట్లాడుతూ.. మేము రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నామని చాలామంది అనుకుంటూ ఉంటారు.. సీక్రెట్.. ప్రవేట్ అనే పదాలకు చాలా వ్యత్యాసం ఉంటుందని తెలియజేశారు.. మా నిశ్చితార్థానికి ఎవరినైతే పిలవలేదో వారంతా ఇది సీక్రెట్ వేడుక అనుకుంటారు.. నిజం చెప్పాలంటే మాది ఇరువురి కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిన ఒక ప్రైవేట్ ఫంక్షన్ కాని ఇది సినిమా షూటింగ్ కాదు.. తాను నిర్ణయించడానికి ఇది లైఫ్ టైం డేట్ కాబట్టి పెద్దల నిర్ణయం ప్రకారమే జరుగుతుందని తెలిపారు.

- Advertisement -

స్పందించిన సిద్ధార్థ్..
వాళ్లు ఎల్లప్పుడూ ఎక్కడ జరగాలనుకుంటే అక్కడే జరుగుతుందని కూడా తెలియజేశారు సిద్ధార్థ్.. మీ ప్రపోజల్ ను అంగీకరించడానికి అదితి ఎన్ని రోజులు సమయం తీసుకున్నారని యాంకర్ అడగగా.. ఈ విషయం పైన సిద్ధార్థ్ మాట్లాడుతూ.. ఈ ప్రశ్నలు నన్ను అడగవద్దు.. ఎందుకంటే తనకు ఎస్ లేదా నో అని రిజల్ట్ మాత్రమే ముఖ్యమని నేను ప్రపోజ్ చేయగానే ఆమె ఎస్ చెబుతుందా లేదా అని చాలా టెన్షన్ పడ్డాను అంటూ కూడా తెలియజేశారు అయితే చివరికి ఆమె అంగీకరించిందని తెలిపారు.. సిద్ధార్థ్, అదితి ఇద్దరు కలిసి మహాసముద్రం సినిమాలో నటించారు.. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించి ఆ ప్రేమ కాస్త ఇప్పుడు పెళ్లికి దారితీసింది.. ఇటీవలే నిశ్చితార్థం చేసుకొని అందరిని ఆశ్చర్యపరిచిన ఈ జంట మరింత రహస్యంగా వివాహం జరుపుకుంటారో చూడాలి. మొత్తానికైతే గత కొన్ని రోజులుగా డేటింగ్ చేస్తున్నారు. అంటూ వచ్చిన రూమర్లకి శుభం కార్డు పలుకుతూ నిశ్చితార్థం చేసుకున్నారు ఈ జంట. మరి వివాహం ఎప్పుడు చేసుకుంటారో..ఎప్పుడు కొత్త జీవితాన్ని మొదలుపెడతారో తెలియాల్సి ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు